ఏపీలో బంగారు కుటుంబాలు ఒకే.. మార్గదర్శకులే ఎవరు...?
తాజాగా కూడా తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన సందర్భంగా లక్ష మంది మార్గదర్శకులు.. 15 లక్షల మంది బంగారు కుటుంబాలు అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.;

ఒక లక్ష్యం.. సాధించేందుకు కొంత కృషి, మరికొంత పట్టుదల అవసరం. ఈ రెండు ఉన్నా.. ఒక్కొక్కసారి లక్ష్యాన్ని సాధించడం కష్టతరంగా మారుతుంది. ఎందుకంటే.. కొన్ని అంతే.. మన చేతుల్లో ఉండవు కాబ ట్టి. ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు విషయాన్ని పరిశీలించినా.. ఇదే పరిస్థితి కనిపిస్తోంది. బంగారు కుటుంబాలు-మార్గదర్శకుల కాన్సెప్టుతో సీఎం చంద్రబాబు పీ-4 విదానాన్ని తెరమీదికి తెచ్చారు. అయితే.. ఇది సాకారం కావడం ఎంత వరకు? అనేది ప్రశ్న.
తాజాగా కూడా తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన సందర్భంగా లక్ష మంది మార్గదర్శకులు.. 15 లక్షల మంది బంగారు కుటుంబాలు అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఈ లెక్క ప్రచారం.. ఒక్కొక్కరు 15 మందిని దత్తత తీసుకుని .. వారిని జీవితంలో అభివృద్ధి చేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు. దీనిలో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు కూడా ఉండడం గమనార్హం. ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు ఇదే విషయాన్ని వెల్లడించారు.
ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు కూడా.. ముందుకు రావాలని ఆయన సూచించారు. ఈ క్రమంలోనే లక్ష్యాన్ని పెద్ద గానే పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. అయితే.. ఇప్పుడు మార్గదర్శకుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఎందు కంటే.. లబ్ధిదారుల సంఖ్యతో పాటు.. వీరి సంఖ్య కూడా పెరగాల్సి ఉంటుంది. లేని పక్షంలో ఇబ్బంది అవుతుంది. అందుకే.. మంత్రుల నుంచి ఎమ్మెల్యేలు వరకు కూడా చంద్రబాబు మార్గదర్శకులుగా చేరి.. పేదలను దత్తత తీసుకోవాలని చెబుతున్నారు.
వచ్చే నాలుగేళ్లలో 15 లక్షల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకురావాలన్న సంకల్పం మంచిదే అయినా.. దీనికి సంబంధించిన మార్గదర్శకుల వ్యవహారమే ఇబ్బందిగా మారింది. ఇప్పటికే వారిపై కార్పొ రేట్ సోషల్ రెస్పాన్స్ కింద వారు సాయం చేస్తున్నారు. ఇక, ఇప్పుడు మరిన్ని భారాలు అంటే కష్టమే. అందుకే.. ఈ వ్యవహారంలో కొంత వెసులుబాటు ఉన్నా.. మరికొంత వెనుకబాటు కనిపిస్తోంది. చంద్రబాబు లక్ష్యం మంచిదే అయినా.. ఏమేరకు దీనిని సక్సెస్ చేస్తారన్నది చూడాలి.