స్వర్ణయుగంలో ఆ నలుగురు ఎంట్రీ...తర్వాత ఏమి జరిగింది ?

తెలుగు రాజకీయాల్లో స్వర్ణయుగం అనదగిన కాలం ఒకటి నడచింది. ఒక విధంగా అది అప్పటి పాత తరం కొత్త తరం రాజకీయాలకు సంధి యుగం అని కూడా చెప్పుకోవాల్సి ఉంది.

Update: 2026-07-21 04:21 GMT

తెలుగు రాజకీయాల్లో స్వర్ణయుగం అనదగిన కాలం ఒకటి నడచింది. ఒక విధంగా అది అప్పటి పాత తరం కొత్త తరం రాజకీయాలకు సంధి యుగం అని కూడా చెప్పుకోవాల్సి ఉంది. ఇంతకీ ఆ గోల్డెన్ యుగం ఏమిటి అంటే 1978 వ సంవత్సరం. ఈ ఇయర్ పొలిటికల్ గా తెలుగు వారికి ఎంతో గుర్తుండిపోయేదిగానే చెప్పాల్సి ఉంటుంది. ఈ ఏడాదిలో ఎంతో మంది యువ నేతలు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అందులో అత్యధికులు రాజకీయంగా సక్సెస్ లను అందుకున్నారు. కొందరు అయితే అత్యున్నత శిఖరాలను అధిరోహించారు. అంతకు ముందు తరం అంతా స్వాతంత్ర్య పోరాటం నుంచి వచ్చిన వారిది అయితే ఈ తరానిది కొత్త దశ దిశ రాజకీయాలకు తమ ప్రాంతానికి ఇచ్చే కీలక పాత్ర అని చెబుతారు.

తొలిసారి ఎమ్మెల్యేలుగా :

ఇక 1978లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి జరిగిన ఎన్నికలలో చాలా మంది కొత్త నేతలు ఎంట్రీ ఇచ్చారు. అలా చూస్తే ప్రస్తుతం ఏపీకి నాలుగవ సారి సీఎం గా వ్యవహరిస్తున్న చంద్రబాబు చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఇందిరా కాంగ్రెస్ నుంచి గెలిచి నవ యువ ఎమ్మెల్యే అయ్యారు. అలాగే రెడ్డి కాంగ్రెస్ నుంచి ఫస్ట్ టైం పొలిటికల్ గా బరిలోకి దిగి పులివెందుల నుంచి ఎమ్మెల్యే అయిన వారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అదే విధంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి తొలిసారి జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యే అయిన వారు ఎం వెంకయ్యనాయుడు. వీరితో పాటే మరో కీలక నేత కూడా అదే ఏడాది ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు. ఆయనే ఇటీవల దివంగతులు అయిన ముద్రగడ పద్మనాభం. ఆయన కూడా జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. చిత్రమేంటి అంటే ఆనాడు మొత్తం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి జనసేన తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఆయనే కావడం. ఇక వీరందరి వయసు కూడా దాదాపుగా ఒక్కటే. బాబు 28 ఏళ్ళకు ఎమ్మెల్యే అయితే వైఎస్సార్, వెంకయ్యనాయుడు 29 ఏళ్ళకు ఎమ్మెల్యేలు అయ్యారు. ముద్రగడ పాతికేళ్ళకే ఎమ్మెల్యే అయి అందరి కన్నా పిన్న వయసుగా నిలిచారు.

కీలక స్థానాల్లోకి :

ఇక చంద్రబాబు వైఎస్సార్ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలిసారి యువ మంత్రులుగా బాధ్యతలు నిర్వహించి తమ సత్తా చూపారు. ఆ తరువాత వైఎస్సార్ 35 ఏళ్ళకే పీసీసీ చీఫ్ గా అయ్యారు. చంద్రబాబు టీడీపీలో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. వెంకయ్య నాయుడు బీజేపీలో ముఖ్య పదవులు చేపట్టి రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. ముద్రగడ అయితే కాపునాడు సభ ద్వారా 1989 నాటికి ఏపీలోనే అతి ముఖ్య నేతగా మారిపోయారు. అయితే అదే టెంపోని పొలిటికల్ దూకుడుని మిగిలిన ముగ్గురూ కంటిన్యూ చేయగలిగారు అన్న విశ్లేషణలు ఉన్నాయి. చంద్రబాబు 1995లో ముఖ్యమంత్రి అయితే వైఎస్సార్ 2004లో సీఎం అయ్యారు. వెంకయ్యనాయుడు 1998లో కేంద్ర మంత్రి అయ్యారు. ఆ తరువాత బీజేపీలో జాతీయ అధ్యక్షుడు అయి ఉప రాష్ట్రపతి దాకా ఎదిగారు.

ముద్రగడ సైతం :

అయితే ముద్రగడకు కూడా ఈ ముగ్గురు నేతలకు ఉన్న సామర్ధ్యం ఇమేజ్ సత్తా అన్నీ ఉన్నాయి. కానీ ఆయన పట్టుదల గల మనిషి కావడం రాజీలేని ధోరణిలో ముందుకు సాగడం వల్లనే ఆయన మిగిలిన వారి మాదిరిగా ఉన్నత శిఖరాలకు చేరుకోలేకపోయారు అన్న వెలితి బాధ అయితే అభిమానులలో ఉంది. ఆయన పేరు 1989 నుంచి 1994 మధ్యలో ఉమ్మడి ఏపీ సీఎం పదవికి ప్రస్తావనకు వచ్చింది కానీ అది సాకారం కాలేదని చెబుతారు. పైగా ముద్రగడ పదవీ రాజకీయాలకు దూరంగా ఉంటూ రావడం వల్ల కూడా అందలాలు అందుకోలేకపోయారు అని అంటారు. ఏది ఏమైనా మిగిలిన ముగ్గురు నేతల మాదిరిగా ముద్రగడ కూడా ప్రజా నాయకుడిగా ఏపీ రాజకీయాలలో దిగ్గజ నేతగా తన పేరుని చిరస్థాయిగా చేసుకున్నారని అంటారు.

Tags:    

Similar News