• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  డబ్బాలో పాలు అన్నీ...

డబ్బాలో పాలు అన్నీ నేలపాలు... రాహుల్ గాంధీపై ఫిర్యాదు!

| ఇందులో భాగంగా... తన క్యాన్ నిండా ఉన్న పాలు అన్నీ నేలపాలు అవడానికి రాహుల్ గాంధీ కారణమని ఆరోపిస్తూ ఓ వ్యక్తి కేసు నమోదు చేశాడు.

By - Tupaki Desk
Update: 2025-01-21 19:30 GMT

తన పాల క్యాన్ కింద పడిపోయిందని.. అందులో ఉన్న పాలు అన్నీ నేలపాలు అయిపోయాయని.. అందుకు కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ కారణమని.. ఆయన వల్లే తనకు నష్టం జరిగిందని ఆరోపిస్తూ.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు బీహార్ కు చెందిన ముకేశ్ కుమార్ చౌదరి అనే పాల వ్యాపారి. ఈ విషయం ఇంట్రస్టింగ్ గా మారింది!

అవును... ఓ విచిత్రమైన సంఘటన తాజాగా తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... తన క్యాన్ నిండా ఉన్న పాలు అన్నీ నేలపాలు అవడానికి రాహుల్ గాంధీ కారణమని ఆరోపిస్తూ ఓ వ్యక్తి కేసు నమోదు చేశాడు. సుమారు ఐదు లీటర్ల పాలు కింద పడిపోవడంతో సుమారు రూ.250 నష్టం వచ్చిందని తెలిపాడు. ఈ మేరకు ఫిర్యాదు చేశాడు.

దేశంలోని ప్రతీ వ్యవస్థపైనా బీజేపీ, ఆరెస్సెస్స్ లు పెత్తనం చెలాయిస్తున్నాయని.. వాటిపై తాము పోరాడుతున్నామని రాహుల్ చేసిన వ్యాఖ్యలు విన్న తర్వాత తాను షాక్ అయ్యాయని బాధిత ఫిర్యాదుదారుడు పేర్కొన్నారు. ఈ ప్రకటనతో తాను ఎంతో దిగ్భ్రాంతికి గురయ్యాయని.. ఫలితంగా ఐదు లీటర్ల పాల బకెట్ పై పట్టు కోల్పోయాయని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఈ సమస్తిపూర్ నివాసి తన పిటిషన్ లో దేశద్రోహానికి సంబంధించిన 152 సహా పలు బీ.ఎన్.ఎస్. సెక్షన్ల కింద రాహుల్ గాంధీని విచారించాలని కోరారు. అయితే... గౌహతీలోని పాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో రాహుల్ గాంధీపై ఎఫ్.ఐ.ఆర్. దాఖలు చేసిన కొద్ది రోజుల తర్వాత ఇది జరగడం గమనార్హం.

కాగా... జనవరి 15న ఢిల్లీలోని కోట్లా రోడ్డులో కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రధాన కార్యాలయం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా స్పందించిన రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. దేశంలోని ప్రతీ సంస్థనూ బీజేపీ, ఆరెస్సెస్స్ లు స్వాధీనం చేసుకున్నాయని.. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీజేపీ, ఆరెస్సెస్స్ లతో పాటు భారత రాజ్యంతో పోరాటం చేస్తుందని అన్నారు.

ఇలా "భారత రాజ్యంతో పోరాటం" అనే వ్యాఖ్యపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై బీజేపీ మండిపడింది. అయితే... దేశంలోని వాస్తవ పరిస్థితిని చెప్పే ప్రయత్నంలో భాగంగా రాహుల్ గాంధీ ఆ వ్యాఖ్య చేశారంటూ కాంగ్రెస్ సమర్ధించింది. ఈ నేపథ్యంలో రాహుల్ పై అస్సోం రాజధాని గౌహతీలో కేసు నమోదైంది.

ఆ వ్యాఖ్యల వల్లే తాను షాక్ కి గురై పాల క్యాన్ పై పట్టు కోల్పోయానని.. అందువల్ల తన పాలన్నీ నేలపాలు అయ్యాయని.. తనకు రూ.250 నష్టం వచ్చిందని తాజాగా ఫిర్యాదు చేశాడు బీహార్ వాసి.

Tags:    
  • Congressparty 
  • Bjp 
  • Rahulgandhi 
  • Complaint 
  • Policecase 
  • Fir 
  • Bihar 
  • Biharmukeshkumarchaudhary 
  • RSS 

Similar News

గంటా దూకుడు రాజకీయం...బొత్స కూతురు ఏం చేస్తున్నట్లు ?

2026-11-19 03:15 GMT

మోడీ ఇచ్చిన కానుక‌ల వెనుక 'బిజినెస్' యాంగిల్‌!

2026-11-19 03:15 GMT

వైసీపీ వైపు నాన్ ఎన్డీయే వర్గాలు

2026-11-19 03:14 GMT

పవన్ బ్యాలెన్స్ పాలిటిక్స్...చాన్స్ కోసం సైనిక్స్ !

2026-11-19 03:14 GMT

ఈ నెల 23 నుంచి ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాలు ?

2026-11-19 03:13 GMT

జగన్ లండన్ టూర్ ఫిక్స్...ఫుల్ బిజీగానే !

2026-11-19 03:13 GMT

₹50 కోట్ల పెళ్లి.. 4 లక్షల మంది అతిథులు.. విజేతకు థార్ కారు.. ఇలాంటిది చూడలేదప్పుడు?

2026-11-19 03:12 GMT

అందరూ కలిసి ఖైరతాబాద్ ఉప ఎన్నికను ఆపేస్తున్నారన్నట్టు..?!

2026-11-19 03:09 GMT

కూటమిలో భారీ ఉత్కంఠ.. ఎవరికెన్ని జెడ్పీలు ?

2026-11-19 03:09 GMT

మోడీ ఎక్కింది బజాజ్ ఆటో.. క్రెడిట్ మాత్రం పాకిస్తాన్‌కు.. ఫుల్ కామెడీ

2026-11-19 03:07 GMT

చిన్న సైజులో ఎలక్ట్రిక్ డిఫెండర్.. 2027లో రాక!

2026-11-19 03:06 GMT

పెళ్లి పిలుపు ఓకే... షర్మిల వ్యూహం మీదనే ఎన్నో ప్రశ్నలు !

2026-11-19 03:03 GMT

Copyright @2026

Powered by Blink CMS