అందరూ వరి వేస్తే తినేవాళ్లు లేరు.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

ఇక తాజా అధ్యయనాల ప్రకారం మన దేశంలో ఇటీవల డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. సుమారు 10.1 కోట్ల మంది భారతీయులు డయాబెటిస్‌తో బాధపడుతున్నారని ఓ అంచనా.;

Update: 2025-11-12 16:15 GMT

వరి పంటపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం అన్నమయ్య జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ సభలో ప్రసంగించారు. రైతులను ఉద్దేశించి మాట్లాడిన చంద్రబాబు నీళ్లు ఉన్నాయని అందరూ వరి వేస్తే తినేవాళ్లు ఎవరూ లేరని స్పష్టం చేశారు. ఇప్పుడు అందరికీ డయాబెటిస్ వస్తుంది. ఎవరూ అన్నం తినడం లేదు. ప్రజలు ఎలాంటి తిండి తింటారో.. రైతులు దాన్ని ఉత్పత్తి చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రజలను మనం ఫోర్స్ చేయలేం.. మీరే తెలివిగా ఉండాలని రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.

డయాబెటిస్ ఉన్న వారు ఇప్పుడు ఎక్కువగా కూరగాయలు, మాంసం, కోడిగుట్లు తింటున్నట్లు చంద్రబాబు తెలిపారు. రైతులను ఉద్దేశించి సీఎం చేసిన ఈ వ్యాఖ్యలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇటీవల కాలంలో డయాబెటిస్ రోగులు ఎక్కువ అవుతున్నారు. తెల్ల బియ్యంతో తయారు చేసిన అన్నంలో కార్బోహైడ్రేట్స్ (పిండి పదార్థాలు) అధికంగా ఉంటాయి. దీనివల్ల షుగర్ వ్యాధి ఎక్కువ అవుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పిండిపదార్థాల వల్ల గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది.

గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఆహారం తిన్న తర్వాత అది రక్తంలో చక్కెర స్థాయి చెప్పే కొలమానం. తెల్ల బియ్యం GI విలువ అధికంగా ఉండటం వలన, తిన్న వెంటనే అది త్వరగా గ్లూకోజ్‌గా మారి రక్తంలోకి విడుదల అవుతోంది. ఇది డయాబెటిస్ పెరిగేందుకు కారణమవుతోందని అంటున్నారు. ఈ కారణం వల్ల ఎక్కువ మంది అన్నం తినేందుకు ఇష్టపడటం లేదు. తెల్ల బియ్యం అన్నం బదులుగా బియ్యం, ముడి బియ్యం లేదా తక్కువ కార్బోహైడ్రేట్లు, ఎక్కువ ఫైబర్ ఉన్న చిరుధాన్యాలు తీసుకుంటున్నారు. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం వరికి బదులుగా ఇతర పంటలను పండించాలని రైతులను విశ్లేషిస్తున్నట్లు చెబుతున్నారు.

ఇక తాజా అధ్యయనాల ప్రకారం మన దేశంలో ఇటీవల డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. సుమారు 10.1 కోట్ల మంది భారతీయులు డయాబెటిస్‌తో బాధపడుతున్నారని ఓ అంచనా. జాతీయ స్థాయిలో చూస్తే డయాబెటిస్ రోగుల సంఖ్య ఏడాదికేడాది పెరిగిపోతోందని వైద్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఏపీలో కూడా డయాబెటిస్ రోగుల సంఖ్య తీవ్రంగా ఉందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-5) వంటి నివేదికల ప్రకారం పురుషులలో సుమారు 10.5%, మహిళలలో 8.7% మంది అధిక రక్త చక్కెర స్థాయిలు (డయాబెటిస్)తో బాధపడుతున్నట్లు వెల్లడైంది.

Tags:    

Similar News