• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అమ్మాయిని రక్తం వచ్చేలా...

అమ్మాయిని రక్తం వచ్చేలా కొట్టిన అధికారి... షాకింగ్ వీడియో!

| అవును... ఇటీవల జరిగిన ఓ దాడి ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

By - Tupaki Desk
Update: 2025-01-25 23:30 GMT

విచక్షణ కోల్పోయో, మానవత్వం మరిచిపోయో, ఇంగితం వదిలేసో తెలియదు కానీ ఓ అమ్మాయిపై ఓ భద్రతా అధికారి విచక్షణా రహితంగా దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తీవ్రంగా వైరల్ అవుతుంది. ఈ ఘటనపై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. అమ్మాయిపై దాడికి పాల్పడ్డ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

అవును... ఇటీవల జరిగిన ఓ దాడి ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనికి సంబంధించి తెలుస్తున్న వివరాల ప్రకారం... వార్ధాలోని మహాత్మ గాంధీ ఇంటర్నేషనల్ హిందీ యూనివర్శిటీకి చెందిన సుధీర్ ఖార్కటే అనే భద్రతా అధికారి... రుచికా ఠాకరే అనే అమ్మాయిపై అత్యంత పాశవికంగా దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఈ ఘటనకు సంబంధించిన వ్యవహారం అంతా కెమెరాలో బంధించబడింది. ఈ వీడియోలో బైకర్, ఫిట్ నెస్ యాక్టివిస్ట్ అయిన రుచిక తన బైక్ పై నిలబడి ఉండగా.. ఈ సమయంలో కారులో వచ్చిన సుధీర్ ఖార్కటే ఆమెపైకి దూసుకెళ్లాడని.. దీంతో ఆమె కిందపడిపోయిందని అంటున్నారు. ఈ సమయంలో ఆమె తనకు కలిగిన అసౌకర్యంపై ప్రశ్నించే ప్రయత్నం చేసిందని అంటున్నారు.

ఈ సమయంలో.. సుధీర్ తో పాటు అతని భార్యగా చెబుతున్న మహిళ కారులో నుంచి బయటకు వచ్చి ఆమెపై దాడి చేయడం ప్రారంభించారు. ఈ సమయంలో సంస్కారం మరిచిన, విజ్ఞత విడిచిన వ్యక్తిగా అన్నట్లుగా సదరు సుధీర్ అనే వ్యక్తి బాలిక ముఖ్యంపై కొడుతూ దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది.. నోటి నుంచి రక్తం కారుతూ కనిపించింది.

దీనికి సంబంధించిన వీడియో నెట్టింట ప్రత్యక్షమవ్వడం, వైరల్ అవ్వడం జరిగిపోయింది. దీంతో.. యూనివర్శిటీలో యువత సుధీర్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు చేయడం మొదలుపెట్టారని అంటున్నారు. ఈ సందర్భంగా అతడిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియోని ఇప్పటికే మిలియన్ మందిపైగా చూశారు!

ఈ సమయంలో రుచికపై దాడి చేసిన వ్యక్తిని వెంటనే సస్పెండ్ చేయాలని.. అతనితో పాటు అతడి పక్కనున్న మహిళపైనా కేసు బుక్ చేయాలని.. ఇంత స్పష్టమైన సాక్ష్యం ఉన్న అనంతరం ఈ విషయాన్ని పోలీసులు చర్యలు తీసుకోవాలని నెటిజన్లు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. అయితే.. ఇప్పటికీ అతడిపై చర్యలు తీసుకున్నట్లు తెలియడం లేదు!

HORROR IN MAHARASHTRA: A famous female biker influencer BRUTALLY ASSAULTED by Sudhir Kharkate, security officer of Mahatma Gandhi International Hindi University, Wardha! Crying loud but nobody is helping her. #justiceForRuchika #WhyNoPMMitraParkInBihar pic.twitter.com/JLBUt4Z3ov

— बिहार विकास यात्रा (@BiharVikasYatra) January 24, 2025
Tags:    
  • Securityofficer 
  • Brutalattack 
  • Woman 
  • Viralvideo 
  • SudhirKharkate 
  • RuchikaThakre 
  • MahatmaGandhiUniversity 
  • Assault 
  • Socialmediaoutrage 
  • Policeaction 
  • Suspension 
  • Universityprotests 
  • Physicalviolence 
  • Publicdemand 
  • Netizensresponse 
  • Womensafety 
  • Justice 
  • Legalaction 

Similar News

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS