నాలుగు గోడలు దాటి వెళ్ళండి...బాబు దిశా నిర్దేశం

అధికారులు, ఉద్యోగుల నెలవారీ పనితీరును, నైపుణ్యాలను కూడా ఎప్పటికప్పుడు అంచనా వేసుకుని ముందుకు వెళ్తామన్నారు.

Update: 2026-07-15 00:30 GMT

అధికారులు ఏ ప్రభుత్వంలోనైన అత్యంత కీలకంగా ఉంటారు. ఒక విధంగా చూస్తే ప్రభుత్వం అంటే వారే. కళ్ళూ ముక్కూ చెవి ఇలా ప్రధాన అంగాలుగా అధికారులే కనిపిస్తారు. ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయం అయినా అలాగే ఏ విధానం అయినా జనంలో ఉంచి అమలు చేయాల్సింది అధికారులే. అది విజయవంతం అయితే ఆ ఫలాలు ప్రజలకు నేరుగా చేరుతాయి. వటిని రూపొందించిన పాలకులకు కూడా మంచి పేరు వస్తుంది. ఇక అమలు చేసిన అధికారులు అయితే మంచి పనితీరు కనబరచారు అని మెప్పు పొందుతారు. అందుకే అధికారులే ప్రభుత్వ రధ చక్రాలుగా భావిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు వారికి దిశా నిర్దేశం చేశారు.

రియల్ టైం రిజల్ట్స్ కావాలి :

రాష్ట్రంలో ప్రజా సమస్యలు సత్వరం పరిష్కారం కావాలని కూటమి ప్రభుత్వం ఆశిస్తోంది. ఆ దిశగా అధికార యంత్రాంగం పనిచేయాలని చంద్రబాబు ఆదేశించారు. డేటా డ్రివెన్ గవర్నెన్సుతో రియల్ టైమ్ రిజల్ట్స్ సాధించాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. డేటా డ్రివెన్ గవర్నెన్సు ఆధారంగా పాలనను మరింత సులభతరం చేయాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. దీని కోసం దేశంలోనే మొదటిసారిగా మంత్లీ ఎకనామిక్ రిపోర్టుల ద్వారా వృద్ధిని సమీక్షించుకుంటున్నామని చంద్రబాబు చెప్పడం విశేషం. అంతే కాదు ఇక నుంచి ప్రతీ నెలా నెలవారీ ఆర్థిక నివేదికలను విడుదల చేస్తామని దానికి అనుగుణంగా రాష్ట్ర పురోగతి కోసం ప్రభుత్వ శాఖలు పనిచేయాలని బాబు చెప్పారు. నెలవారీ ఆర్ధిక నివేదికల ద్వారా ఎప్పటికప్పుడు రెవెన్యూ రాబడులను అంచనా వేసేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. అధికారులు, ఉద్యోగుల నెలవారీ పనితీరును, నైపుణ్యాలను కూడా ఎప్పటికప్పుడు అంచనా వేసుకుని ముందుకు వెళ్తామన్నారు.

అద్భుతం అనిపించుకోవాలి :

ఇదిలా ఉంటే అధికారులు అద్భుతం అనిపించుకోవాలని బాబు కోరారు. ఉన్నతాధికారులు ఎప్పటికపుడు క్షేత్రస్థాయిలోనూ పర్యటించాలని సూచించారు. ప్రజల సమస్యలతో పాటు స్థానిక వాస్తవాలు తెలియాలంటే క్షేత్రస్థాయికి వెళ్లాల్సిందేనని బాబు స్పష్టం చేశారు. అధికారులు వినూత్న ఆలోచనలతోనే సుపరిపాలనను క్షేత్రస్థాయికి తీసుకువెళ్లాలని ఆయన కోరారు. ఒక మంచి అధికారి సమస్యలను పరిష్కరిస్తే అద్భుతంగా పనిచేసినట్లు అని ఆయన అన్నారు. అసలు సమస్యలనేవే తలెత్తకుండా చూడాలనే కోణంలోమే అధికారులు అంతా లక్ష్యంగా చేసుకుని పనిచేయాలని చంద్రబాబు కోరారు. ముందుచూపుతో అంతా పనిచేస్తేనే మెరుగైన పాలనను ఫలితాలను ప్రజలకు అందించగలమని బాబు నొక్కి చెప్పారు.

అధికారులు వెళ్తేనే :

ముఖ్యమంత్రి తరచూ అధికారులు గ్రౌండ్ లెవెల్ లోకి వెళ్ళాలని కోరుతూ వస్తున్నారు. ఎందుకంటే అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తే వారికి వాస్తవాలు అర్ధం అవుతాయి. ప్రభుత్వం వైపు నుంచి వారు దానికి తగిన పరిష్కారలను సూచించగలరు, అంతే కాదు వారికి నేరుగా ప్రజల నుంచే సమాచారం వస్తుంది. అది ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. దాని వల్ల అధికార యంత్రాంగానికి ఎంతో ప్రయోజనం ఉంటుంది. అందుకే చంద్రబాబు పదే పదే అధికారులను క్షేత్ర స్థాయిలోకి వెళ్ళమని కోరుతున్నారు. మరి ఉన్నతాధికారులు ఆ దిశగా అడుగులు వేస్తారా అన్నదే ఇపుడు చర్చగా ఉంది.

Tags:    

Similar News