• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఐదేళ్లలో రూ. 9 లక్షల 75...

ఐదేళ్లలో రూ. 9 లక్షల 75 వేల కోట్ల భారం మోపారు : రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు

By - Tupaki Desk
Update: 2025-01-27 16:29 GMT

ఏపీ ఆర్థిక పరిస్థితిపై నీతి అయోగ్ ఇచ్చిన నివేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రజలకు వాస్తవాలు తెలియాల్సివుందన్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, రూపాయి ఇచ్చి పది రూపాయలు లాక్కున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నుంచి ఎలా గట్టెక్కాలా? అని ఆలోచిస్తున్నానని కాస్త ఆలస్యమైనా అన్నిరకాలుగా పుంజుకుని రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రం ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదని, 18 పెద్ద రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్య సూచీలో ఏపీ 17వ స్థానానికి పడిపోయిందని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని నీతి అయోగ్ సంచలన నివేదిక బయటపెట్టిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితిపై స్పందించిన సీఎం చంద్రబాబు.. నీతి అయోగ్ కవర్ చేయని అంశాలు కూడా కొన్ని ఉన్నాయని వైసీపీ పాలనలో లోపాలను ఎత్తిచూపారు. కరెప్షన్ గవర్నమెంటును తాను కరెక్ట్ చేస్తూ ముందుకు వెళుతున్నానని వివరించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక సుమారు రూ.9 లక్షల 75 వేల కోట్ల అప్పలు చేసిందని, కాంట్రాక్టర్లకు బకాయిలు పెట్టిందని చెప్పుకొచ్చారు. అప్పులకు వడ్డీలు కట్టలేని స్థితికి రాష్ట్రాన్ని తీసుకువచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులకు సకాలంలో వడ్డీలు చెల్లించకపోతే పరపతి పోతుందని, భవిష్యత్తులో రుణాలు లభించవని తెలిపారు. ఈ పరిస్థితి తలెత్తితే యువత ఫ్యూచర్ ప్రమాదంలో పడినట్లేనని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రాన్ని గాడిలో పెడతామనే ఉద్దేశంతోనే ప్రజలు తమను గెలిపించారని, ప్రజల నమ్మకాన్ని నిలబెడతానని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో 93% స్ట్రైక్ రేటుతో కూటమిని గెలిపించారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన పరిస్థితి ఉంది. ఆలస్యమైనా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరస్తామని సీఎం తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రం ఆదాయం పెంచుకోవడమే ముఖ్యమని, ఆదాయం పెరిగితే ప్రజలకే మేలు జరుగుతుందని వివరించారు. అదే సమయంలో అంతా సెట్ అయినంతవరకు ప్రజలను వెయిట్ చేయమని చెప్పడం కుదరదని, సంక్షేమ పథకాలపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే కీలకమైన తల్లికి వందనం, అన్నదాతా సుఖీభవ పథకాలపై వర్క్ అవుట్ చేస్తున్నట్లు వెల్లడించారు.

రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బులు ఉన్నా, పంచడం లేదని ప్రచారం చేస్తున్నారని, అందులో నిజం లేదని వివరించారు. కూటమి గెలిచిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఉదారంగా సాయం చేస్తోందని తెలిపారు. అమరావతి కోసం రూ.15 వేల కోట్లు, విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం రూ.11,440 కోట్లు, పోలవరం కోసం రూ.20 వేల కోట్లు ఇచ్చేందుకు ముందుకొచ్చిందని తెలిపారు. ఈ డబ్బును ఆయా పథకాలకే వినియోగిస్తానని సీఎం స్పష్టం చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులను ఇతర పథకాలకు మళ్లించడాన్ని తాను అంగీకరించనని తెలిపారు. గత ప్రభుత్వంలో 94 శాఖల నుంచి నిధులు తీసుకుని దేనికీ బిల్లులు చూపలేదని ఆక్షేపించారు. తమ ప్రభుత్వం నిధులు అడిగితే ముందు తీసుకున్న డబ్బు లెక్క చెప్పమని అడుగుతున్నారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో 73 శాఖల నుంచి లెక్కలు తీసుకుని కేంద్రానికి యూసీ (యుటిలిటీ సర్టిఫికెట్లు) సమర్పించినట్లు సీఎం వెల్లడించారు. ఇంకా 21 శాఖల లెక్కలు సమర్పించాల్సివుందన్నారు.

ప్రభుత్వమంటే నిరంతర ప్రక్రియగా చెప్పిన సీఎం.. ప్రజలు పనిచేసే ప్రభుత్వాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. నిరంతరం ఓ ప్రభుత్వాన్ని ఆదరిస్తే రాష్ట్రం డెవలప్ అవుతుందని అన్నారు. గుజరాత్ లో 30 ఏళ్లుగా ఒకే ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం వల్ల అభివృద్ధిలో దూసుకుపోతోందని అదే సమయంలో పంజాబ్ రాష్ట్రంలో ప్రతిసారి ప్రభుత్వం మారడం వల్ల అభివృద్ధిలో వెనకబడిందని ఉదహరించారు. అదేవిధంగా ప్రభుత్వం తీసుకువచ్చే పాలసీలు కూడా అభివృద్ధికి ఊతమిస్తాయన్నారు. 1978లో చైనా ఆర్థిక సంస్కరణలు తీసుకురావడంతో ప్రస్తుతం సూపర్ పవర్ గా ఆవిర్భవించిందని, అదే సమయంలో ఆర్థిక శక్తిగా ఉన్న రష్యా రాజకీయ సంస్కరణలను ఎంచుకుని కుదేలైందని వివరించారు.

గత ఐదేళ్లు దెబ్బతిన్నామని తమకు అవకాశమిచ్చారని, ఐదేళ్ల సమయమంటే సాధారణ విషయం కాదన్నారు. గతించిన కాలాన్ని తిరిగి తీసుకురాలేమని, ఆ ఐదేళ్లలో జరిగిన విధ్వంసం నుంచి బయటపడాలంటే చాలా కష్టపడాల్సివుందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల నుంచి ఎలా బయట పడతారని చాలా మంది ఆర్థిక వేత్తలు తనను ప్రశ్నిస్తున్నారని, అన్నింటికీ కాలమే సమాధానమిస్తుందన్నారు. సంపద పెంచి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని మరోమారు స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు.. తాను ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించడం లేదని, వ్యవస్థలను నాశనం చేసిన వారు గొప్పలు చెప్పుకోవడమే ఆశ్చర్యంగా ఉందని పరోక్షంగా మాజీ సీఎం జగన్ ను విమర్శించారు. గత ప్రభుత్వంలో ఓ పద్ధతి ప్రకారం పనిచేస్తే ఇన్ని ఇబ్బందులు ఉండవని గుర్తు చేశారు.

బాబు గారు బాగు చేస్తారని ఓటేశామని సామాన్యులు భావిస్తున్నారని, అంతా ప్రస్తుత పరిస్థితులను అవగాహన చేసుకోవాలని కోరారు. సమయం తీసుకున్న ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఎవరి ఆధ్వర్యంలో అభివృద్ధి జరుగుతుందనేది ప్రజలు గుర్తించాలని కోరారు. డబ్బులిస్తున్నామని చెప్పి ప్రజలను శాశ్వతంగా పేదరికంలోకి నెట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపేందుకు పది పాలసీలను రూపొందించుకున్నామని, ఆ ప్రకారం ముందడుగు వేస్తామని, త్వరలోనే అన్ని సమస్యలను అధిగమించేలా పనిచేస్తున్నామని సీఎం వెల్లడించారు.

Tags:    
  • ChandrababuNaidu 
  • APPolitics 
  • AndhraPradeshEconomy 
  • NitiAayogReport 
  • YCPAdministration 
  • APDevelopment 
  • ChandrababuVision 
  • FinancialDiscipline 

Similar News

బ్యూరోక్రాట్స్ హిట్ కొట్టలేకపోతున్నారు..రీజన్ అదే ?

2026-11-04 18:30 GMT

కోస్తా గేట్ తాకని వైసీపీ...సేమ్ సీన్ రిపీట్

2026-11-04 18:03 GMT

విశాఖ డిప్యూటీ మేయర్ మీద బీజేపీ కర్చీఫ్ ?

2026-11-04 18:01 GMT

ఎన్టీఆర్ ఆత్మ గౌరవ నినాదం...కేటీఆర్ కామెంట్స్ వెనక ?

2026-11-04 18:01 GMT

బ్యాలెట్ పేపర్లే.. కానీ కౌంటింగ్ మాత్రం రాకెట్ స్పీడ్.. అమెరికా ఎన్నికల్లో అసలు టెక్నాలజీ ఇదే..

2026-11-04 18:00 GMT

భారత్, చైనా సహా ఈ నాలుగు దేశాలకు హార్మూజ్ ను ఓపెన్ చేసిన ఇరాన్.. కానీ ట్విస్ట్

2026-11-04 17:52 GMT

పవన్ ఇలాకాలో ఏంటీ తేడా...బిగ్ నంబర్ తోనే !

2026-11-04 17:46 GMT

జగన్ బాస్...ఓడించింది బోస్ !

2026-11-04 16:15 GMT

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

Copyright @2026

Powered by Blink CMS