చంద్రబాబు మార్కు ఎంపిక!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నియామాలు చేపట్టారు. తెలుగు దేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు.;
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నియామాలు చేపట్టారు. తెలుగు దేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. లోక్‌సభ నియోజక వర్గాల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను ప్రకటించారు. సుదీర్ఘ కసరత్తు తరువాత చంద్రబాబు వీరి పేర్లని ఖరారు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సామాజిక సమీకరణాలను, సీనియార్టీ, విధేయతలని పరిగనలోకి తీసుకుని వీరిని చంద్రబాబు ఎంపిక చేశారు.
కొత్తగా నియమితులైన నేతలతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగ సమావేశం కానున్నారు. టీడీపీ పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను ముఖ్యమంత్రి సీబీఎన్ ప్రకటించారు. 25 లోక్‌సభ నియోజక వర్గాలకు అధ్యక్షులు, ప్రదాన కార్యదర్శుల నియామకం పూర్తయింది. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యతనిస్తూ సీనియార్టీ ప్రకారం పార్టీ పదవులను ప్రకటించారు. జిల్లా అధ్యక్షుల్లో బీసీ వర్గాలనికి చెందిన వారు ఎనిమిది మంది, మైనారిటీ వారు ఒకరు, ఓసీ నుంచి పదకొండు మంది, ఎస్సీ వర్గాలని సంబంధించిన నలుగురు, ఎస్టీ నుంచి ఒకరికి ప్రాధాన్యతనిచ్చారు.
ఇదే పంథాలో పార్టీ ప్రదాన కార్యదర్శుల్ని నియమించారు. అనకాపల్లి అధ్యక్షుడిగా బత్తుల తాతయ్య బాబు, ప్రధాన కార్యదర్శిగా లాలం కాశి నాయుడును నియమించారు. అదే విధంగా అరకుకు తేజోవతిని, దత్తి లక్ష్మణరావుని నియమించారు. ఇక శ్రీకాకుళం అధ్యక్షుడిగా మోదవలస రమేష్, ప్రధాన కార్యదర్శిగా పేరికట్ల విఠల్‌రావు పేర్లను ప్రకటించారు. విశాఖకు చోడే వెంకట వెంకట పట్టాభిరాం, లోడగ కృష్ణ, విజయనగరంకు కిమిడి నాగార్జున, ప్రసాదుల వరప్రసాద్, అమలాపురంకు గుత్తల సాయి, పాలం రాజు, ఏలూరు అధ్యక్షుడి బడేటి రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా యుత్తారెడ్డి జగ్గవరపును నియమించారు.
ఇక కాకినాడకు జ్యోతుల నవీన్, పెంకే శ్రీనివాస బాబు, నర్సాపురంకు మంతెన రామరాజు, పితాని మోహన్‌రావు, రాజమండ్రికి బొడ్డు వెంకటరమణ చౌదరి, కాశీ నవీన్ నియమితులయ్యారు. బాపట్ల అధ్యక్షుడిగా సలగల రాజశేఖర్ బాబు, ప్రధాన కార్యదర్శిగా నక్కల రాఘవను ప్రకటించారు. గుంటూరుకు పిల్లి మాణిక్యరావు, పోతినేని శ్రీనివాసరావు, మచిలీపట్నంకు వీరంగి గురు మూర్తి, గోవు సత్యనారాయణ పేర్లు ఖరారు చేశారు. నర్సారావు పేట అధ్యక్షుడిగా షేక్ జానే సైదా, ప్రధాన కార్యదర్శిగా నల్లపాటి రామచంద్ర ప్రసాద్ నియమితులయ్యారు.
విజయవాడకు గద్దే అనురాధ, చెన్నుబోయిన చిట్టిబాబు, చిత్తూరుకు షణ్ముగరెడ్డి, ,వై. సునీల్‌కుమార్ చౌదరి, నెల్లూరుకు బీదా రవిచంద్ర, చేదెర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, ఒంగోలుకు ఉగ్రనరసింహారెడ్డి, కొటారి నాగేశ్వరరావు, రాజంపేటకు సగవాసి ప్రసాదబాబు, పటాన్ ఖాదర్ ఖాన్, తిరుపతికి పనబాక లక్ష్మి, డాలర్ దివాకర్‌రెడ్డి, అపంతపురంకు పూలా నాగరాజు, జి. శ్రీధర్ చౌదరి, హిందూపురంకు ఎం.ఎస్ రాజు, హనుమప్ప, కడపకు చదిరిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి, వైఎస్ జిబిఉల్లా, కర్నూలుకు క్రిష్ణమ్మ, పూలా నాగరాజు యాదవ్, నంద్యాలకు గౌరు చరితారెడ్డి, ఎన్ ఎండీ ఫిరోజ్ పేర్లు ప్రకటించి బాబు తన మార్కు చూపించారు.