• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  దైవదర్శనం కోసం వస్తే...

దైవదర్శనం కోసం వస్తే సామూహిక అత్యాచారం.. దేవుడా?

| దారుణ నేరం వెలుగు చూసింది. తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లాలో ఒక ఆరాచక ఘటన చోటు చేసుకుంది.

By - Tupaki Desk
Update: 2025-03-31 06:30 GMT

దారుణ నేరం వెలుగు చూసింది. తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లాలో ఒక ఆరాచక ఘటన చోటు చేసుకుంది. దైవ దర్శనం కోసం వచ్చిన మహిళపై ఎనిమిది మంది సామూహిక అత్యాచారానికి పాల్పడిన వైనం వెలుగు చూసింది. ఆమెతో ఉన్న వ్యక్తిపై దాడి చేసి.. అతడ్ని బంధించి.. బాధితురాలిపై గ్యాంగ్ రేప్ నకు పాల్పడ్డారు. అసలేం జరిగిందంటే.. నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేట ఆంజనేయస్వామి దేవాలయానికి మొక్కులు తీర్చుకోవటానికి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన బాధితురాలు బంధువుతో కలిసి శనివారం సాయంత్రం వచ్చారు.

దైవదర్శనం అనంతరం ఆ రాత్రి అక్కడే నిద్రపోవాలని భావించారు. దైవసన్నిధిలో నిద్ర చేస్తే సమస్యలు తీరతాయన్న నమ్మకం గురించి తెలిసిందే. ఈ క్రమంలో సదరు యువతి కాలక్రత్యాలు తీర్చుకోవటం కోసం సమీపంలో ఉన్న గుట్ట ప్రాంతంలోకి వెళ్లారు. అక్కడ మాటు వేసిన యువకులు ఆమెను అటకాయించారు.

ఆమె వెంట వచ్చిన బంధువుపై దాడి చేసి చేతులు కట్టేశారు. యువతిని బలవంతంగా సమీపంలోని గుట్ట ప్రాంతంలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లుగా గుర్తించారు. ఈ దారుణ ఉదంతం గురించి సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులు ఎనిమిది మంది ఊర్కొండపేట గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ దారుణానికి పాల్పడిన ఎనిమిది మందిలో ఆరుగురిని అదుపులోకి తీసుకొన్నారు. మిగిలిన ఇద్దరి కోసం గాలింపులు చేపట్టారు. అదుపులో ఉన్న ఆరుగురిని పోలీసులు విచారిస్తున్నారు. బాధితురాలి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు చెబుతున్నారు.

Tags:    
  • Nagarkurnool.Telangana 
  • Temple 
  • Atrocities 
  • Latestnews 
  • TGPolice 

Similar News

వరుస తుఫాన్లు.. చంద్రబాబుకు ఎన్నో విధాల మేలు

2026-11-02 12:30 GMT

ఇతరుల ఆనందమే కొలమానమా? జెన్ జెడ్ ను ఒత్తిడికి గురిచేస్తున్న సోషల్ మీడియా

2026-11-02 11:30 GMT

50 టీఎంసీల వరద..?! ‘మురసు’తో నిండనున్న పులిచింతల, నాగార్జునసాగర్

2026-11-02 11:04 GMT

దక్షిణాదికి బుల్లెట్ ట్రైన్.. బెంగళూరు నుంచి చెన్నైకి కేవలం 73 నిమిషాల్లోనే!

2026-11-02 10:24 GMT

తుఫాన్ల నెల నవంబర్.. అసలు కారణాలు ఏంటి?

2026-11-02 10:00 GMT

అమెరికా ఎన్నికలతో భారత్‌కు కొత్త పరీక్ష.. ట్రంప్ ఓడితే భారత్ కు లాభమా? నష్టమా?

2026-11-02 10:00 GMT

రాప్తాడు ఉన్మాదికి పోలీసు శిక్ష.. కుళ్లిపోయిన కుడికాలు, తొలగించే అవకాశం!

2026-11-02 09:58 GMT

తెలంగాణపై బీజేపీ ఫుల్ ఫోకస్.. అమిత్ షా ‘హైదరాబాద్ వ్యూహం’ గేమ్ ఛేంజర్ అవుతుందా?

2026-11-02 09:50 GMT

నెల్లూరుకు సమీపంలో ‘మురసు’.. ఐదు జిల్లాలలో భారీ వర్షాలు

2026-11-02 08:24 GMT

రాప్తాడు బాలిక హెల్త్ బులిటెన్.. కీలక సమాచారం వెల్లడించిన మంత్రి లోకేశ్

2026-11-02 07:56 GMT

ఓడిపోతానని ట్రంప్ కు జ్ఞానోదయం.. ఇన్నాళ్లకు తెలిసి (తెలివి) వచ్చింది..

2026-11-02 07:05 GMT

మారథాన్‌లో విజయం.. జీవితంలో విషాదం.. పరుగుపందెం పూర్తి చేసి ప్రాణాలు విడిచిన టెక్కీ

2026-11-02 06:43 GMT

Copyright @2026

Powered by Blink CMS