సందడి లేని... బీఆర్ ఎస్ సిల్వర్ జూబ్లీ!
అయితే.. పోలీసులు అనుమతించలేదు. దీనిపై ప్రస్తుతం కోర్టులో విచారణ సాగుతోంది. ఇదిలావుంటే.. కేసులు, విచారణలు.. సభలకు అనుమతి అనేవి టెక్నికల్ ఇష్యూలే.;
బీఆర్ ఎస్ పార్టీ.. తెలంగాణ ఉద్యమానికి వేదికగా.. లక్షల మంది ప్రత్యేక రాష్ట్ర ఉద్యమకారులకు పెద్ద గళంగా నిలిచిన పార్టీ. దీనిని తక్కువ చేయాలని అనుకున్నా.. సుదీర్ఘ ప్రయాణంలో అనేక మేలు మలుపు లు.. మేలిమలుపులు కూడా ఉన్న పార్టీ. అంతేకాదు.. పది సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని ఏలిన పార్టీగా కూడా గుర్తింపు పొందింది. అలాంటి పార్టీ మరో 10 రోజుల్లో సిల్వర్‌జూబ్లీ వేడుకలకు సిద్ధమైంది. పోరాటాల ఖిల్లా ఓరుగల్లులో ఈ వేడుకలు నిర్వహించుకోవాలని నిర్ణయించుకుంది.
అయితే.. పోలీసులు అనుమతించలేదు. దీనిపై ప్రస్తుతం కోర్టులో విచారణ సాగుతోంది. ఇదిలావుంటే.. కేసులు, విచారణలు.. సభలకు అనుమతి అనేవి టెక్నికల్ ఇష్యూలే. కానీ. వాస్తవానికి .. ప్రజల్లో సందడి కనిపించాలి. నాయకుల్లో ఉద్యమ స్ఫూర్తి కనిపించాలి. పార్టీ కీలక ఆవిర్భావ ఘట్టంపై పద ఘట్టనలు వినిపించాలి. కానీ, ఆ సందడి ఎక్కడా లేదు. పార్టీపై సానుభూతి కనిపించడమూ లేదు. ఎవరూ అసలు పార్టీ ఆవిర్భావ దినోత్సవం గురించే చర్చించుకోవడం లేదు.
మరోవైపు.. నెల రోజుల ముందుగానే పార్టీ రజతోత్సవాలకు.. అంటే.. పార్టీ పెట్టి 25 సంవత్సరాలు పూర్తవు తున్న నేపథ్యంలో.. కమిటీలు వేస్తామని.. కార్యకర్తలను సమీకరించేందుకు ఒక కమిటీ, భోజనాలకు మరో కమిటీ, విరాళాలు సేకరించేందుకు మరోకమిటీ, అతిథులను ఆహ్వానించేందుకు.. ఏర్పాట్లు చేసేందు కు.... ఇలా.. అనేక కమిటీలు వేస్తామని చెప్పిన బీఆర్ ఎస్ అధినేత కూడా.. మౌనంగానే ఉన్నారు. దీంతో ఉలుకు.. పలుకు లేకుండా ఇతర నాయకులు కాలం గడిపేస్తున్నారు.
మరి ఇలా అయితే.. ఎలా? అన్నది ప్రధాన ప్రశ్న. సహజంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. వివాదాలు.. అడ్డంకులు ఉంటాయి. వాటిని అధిగమించేందుకు ముందు.. ప్రజల్లో వేడి రగించాల్సిన అవసరం ఉం టుంది. పార్టీ రజతోత్సవాలకు కార్యోన్ముఖులను చేయాల్సిన అవసరం ఉంది. కమిటీలను ఏర్పాటు చేసి ఏర్పాట్లపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. కానీ.. ఇవేవీ కనిపించడం లేదు.. సందడి వినిపించడమూ లేదు. మరి ఏం చేస్తారో చూడాలి.