• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  దుబాయ్ లో భారతీయ...

దుబాయ్ లో భారతీయ బిలియనీర్ కు దేశ బహిష్కరణ... కారణం ఇదే!

| దుబాయ్ లో ఇండియన్ బిలియనీర్ బల్విందర్ సింగ్ సాహ్నీకి అక్కడ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.

By - Tupaki Desk
Update: 2025-05-06 05:05 GMT

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ప్రముఖ వ్యాపారవేత్తగా పేరొందిన ఇండియన్ బిలియనీర్ బల్విందర్ సింగ్ సాహ్నీ కటకటాలపాలయ్యారు. మనీలాండరింగ్ వ్యవహారానికి సంబంధించిన కేసులో దోషిగా తేలడంతో కోర్టు ఐదేళ్లు జైలు శిక్ష విధించింది. ఇదే సమయంలో.. రూ.కోటి జరిమానాతో పాటు ఆస్తుల స్వాధీనానికి కోర్టు ఆదేశించింది.

అవును... దుబాయ్ లో ఇండియన్ బిలియనీర్ బల్విందర్ సింగ్ సాహ్నీకి అక్కడ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఇదే సమయంలో జైలు శిక్ష పూర్తైన తర్వాత దేశం నుంచి బహిష్కరించాలని తీర్పు వెలువరించింది. షెల్ కంపెనీలు, ఫోర్జరీ ఇన్ వాయిస్ లతో 150 మిలియన్ దిర్హమ్ లు (సుమారు రూ.340 కోట్లు) మనీలండరింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఆ.ఎస్.జీ. ప్రాపర్టీ డెవలప్మెంట్ కంపెనీ వ్యస్థాపకుడు అయిన సాహ్నీ.. ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు అభియోగాలు వచ్చాయి. ఈ క్రమంలో అతనితో పాటు మరికొందరిపైనా కేసు నమోదైంది. దీనిపై విచారన జరిపిన కోర్టు.. ఆర్థిక మోసాల ఆరోపణల్లో నిజమున్నట్లు తేల్చింది. ఈ నేపథ్యంలో తాజాగా తీర్పు వెలువరించింది.

ఇందులో భాగంగా... బల్విందర్ కు ఐదేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. భారతీయ కరెన్సీలో సుమారు రూ.1.14 కోట్లు జరిమానా విధించింది. ఇదే సమయంలో 150 మిలియన్ దిర్హమ్ లు (సుమారు రూ.340 కోట్లు) విలువైన ఆస్తులను జప్తు చేయాలని ఆదేశించింది. శిక్ష పూర్తైన అనంతరం దేశం నుంచి పంపించేయాలని స్పష్టం చేసింది.

కాగా రాజ్ సాహ్నీ గ్రూప్ (ఆర్.ఎస్.జీ) పేరుతో ప్రాపర్టీ డెవలప్మెంట్ కంపెనీని స్థాపించారు బల్విందర్. ఈయనకు దుబాయ్ స్పోర్ట్స్ సిటీలో ఖరీదైన ఇళ్లు, కమర్షియల్ కాంప్లెక్స్ లు, ఫైవ్ స్టార్ హోటల్ వంటి పలు ఆస్తులు ఉన్నాయి. ఈయన కంపెనీ దుబాయ్ తో పాటు భారత్, అమెరికా సహా పలు దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది.

Tags:    
  • BalwinderSinghSahni 
  • UAEJailSentence 
  • MoneyLaundering 
  • IndianBillionaire 
  • DubaiCourt 
  • FinancialFraud 
  • ShellCompanies 
  • RSGroup 
  • InternationalScam 

Similar News

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS