జగన్ “పసుపు చీర” కామెంట్లు... ఆన్ లైన్ లోకి వచ్చిన చంద్రబాబు!

ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కిపోతుంది. ఏ చిన్న అవకాశం దొరికినా ప్రత్యర్థులపై విరుచుకుపడిపోతున్నారు నేతలు.

Update: 2024-04-25 09:27 GMT

ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కిపోతుంది. ఏ చిన్న అవకాశం దొరికినా ప్రత్యర్థులపై విరుచుకుపడిపోతున్నారు నేతలు. ఈ సమయంలో కొంతమంది లాజికల్ గా విమర్శిస్తుంటే.. మరికొంతమంది శృతి మించిన విమర్శలు చేస్తున్నారు. ఇంకొంతమంది విమర్శల మాటున గురివింద కబుర్లు చెబుతున్నారనే కామెంట్లూ వినిపిస్తున్నాయి! ఈ సమయంలో తాజాగా వైఎస్ జగన్ పై చంద్రబాబు ఆన్ లైన్ వేదికగా స్పందించారు!

అవును... ఈ రోజు నామినేషన్ సందర్భంగా కడప పర్యటనకు వెళ్లిన జగన్... పులివెందులలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా భాగోద్వేగానికి గురైన జగన్... పులివెందుల అంటే ఒక విజయగాధ అని వెల్లడించారు. ఏపీ రాజకీయాల్లో తన తండ్రి వైఎస్సార్ పేరు చెరిపేయాలని కొంతమంది కంకణం కట్టుకున్నారని దుబ్బయట్టారు!

ఈ నేపథ్యంలో... వైఎస్సార్ పైనా, తనపైనా బురద జల్లడానికి, లేనిపోని ముద్రలు వేయడానికి చంద్రబాబు, దత్తపుత్రుడు, వదినమ్మ ప్రయత్నిస్తున్నారని చెప్పిన జగన్... మీ బిడ్డను ఎదుర్కొనలేక వీళ్లంతా ఏకం అయ్యారని.. వీరితోపాటు నా ఇద్దరు చెల్లెమ్మలలు కూడా ఆ కుట్రలో భాగం అయ్యారని తెలిపారు. ఈ క్రమంలోనే... పసుపు చీరలు కట్టుకుని వైఎస్సార్‌ శత్రువులతో చేతులు కలిపిన వాళ్లు, ఆ పార్టీలో చేరిన వాళ్లు వైఎస్సార్‌ వారసులా? అంటూ నిప్పులు చెరిగారు జగన్.

Read more!

దీంతో ఈ విషయంపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ సందర్భంగా ఆన్ లైన్ వేదికగా స్పందించిన ఆయన... "తోడబుట్టిన చెల్లెలి పుట్టుక పైనా... మహాలక్ష్మీగా భావించే ఇంటి ఆడబిడ్డ కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఒక ముఖ్యమంత్రా? ఎంత నీచం! ఇది కాదా వికృత మనస్తత్వం?" అని ట్వీట్ చేశారు.

ఇలా జగన్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు రియాక్ట్ అయిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఇక కామెంట్ సెక్షన్ లో జరుగుతున్న యుద్ధం గురించి చెప్పే పనే లేదు!

Tags:    

Similar News