• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఆ బొకే విషయం దేశంలో చాలా...

ఆ బొకే విషయం దేశంలో చాలా ట్రోల్ అవుతుంది!

| ఈ రోజుల్లో సెలబ్రెటీలు ఎవరైనా చిన్నపాటి పొరపాటు చేసినా నెట్టింట ట్రోలింగ్ బారిన పడుతున్న సంగతి తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2024-06-14 07:38 GMT

ఈ రోజుల్లో సెలబ్రెటీలు ఎవరైనా చిన్నపాటి పొరపాటు చేసినా నెట్టింట ట్రోలింగ్ బారిన పడుతున్న సంగతి తెలిసిందే. ఏమాత్రం అవకాశం దక్కినా నెటిజన్లు ఒక ఆటాడేసుకుంటారు. తాజాగా “చంద్రబాబు - అమిత్ షా - నడ్డా - ఓ బొకే” అనే అంశం నెట్టింట వైరల్ గా మారింది. దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్స్ పార్టీ పోస్ట్ చేయగా.. ఈ వీడియో కింద కామెంట్లు హల్ చల్ చేస్తున్నాయి.

వివరాళ్లోకి వెళ్తే... ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా తో పాటు పలువురు బీజేపీ కీలక నేతలు, కేంద్రమంత్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం బుధవారం జరగగా.. దీనికోసం మంగళవారం సాయంత్రమే ఢిల్లీ నేతలు ఏపీలో దిగారు.

ఈ క్రమంలో... గన్నవరం ఎయిర్ పోర్ట్ లో వారందరికీ నారా లోకేష్, దగ్గుబాటి పురందేశ్వరి స్వాగతం పలికారు. అనంతరం వారు బస చేసే హోటల్ వద్ద అమిత్ షా, జేపీ నడ్డాలకు స్వయంగా చంద్రబాబే స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన ఓ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై సెటైర్లు పేలుతున్నాయి.

అవును... అమిత్ షా ను రిసీవ్ చేసుకునే సమయంలో చంద్రబాబు నమస్కరించారు. ఈ సమయంలో ప్రతినమస్కారం చేసిన అమిత్ షా... సెక్యూరిటీ ఇచ్చిన బొకేను చంద్రబాబు ఇచ్చారు. అనంతరం తిరిగి ఎవరైతే తనకు ఇచ్చారో అతనికే తిరిగి ఆ బొకేను అమిత్ షా ఇచ్చేశారు. కట్ చేస్తే... అనంతరం అదే బొకేను మరో సెక్యూరిటీ సిబ్బంది.. జేపీ నడ్డాకు ఇచ్చారు.

దీంతో జేపీ నడ్డా కూడా అమిత్ షా ఇచ్చిన బొకేనే తిరిగి చంద్రబాబు చేతిలో పెట్టారు. మళ్లీ తిరిగి ఆ బొకేను అమిత్ షా ప్రయాణించి వచ్చిన కారులోకే చేరుతున్నట్లు కనిపించింది! దీంతో... “ఒకే బొకే - ముగ్గురు నేతలు” అంటూ నెట్టింట ట్రోలింగ్స్ మొదలైపోయాయి. బొకే లేకపోతే నమస్కరించి మమ అనిపించాలి కానీ.. ఇలాంటి పనులు చేస్తే కెమెరా కళ్లు ఊరుకుంటాయా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇద్దరు కేంద్ర కేబినెట్ మంత్రులు , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు కానీ ఇక్కడ

ఎన్ని పుష్పగుచ్ఛాలు ఉన్నాయో చెప్పండి ? pic.twitter.com/S1XVuQTx1q

— INC Andhra Pradesh (@INC_Andhra) June 12, 2024
Tags:    
  • Amitshah 
  • Bjp 
  • Jpnadda 
  • Chandrababunaidu 
  • Tdp 
  • Ndaallaince 
  • Janasena 
  • Narendramodi 

Similar News

త్రిష మరో జయలలిత...పోలిక బాగానే ఉంది కానీ ?

2026-11-24 03:46 GMT

కార్తీక పౌర్ణమి....365 ఒత్తుల ఆధ్యాత్మిక సందేశం

2026-11-24 03:46 GMT

జనసేన బలపడినట్లేనా ?

2026-11-24 03:45 GMT

మేయర్లు చైర్మన్లు రేపటి పోటీదారులు !

2026-11-24 02:30 GMT

ఇలాగైతే ఎలా సారూ...కేసీఆర్ ది వ్యూహమా ?

2026-11-24 01:30 GMT

వంగవీటి రాధాక్రిష్ణన్...ఈ కొత్త పేరేంటి ?

2026-11-24 01:03 GMT

వాట్సాప్ వెబ్ వాడుతున్నారా? చిన్న నిర్లక్ష్యంతో మీ పని గోవిందా.. కేంద్రం కీలక హెచ్చరిక

2026-11-24 00:56 GMT

ఇంట్లోనే ప్రత్యర్ధులు...జగన్ కి 2029 పెను సవాల్ గా ?

2026-11-24 00:55 GMT

అసహనం...ఆగ్రహం...బీజేపీలో ఏమి జరుగుతోంది ?

2026-11-24 00:53 GMT

బీజేపీ పాల‌న‌.. ఏకంగా రాష్ట్రం పేరు మార్చేశారు.. రీజ‌న్‌ తెలిస్తే.. అవాక్కే!

2026-11-24 00:50 GMT

ప్రపంచానికి బట్టలు కుట్టించి.. తన పరువు మాత్రం బజారున పడేసుకున్న బంగ్లాదేశ్

2026-11-24 00:36 GMT

ధ్రువ్ రాఠీకి గట్టి షాక్.. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ

2026-11-24 00:28 GMT

Copyright @2026

Powered by Blink CMS