• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఎమ్మెల్యే కళా వెంకటరావు...

ఎమ్మెల్యే కళా వెంకటరావు ఆశలు గల్లంతు.. షాక్ ఇచ్చిన బొత్స

| విజయనగరం జిల్లా చీపురుపల్లి జడ్పీటీసీ ఎన్నికల్లో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పైచేయి సాధించారు. గరివిడి జడ్పీటీసీగా బొత్స కోడలు పూజిత, టీడీపీ ఎమ్మెల్యే కళా వెంకటరావు కోడలు కిమిడి సంధ్యపై 1,599 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. దీంతో కళా వెంకటరావుకు రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలింది. అయితే జిల్లాలో టీడీపీ ఆధిక్యంలో ఉన్నప్పటికీ, జడ్పీ చైర్‌పర్సన్ ఆశించిన ఇద్దరు అభ్యర్థులకూ నిరాశే మిగిలింది.

By - Tupaki Desk
Update: 2026-11-08 03:05 GMT

విజయనగరం జిల్లా చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. ఈ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు ప్రముఖ నేతల ప్రతిష్టకు పరీక్షగా నిలిచిన ఎన్నికల్లో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పైచేయి సాధించారు. మొత్తం నాలుగు మండలాలు ఉండగా, రెండు చోట్ల తన కుటుంబ సభ్యులనే బరిలోకి దింపి గెలిపించుకున్నారు బొత్స.

ఇదే సమయంలో తన సొంత కోడలిని జడ్పీటీసీగా పోటీకి పెట్టి సిట్టింగ్ ఎమ్మెల్యే కళావెంకటరావు ఎదురు దెబ్బ తిన్నారు. బొత్స కోడలు వర్సెస్ ఎమ్మెల్యే కళా కోడలు మధ్య జరిగిన పోరులో విజయం వైసీపీ అభ్యర్థినే వరించింది. దీంతో ఎమ్మెల్యే కళావెంకటరావుపై వైసీపీ నేత బొత్స పైచేయి సాధించినట్లైంది. అంతేకాకుండా గత అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం ఎదుర్కొన్న బొత్స ఇప్పుడు ఎమ్మెల్యే కళావెంకటరావుకి షాక్ ఇచ్చి తన ఆధిపత్యం నిరూపించుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

కళాకు ఝలక్

చీపురుపల్లి నియోజకవర్గం నుంచి బొత్స మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మూడు సార్లు మంత్రిగా ప్రాతినిధ్యం వహించారు. అయితే గత ఎన్నికల్లో బొత్సను ఓడించడమే లక్ష్యంగా టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు చీపురుపల్లి అసెంబ్లీ టికెట్ ను సీనియర్ నేత కళావెంకటరావుకు కట్టబెట్టారు. ఇద్దరూ ఇద్దరే అన్నట్లు సాగిన పోరులో కళా గెలవగా, సీనియర్ నేత బొత్స కంగుతినాల్సివచ్చింది. అయితే అప్పటి నుంచి తన పట్టు నిరూపించుకోవాలని చూస్తున్న బొత్స స్థానిక ఎన్నికలను అందుకు అనుగుణంగా మార్చుకున్నారు.

నియోజకవర్గంలో మెజార్టీ స్థానాలు గెలవడమే కాకుండా జిల్లా పరిషత్ ను కైవసం చేసుకోవాలని భావించారు. అదే సమయంలో సీనియర్ నేత, ఎమ్మెల్యే కళా కూడా జిల్లా పరిషత్ పీఠంపై కన్నేశారు. ఇలా ఇద్దరు నేతలు ఒకే పదవి కోసం మరోసారి ప్రయత్నాలు చేయడంతో విజయనగరం జిల్లాలో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అయితే ఈ ఎన్నికల్లో గెలిచి జడ్పీ పీఠంపై తన కోడలిని కూర్చోబెట్టాలని భావించిన ఎమ్మెల్యే కళా వెంకటరావుకి బొత్స షాక్ ఇచ్చారు. కళా కోడలు సంధ్యపై తన కోడలు పూజితను పోటీకి పెట్టిన బొత్స తన పట్టు నిలుపుకున్నారు. నువ్వానేనా అన్నట్లు జరిగిన పోరులో టీడీపీ అభ్యర్థి కిమిడి సంధ్యపై బొత్స పూజిత 1599 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.

జడ్పీ ఆశలపై నీళ్లు

విజయనగరం జడ్పీ అధ్యక్ష స్థానాలను ఆశించిన ఇద్దరు అభ్యర్థులు గరివిడి జడ్పీటీసీలుగా పోటీ చేశారు. దీంతో ఈ సీటు హాట్ హాట్ రాజకీయాలకు వేదికగా మారింది. అయితే జిల్లా వ్యాప్తంగా విజయం సాధించిన టీడీపీ జడ్పీ చైర్ పర్సన్ అభ్యర్థిగా పోటీ చేసిన కిమిడి సంధ్యను గెలిపించుకోలేకపోవడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. మరోవైపు అదే సీటును ఆశించి బరిలోకి దిగిన బొత్స పూజిత గెలిచారు. అయితే ఆమె పార్టీ తరఫున కేవలం నలుగురు మాత్రమే విజయం సాధించడంతో జడ్పీ చైర్ పర్సన్ ఆశలు వదులుకోవాల్సి వచ్చింది అంటున్నారు. మొత్తానికి ఇద్దరు జడ్పీ అధ్యక్ష అభ్యర్థులకు నిరాశే మిగిలిందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, సీనియర్ నేత కళావెంకటరావు కోడలు ఓటమితో జడ్పీ చైర్ పర్సన్ పీఠం ఎవరికి దక్కుతుందనే చర్చ విస్తృతంగా జరుగుతోంది.

Tags:    
  • botsasatyanarayana 
  • cheepurupalli 
  • ysrcp 
  • appolitics 
  • botsapoojitha 
  • kalavenkatarao 

Similar News

పిచ్చికుక్క కరిచిందా.. ఎర్రగడ్డకు పంపిస్తాం.. కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి పరోక్ష పంచ్.. కాంగ్రెస్‌లో మాటల మంటలు

2026-11-19 21:30 GMT

విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు సూపర్ న్యూస్

2026-11-19 21:15 GMT

సీనియర్లను రంగంలోకి దించిన జనసేన

2026-11-19 21:15 GMT

ఎవరు గెలిచినా మేమే...వైసీపీ అలా తృప్తి పడుతోందా ?

2026-11-19 21:12 GMT

మంత్ర్రుల‌ను కాద‌న‌లేరు.. కార్య‌క‌ర్త‌ల‌ను వ‌ద్ద‌న‌లేరు: బాబుకు చిక్కులు

2026-11-19 21:12 GMT

పెరిగే సీట్లు వైసీపీ రాజకీయాన్ని ముంచేస్తాయా ?

2026-11-19 21:11 GMT

మలేషియా గేట్లు మూసేసింది.. భారతీయులకు ఇక వీసా కష్టాలు.. అసలు కారణమిదే..

2026-11-19 21:10 GMT

కొలువు తీరిన ఎంపీపీలు...రికార్డు స్థాయిలో పదవులు

2026-11-19 21:01 GMT

మోదీ ప్రస్తావించిన లైసెన్స్ రాజ్ అంటే ఏమిటి? ఏంటా కథ?

2026-11-19 21:00 GMT

'రాష్ట్ర పండుగ' గా రామోజీరావు జయంతి.. ..ప్రభుత్వ నిర్ణయంపై భిన్న వాదనలు ఇవే !

2026-11-19 20:57 GMT

మూడు ముళ్ల బంధం.. రూ. 7.50 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం!

2026-11-19 19:30 GMT

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS