ఎక్కడ చూసినా బాబే

చంద్రబాబు చేసే వరస పర్యటనలు చూసినా అయన బిజీ షెడ్యూల్ చూసినా ఎవరికైనా వామ్మో అనిపిస్తుంది. అయనకు అలుపు ఉండదా లేక ఆయన అన్నింటికీ అతీతమా అన్న సందేహాలు కూడా వస్తాయి.;

Update: 2025-08-31 09:30 GMT

చంద్రబాబు కి ఒక పేరు ఉంది. ఆయన పని రాక్షసుడు అన్నది ఆయనకు అసలైన పేరు. దాన్ని రాజకీయ ప్రత్యర్థులు సైతం అంగీకరిస్తారు. బాబు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎపుడూ జనంతోనే ఉంటారు. జనంతోనే మమేకం అవుతారు. అధికారంలో ఉన్నాం కదా అని అసలు రిలాక్స్ కారు. ఆ పదం అన్నది అయన పొలిటికల్ హిస్టరీలో లేదు అనే చెప్పాలి. ఉదాహరణకు చూస్తే కనుక నాలుగవసారి ముఖ్యమంత్రి ఆయిన తరువాత బాబు తన జోరు మరింతగా పెంచేసారు. ఏడున్నర పదులు వయసు కూడా జస్ట్ ఒక నంబర్ గానే బాబుకు వుంది అంటున్నారు. నిజం చెప్పాలనంటే నవ యువకుల కంటే కూడా బాబు మరింత ఎక్కువగా కష్టపడుతున్నారు అని అంటారు.

ప్రతీ రోజూ సభలే :

చంద్రబాబు చేసే వరస పర్యటనలు చూసినా అయన బిజీ షెడ్యూల్ చూసినా ఎవరికైనా వామ్మో అనిపిస్తుంది. అయనకు అలుపు ఉండదా లేక ఆయన అన్నింటికీ అతీతమా అన్న సందేహాలు కూడా వస్తాయి. దేశంలో ఏ నాయకుడూ చేయనన్ని పర్యటనలు బాబు చేస్తున్నారు అంటే గ్రేట్ అనుకోవల్సిందే. ఒకే రోజు రెండు మూడు పర్యటనలు కూడా చేస్తూ బాబు ఆదరగొడుతున్నారు. ఈ విషయంలో బాబుని ఎంతైనా మెచ్చాల్సిందే అని అంటున్నారు.

బాబుకు సరిసాటి బాబే :

అవును ఇదే అంతా అంటున్నారు. బాబు ఎనర్జీ లెవెల్స్ ని కానీ అయన స్పీడ్ ని కానీ బ్యాలెన్స్ చేసే వారు ఎవరూ లేరనే అంటున్నారు. దేశంలో చూసినా ఇంతలా జనంతో కలియతిరిగే నాయకుడు లేనే లేరు అని చెప్పాలి. బాబుకు ఇంతటి సుదీర్ఘమైన రాజకీయ జీవితం ఊరకే అయితే రాలేదు. అంతా అయన రెక్కలు కష్టమే అని విశ్లేషించాలి. చేసిన పని జనం లో చెప్పుకోవాలి. నిరంతరం ఆశవాహ వాతావరణం కల్పించాలి. సమస్యలు అన్నీ ఎవరూ తీర్చలేరు. కానీ కనీసం ఆలకించాలి. నేను ఉన్నాను ఆని గట్టి భరోసా అయినా ఇవ్వాలి. అది ఉత్తమ నాయకుడు లక్షణం. బాబులో ఇవి నిండుగా మెండుగా ఉన్నాయి. అందుకే బాబుని అంతా తలచుకునేది. ఇతర నాయకులు కూడా ఆయనను స్ఫూర్తి గా తీసుకుంటే వారి రాజకియం కూడా రాణిస్తుంది.

Tags:    

Similar News