ఎండీఆర్ భారం ఎంత నిజం ?!

పేమెంట్ ఇన్ఫాస్ట్రక్చర్, సైబర్ సెక్యూరిటీ, ఆపరేషన్లు, ఇన్నోవేషన్ ఖర్చులను కవర్ చేయడానికి ఉద్దేశించినది ఇది.

Update: 2026-09-16 07:48 GMT

మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR). డిజిటల్ పేమెంట్స్ స్వీకరించినప్పుడు దుకాణదారులు, వ్యాపారులు బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) వంటి వాటికి చెల్లించే రుసుము ఇది. పేమెంట్ ఇన్ఫాస్ట్రక్చర్, సైబర్ సెక్యూరిటీ, ఆపరేషన్లు, ఇన్నోవేషన్ ఖర్చులను కవర్ చేయడానికి ఉద్దేశించినది ఇది.

యూపీఐ విషయంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఈ ఎండీఆర్ ఫ్రేమ్ వర్క్ ను ప్రకటించింది. ఇది ఈ ఏడాది అక్టోబర్ 15 నుండి అమల్లోకి వస్తుందని కేంద్రం ప్రకటించింది. అయితే ఇది నేరుగా వినియోగదారుల నుంచి వసూలు చేయరని చెబుతున్నా, అంతిమంగా అది వారి మీదే పడుతుంది అన్న వాదన బలంగా వినిపిస్తున్నది.

వినియోగదారులు రూ.2 వేల చెల్లింపుల నుండి వర్తిస్తుంది. రైల్వేలు, టెలికాం, ఇన్సూరెన్స్, ఇంధనం, వ్యవసాయ సంబంధిత ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు, పశువుల పెంపకం, మ్యూచువల్ ఫండ్స్, సెక్యూరిటీస్ మీద ఇది ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.

నేరుగా ఇది వ్యాపారులు చెల్లిస్తారని చెబుతున్నారు. కానీ వారు వీటిని ఉత్పత్తి, సేవల ధరల్లో చేర్చడం మూలంగా వినియోగదారుల మీద ప్రభావం పడుతుందని అంటున్నారు. చిన్న వ్యాపారుల మీద ప్రభావం పడకున్నా పెద్ద లావాదేవీలపై ఎక్కువ భారం తప్పదని చెబుతున్నారు. అయితే చిన్న వ్యాపారుల మీద కూడా పరోక్షంగా ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఎండీఆర్ మీద 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తారని అంటున్నారు. దీంతో నిజమైన వాస్తవ ఖర్చు 0.472 వరకు పెరుగుతుందని చెబుతున్నారు. జీఎస్టీ రిజిస్టర్డ్ మర్చెంట్లు ఇన్కమ్ టాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉన్నా రిజిస్ట్రేషన్ చేసుకోని వారికి అదనపు భారం పడుతుంది.

ట్రంప్ ను బుజ్జగించేందుకు ఎండీఆర్ టాక్స్ వేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, జైరామ్ రమేష్ లు ఆరోపిస్తున్నారు. ఒకవైపు అమెరికా ఇమ్మిగ్రెంట్ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నది. భారత్ మీద 100 శాతం టారిఫ్స్ వేసే బిల్లును పాస్ చేస్తున్నది. కానీ మోడీ ప్రభుత్వం అమెరికా డిమాండ్ చేసిందని ఎండీఆర్ ఛార్జీలు విధించిందని అంటున్నారు. రాజకీయంగా అమెరికాకు సరెండర్ అయ్యారని విమర్శలు వస్తున్నాయి.

అయితే ఇది టాక్స్ కాదు. మర్చంట్ కన్వీనియన్స్ ఫీ, ఇన్ ఫ్రా, సైబర్ సెక్యూరిటీ, ఇన్నోవేషన్ కు నిధులు అవసరం అని ఎస్బీఐ మాజీ ఛైర్మన్ రజ్నీష్ కుమార్ చెబుతున్నారు. మరో వైపు పెద్ద మర్చెంట్లు క్రెడిట్ కార్డులను ప్రోత్సహించడం అమెరికా కంపెనీలకు లాభం చేకూరుస్తుందని అంటున్నారు.

Tags:    

Similar News