ఇండియాలో రూ.10 లక్షల కోట్ల బెట్టింగ్?.. 5 లక్షల మంది లాస్!
దేశంలో ఆన్‌లైన్ బెట్టింగ్‌ను నిషేదించిన తర్వాత కూడా పెద్ద ఎత్తున అదే బెట్టింగ్ జరుగుతున్నట్లు ఒక సర్వేలో వెళ్లడి అయింది.
ఇండియాలో ఆన్‌లైన్ బెట్టింగ్‌పై నిషేదం కొనసాగుతున్నప్పటికీ ఇల్లీగల్‌గా నడుస్తూనే ఉంది. మొన్నటి వరకు ఇండియన్ స్టార్ క్రికెటర్స్, సినీ తారలు, ఎంతో మంది ప్రముఖులు ఆన్‌లైన్ బెట్టింగ్‌ను ప్రమోట్ చేసిన విషయం తెల్సిందే. అయితే ఇప్పుడు అన్ని బెట్టింగ్ యాప్స్‌ను కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఇక మీదట ఎవరు బెట్టింగ్‌ను ప్రమోట్ చేసినా కూడా కఠిన చర్యలు ఉంటాయని రూల్ తీసుకు వచ్చింది. దాంతో ఇండియాలో బెట్టింగ్ ఉండదని అంతా భావించారు. కానీ కేంద్ర ప్రభుత్వం రూల్ తీసుకు వచ్చినా కూడా బెట్టింగ్ అనేది కంటిన్యూ అవుతోంది. దేశ వ్యాప్తంగా కోట్లాది మంది బెట్టింగ్ బారిన పడి సర్వస్వం కోల్పోతున్నారు. చివరికి ఆత్మహత్య వరకు వెళ్తున్నారు. ఈ అక్రమ బెట్టింగ్‌లను అడ్డుకునేందుకు కేంద్రం ఏం చేస్తుందంటూ సామాన్యులు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు.
ఆన్‌లైన్ బెట్టింగ్‌తో సమస్య...
దేశంలో ఆన్‌లైన్ బెట్టింగ్‌ను నిషేదించిన తర్వాత కూడా పెద్ద ఎత్తున అదే బెట్టింగ్ జరుగుతున్నట్లు ఒక సర్వేలో వెళ్లడి అయింది. ఇటీవల బయటకు వచ్చిన ఒక నివేదిక ప్రకారం దాదాపు ఇండియాలో రూ.10 లక్షల కోట్ల బెట్టింగ్ మార్కెట్ నడుస్తుందట. అంతే కాకుండా ప్రతి రోజు ఇండియా వ్యాప్తంగా కోటిన్నర మంది ఆన్ లైన్ ద్వారా బెట్టింగ్ వేస్తున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా లెక్క తీసుకుంటే దాదాపుగా 8 కోట్ల మంది బెట్టింగ్ అడిక్షన్‌తో బాధపడుతున్నారట. వారు తమ వద్ద డబ్బులు ఉన్నా లేకున్నా బెట్టింగ్ పెట్టేందుకు ఎక్కడో ఒక చోట డబ్బులు తీసుకు వచ్చి పెడుతున్నారట. ఆ నివేదిక ప్రకారం 8 కోట్ల మందిఇ బెట్టింగ్‌కు అడిక్షన్ అయ్యి డబ్బులు పెడుతూ ఉంటే, అందులో దాదాపుగా అయిదు కోట్ల మంది వారు పెట్టిన పూర్తి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. కోటిన్నర మంది మాత్రం వారు పెట్టిన డబ్బులు అందుకుంటున్నారు. అతి కొద్ది మంది మాత్రమే కొంత మొత్తంలో లాభం ను సొంతం చేసుకుంటున్నారు.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో...
బెట్టింగ్ వల్ల లక్షలు, కోట్ల ఆధాయం అంటూ కొందరు చేసే ప్రచారం వల్ల ఎక్కువ మంది అటువైపు వెళ్తున్నారు. కానీ బెట్టింగ్‌లో నిజంగా కోట్లు సొంతం చేసుకున్న వారు 0.01 శాతమే అనే అభిప్రాయం ఉంది. కోట్లాది మంది బెట్టింగ్ పెడుతూ ఉంటే వందల్లో కూడా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించుకోవడం లేదు. కనుక బెట్టింగ్ అనేది ప్రాణాలతో చెలగాటం వంటిది. అందుకే దానికి దూరంగా ఉండటం చాలా ఉత్తమం. ఇప్పటికే ప్రభుత్వం బ్యాన్ చేసినా కొందరు డబ్బు కోసం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా బెట్టింగ్ ను నిర్వహిస్తున్నారు. కొందరు టెలిగ్రామ్ ద్వారా ఈ బెట్టింగ్ దందా నిర్వహిస్తూ ఉంటే, కొందరు యాప్స్ ద్వారా బెట్టింగ్ ను నిర్వహిస్తున్నారు. నిర్వాహకులు కోట్ల డబ్బు దోచుకుంటున్నారు. పోలీసులకు చిక్కకుండా బెట్టింగ్ నిర్వహిస్తున్న వారిలో పెద్ద వారు ఉన్నారనే అనుమానాలు ఉన్నాయి.
టెలిగ్రామ్ వల్ల బెట్టింగ్...
గతంలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు బాహాటంగానే బెట్టింగ్‌ను ప్రమోట్ చేయడం మనం చూశాం. టీం ఇండియా స్టార్ క్రికెటర్స్ సైతం బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశారు. టీం ఇండియా జెర్సీ స్పాన్సర్ సైతం ఒకప్పుడు బెట్టింగ్ యాప్ బ్రాండ్ ఉండేది. అందుకే ఈ స్థాయిలో బెట్టింగ్ ఇండియాలో పెరిగింది. భారీగా పెరిగిన బెట్టింగ్‌ను ఎన్ని చర్యలు తీసుకుంటున్నా తగ్గించడం సాధ్యం కావడం లేదు. టెలిగ్రాం ను బ్యాన్ చేస్తే తప్ప బెట్టింగ్ ను కాస్త అయినా తగ్గించే అవకాశం ఉంటుందని అంటున్నారు. బెట్టింగ్‌కు బలి అవుతున్న వారిలో ఎక్కువ శాతం 25 ఏళ్ల లోపు వయసు వారు ఉన్నట్లు ఒక నివేదికలో వెల్లడి అయింది. యువత బెట్టింగ్ వైపు వెళ్లకుండా ప్రభుత్వం సైతం చర్యలు తీసుకుంటూ, అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది.