• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బీజేపీకి భారీ విరాళాలు.....

బీజేపీకి భారీ విరాళాలు.. మొత్తం డొనేషన్లలో 82% ఆ పార్టీకే..!

| 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు సుప్రింకోర్టు సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఎలక్టోరల్ బాండ్లను రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొంటూ ఆ పథకాన్ని కొట్టివేసింది.

By - Raja Ch
Update: 2025-12-21 23:30 GMT

2024 లోక్ సభ ఎన్నికలకు ముందు సుప్రింకోర్టు సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఎలక్టోరల్ బాండ్లను రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొంటూ ఆ పథకాన్ని కొట్టివేసింది. అలా కోట్టివేసిన తర్వాత మొదటి ఆర్ధిక సంవత్సరం 2024 - 25లో తొమ్మిది ఎలక్టోరల్ ట్రస్టులు దేశంలోని రాజకీయ పార్టీలకు మొత్తం రూ.3,811 కోట్లను విరాళంగా ఇచ్చాయి. ఇందులో 82% భారతీయ జనతా పార్టీ వాటా కావడం గమనార్హం.

అవును... ఎలక్టోరల్ బాండ్లను సుప్రీంకోర్టు నిలిపివేసిన తర్వాత ఎలక్టోరల్ ట్రస్టుల ద్వారా 2024-25లో దేశంలోని రాజకీయ పార్టీలకు మొత్తం రూ.3,811 కోట్లు విరాళంగా వచ్చాయి. ఇందులో ప్రధానంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఆ మొత్తం నిధుల్లో రూ.3,112 కోట్లు అందాయి! ఇక మిగిలిన మొత్తంలో 8 శాతం కంటే తక్కువ రూ.299 కోట్లు కాంగ్రెస్ కు వెళ్లగా.. దాదాపు 10% అంటే రూ.400 కోట్లు మిగిలిన అన్ని పార్టీలకు వెళ్లాయి.

వాస్తవానికి.. ఈ నెల 20 నాటికి ప్రస్తుతం నమోదు చేసుకున్న 19 ఎలక్టోరల్ ట్రస్టులలోనూ 13 ఎలక్టోరల్ ట్రస్టుల సహకార నివేదికలు ఎన్నికల కమిషన్ వద్ద అందుబాటులో ఉన్నాయి. అయితే అందులో.. జన్హిత్, పరిబర్తన్, జైహింద్, జయభారత్ అనే నాలుగు ట్రస్టులు 2024-25లో తమ విరాళాలు శూన్యం అని ప్రకటించాయి. ఈ క్రమంలో..మిగిలిన 9 ట్రస్టులు కలిపి పార్టీలకు మొత్తం రూ.3,811 కోట్ల విరాళాలను ప్రకటించాయి.

ఇది 2023-24 లో వచ్చిన రూ.1,218 కోట్ల కంటే 200% ఎక్కువ. తాజా విరాళాల్లో ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్టు బీజేపీకి ప్రధాన దాతగా ఉంది. ఈ ట్రస్టు మొత్తం రూ.2,180.07 కోట్లు అందించింది. ఈ ట్రస్టు.. జిందాల్ స్టీల్ అండ్ పవర్, మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇంఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, భారతీ ఎయిర్ టెల్, అరబిందో ఫార్మా, టోరెంటో ఫార్మాస్యూటికల్స్ వంటి పలు కీలక సంస్థల నుంచి నిధులు పొందింది.

2024-25లో ఏయే ట్రస్టు ఎంత విరాళం ఇచ్చిందనేది ఇప్పుడు చూద్దామ్...!:

ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ - రూ.2,668.46 కోట్లు

ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్ - రూ.914.97 కోట్లు

న్యూ డెమోక్రటిక్ ఎలక్టోరల్ ట్రస్ట్ - రూ.160 కోట్లు

హర్మొనీ ఎలక్టోరల్ ట్రస్ట్ - రూ.35.65 కోట్లు

ట్రయంఫ్ ఎలక్టోరల్ ట్రస్ట్ - రూ.25 కోట్లు

సమాజ్ ఎలక్టోరల్ ట్రస్ట్ అసోసియేషన్ - రూ.6 కోట్లు

జన్ ప్రగతి ఎలక్టోరల్ ట్రస్ట్ - రూ.1.02 కోట్లు

జన్ కల్యాణ్ ఎలక్టోరల్ ట్రస్ట్ - రూ.19 లక్షలు

ఎన్జిగార్టిక్ ఎలక్టోరల్ ట్రస్ట్ - రూ.7.75 లక్షలు

Tags:    
  • bjp 
  • electoralfunds 
  • indiapolitics 
  • politicalfunding 
  • trustdonations 

Similar News

2019 లెక్కలు వేరు.. 2024 తర్వాత పరిస్థితి వేరు : జగన్ కేసుల్లో ఈడీ దూకుడుకు కారణమిదేనా?

2026-11-18 11:46 GMT

టెక్నాలజీనే టెన్షన్ పెడుతోంది.. టెక్ ప్రపంచానికి పీడకలగా నవంబర్

2026-11-18 11:29 GMT

హైదరాబాద్ హోటళ్లలో బొద్దింకలు.. గడువు ముగిసిన సాసులు కూడా!

2026-11-18 11:28 GMT

జెండా గుర్తును జేబులో పెట్టుకున్న మోడీ.. పక్కనే ఉన్న ట్రంప్ ఏమన్నారంటే?

2026-11-18 11:22 GMT

ఖబర్దార్ బిడ్డా.. యుద్ధం స్టార్ట్ అవుతది.. రేవంత్‌రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

2026-11-18 10:06 GMT

ఎన్టీఆర్ విగ్రహానికి అయ్యే ఖర్చుతో మెడికల్ కాలేజీలు కట్టొచ్చు కదా.. ప్రభుత్వానికి పేర్ని నాని సూటి ప్రశ్న

2026-11-18 10:02 GMT

దిగ్గజాల వీడ్కోలు.. 2026 క్రీడాభిమానులకు ఓ చేదు జ్ఞాపకం..

2026-11-18 10:02 GMT

గ్రామ సర్పంచ్ : పదవి మాత్రమే కాదు.. ఊరి గుండె చప్పుడు!

2026-11-18 09:55 GMT

ఐపీఎల్‌లో కెప్టెన్సీ కుర్చీ కోసం పోటీ.. వేలానికి ముందే ఐదు జట్లలో హాట్ టాపిక్

2026-11-18 09:54 GMT

వీడియో కాల్ చేసి మరీ లొంగిపోమన్నారు.. వినని లష్కరే కమాండర్ ను లేపేశారిలా..

2026-11-18 07:13 GMT

ఏఐకి పోటీగా ‘హ్యూమన్’.. 2026 వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక!

2026-11-18 07:07 GMT

వారం రోజుల్లో 2 లక్షల కాపీలు.. సోనియా గాంధీ పుస్తకానికి భారీ స్పందన!

2026-11-18 07:06 GMT

Copyright @2026

Powered by Blink CMS