అలా చేస్తే.. ఆస్తులు పోతాయ్: చంద్రబాబు హెచ్చరిక
ఇంత కఠినంగా ఉండకపోతే డ్రగ్స్ భూతాన్ని తరిమి కొట్టడం సాధ్యం కాదన్నారు. అందుకే.. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.;
ఔను.. నిజమే! స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబే హెచ్చరించారు. ఇదేదో ఆన్ లైన్ బెట్టింగ్ కారణంగానో.. లేక ఫ్రాడ్ కాల్స్ గురించో కాదు.. డ్రగ్స్ మహమ్మారి గురించి ఆయన బలమైన హెచ్చరిక చేశారు. డ్రగ్స్ వినియోగించినా.. సరఫరా చేసినా.. రవాణా చేసినా.. డ్రగ్స్ డీలర్లతో సంబంధాలు పెట్టుకున్నా.. నిర్దాక్షి ణ్యంగా వారి ఆస్తులను ప్రభుత్వం జప్తు చేస్తుందని ఆయన హెచ్చరించారు. ఇంత కఠినంగా ఉండకపోతే డ్రగ్స్ భూతాన్ని తరిమి కొట్టడం సాధ్యం కాదన్నారు. అందుకే.. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.
రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయిపై యుద్ధం ప్రకటిస్తున్నట్టు చంద్రబాబు స్పష్టం చేశారు. ``నేను చేసే ఈ యు ద్దానికి అందరూ సహకరించాలి. కాదు కూడదని ఎవరైనా అడ్డువస్తే తొక్కుకుంటూ పోతాం. నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తాం`` అని తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. ``డ్రగ్స్ వద్దు బ్రో`` బ్యానర్ పట్టుకుని గుంటూరులో గురువారం రాత్రి నిర్వహించిన ర్యాలీలో కిలో మీటరు మేర విద్యార్థులు, సామాజిక ఉద్యమకారులు, మం త్రులు, పోలీసులతో కలిసి చంద్రబాబు వాకథాన్ నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో డ్రగ్స్ రహిత ఏపీకి కృషి చేస్తామంటూ.. విద్యార్థులు, స్థానికు లతో ప్రతిజ్ఞ చేయించారు. యువతను గంజాయి, డ్రగ్స్‌కు బానిస చేసి.. సమాజాన్ని పీడిస్తున్న మాఫియా ను తరిమేద్దామని ఈ సందర్భంగా సీఎం పిలుపునిచ్చారు. ఇదేసమయంలో ఆయన తల్లిదండ్రులకు కీలక సూచనలు చేశారు. ఒక్కసారే కదా.. అని పిల్లలు తప్పు చేస్తే చూస్తూ ఊరుకోవద్దని సూచించారు. డ్రగ్స్‌కు ఒక్కసారి అలవాటు పడితే.. అది జీవితాలను, సమాజాన్ని చివరకు రాష్ట్రాన్ని కూడా నాశనం చేస్తుందన్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు.
అంతేకాదు.. పిల్లలు తప్పు చేసినా.. తల్లిదండ్రులకు శిక్ష పడుతుందని.. వారు కష్టపడి సంపాయించుకు న్న ఆస్తులు పోతాయని హెచ్చరించారు. ``గంజాయి రవాణ, సాగు చేసే వారికి అల్టిమేటం జారీ చేస్తున్నా. సాగుచేసినా, బయట నుంచి తీసుకువచ్చి విక్రయించినా సహించేది లేదు. ఏజెన్సీ ఏరియాలో గంజాయి సాగు చేసే వారికి ప్రత్యామ్నాయాలు చూపాం. ఇంకా అదే పని చేస్తామంటే చూస్తూ ఊరుకోం. టెక్నాలజీతో డ్రోన్లు వినియోగించి నేర నియంత్రణ చేస్తున్నాం`` అని స్పస్టం చేశారు.