కొత్త చట్టం... 16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్‌ మీడియా!

ఈ జనరేషన్ పిల్లలకు, ఫోన్లకు, ఆ ఫోన్లలోని సోషల్ మీడియా అలవాట్లకు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు

Update: 2024-05-23 14:30 GMT

ఈ జనరేషన్ పిల్లలకు, ఫోన్లకు, ఆ ఫోన్లలోని సోషల్ మీడియా అలవాట్లకు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అన్నం తినడానికి మారాం చేసే పిల్లల దగ్గర నుంచి హైస్కూల్స్ కి వెళ్లే వారి వరకూ మొబైల్ ఫోన్ తో ఉన్న బంధం వేరే లెవెల్ అనే చెప్పాలి. అడిక్ట్ అవ్వడానికి కూడా లిమిట్ ఉంటుందనే మాటలు ఈ సందర్భంలో పుడుతుంటాయి!

ఈ క్రమంలోనే 16ఏళ్ల లోపు పిల్లలను సోషల్ మీడియాకు దూరం పెట్టాలని ఆలొచిస్తే... ఆ ఆలోచన ఆ వయసువారికి నచ్చకపోవచ్చు, ఆయన ఫ్లాట్ ఫాం కంపెనీలకు నచ్చకపోవచ్చు కానీ.. దీన్ని అభినందించేవారు ఎక్కువగానే ఉంటారని చెప్పడంలో సందేహం లేదనే భావించాలి. ప్రస్తుతం ఈ భారీ ఆలోచన చేస్తుంది ఆస్ట్రేలియా!

అవును... పదహారేళ్ల వయసు దాటేవరకూ పిల్లలను సోషల్‌ మీడియాకు దూరంగా ఉంచాలనే డిమాండ్‌ ఇటీవల బాగా ఊపందుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆస్ట్రేలియా ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా... 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్‌ మీడియా చూడకుండా నిషేధం విధించాలని ఆలోచిస్తోంది.

వాస్తవానికి ఫేస్‌ బుక్‌ లాంటి సోషల్‌ మీడియా సైట్లలో చేరాలంటే కనీసం 13 సంవత్సరాల వయసు ఉండాలనే నిబంధన ఉంది! అయితే... దాన్ని అతిక్రమించడం పెద్ద విషయం కాదనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి! దీంతో... ఏకంగా నిషేధం విధించేలా చట్టం చేయాలనుకుంటున్నారు. దీనికి ఆస్ట్రేలియాలోని అనేక రాష్ట్రాలతో పాటు, ఆదేశ ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌ కూడా మద్దతు పలికారు.

Read more!

ఈ సందర్భంగా స్పందించిన ఆంథోనీ... మితిమీరిన సోషల్‌ మీడియా వాడకం వల్ల పల్లు దారితప్పడంతోపాటు.. వారి మానసిక ఆరోగ్యానికి నష్టం జరుగుతుందని అంటున్నారు. ఆ వయసులోపు పిల్లలను ఆన్‌ లైన్ లో కాకుండా, మైదానాల్లో ఆడుకునేలా చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో... త్వరలో ఈ నిర్ణయం అమలవ్వబోతోందని అంటున్నారు.

కాగా... ప్రపంచానికి ఐఫోన్‌ పరిచయం చేసిన స్టీవ్‌ జాబ్స్‌.. తన పిల్లలను టీనేజీ దాటే వరకూ సెల్‌ ఫోన్లకు దూరంగా ఉంచగా.. మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌ గేట్స్‌ సైతం తన పిల్లల్ని గ్యాడ్జెట్స్‌ నుంచి కాపాడుకున్నట్లు చెబుతున్న సంగతి తెలిసిందే!

Tags:    

Similar News