జ‌న‌సేన‌కు ఇర‌కాటంగా మారింది ఇవేనా?

తాజాగా జ‌న‌సేన అదినేత ప‌వ‌న్‌తో రెండు గంట‌ల పాటు ర‌హ‌స్య చ‌ర్చ‌లు జ‌రిపిన చేగొండి హ‌రిరామ జోగ‌య్య‌.. జ‌న‌సేనానికి గీతోప‌దేశం చేశారని తెలిసింది.;

Update: 2024-01-14 15:30 GMT

వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీతో క‌లిసి ప్ర‌యాణం చేయాల‌ని నిర్ణ‌యించుకున్న జ‌న‌సేనకు.. ఒకే ఒక్క స‌మ‌స్య వెంటాడుతోంది. న‌లువైపుల నుంచి అదే నినాదం.. అదే డిమాండు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఒక‌వైపు.. కాపు సంక్షేమ సేన, మాజీ ఎంపీ చేగొండి హ‌రిరామ‌జోగ‌య్య నుంచి మ‌రోవైపు కాపు నాడు ఉద్య‌మ నాయ‌కుల వ‌ర‌కు.. ఇదే డిమాండ్‌ను తెర‌మీదికి తెచ్చారు. అదే.. `రెండున్న‌రేళ్లు అధికారం`, రెండున్న‌రేళ్లు సీఎం ప‌ద‌వి. ఈ రెండు తీసుకోవాల‌న్న‌దే.. ఇప్పుడు ప్ర‌ధానం జ‌న‌సేన‌ను ఇర‌కాటంలోకి నెట్టింది.

తాజాగా జ‌న‌సేన అదినేత ప‌వ‌న్‌తో రెండు గంట‌ల పాటు ర‌హ‌స్య చ‌ర్చ‌లు జ‌రిపిన చేగొండి హ‌రిరామ జోగ‌య్య‌.. జ‌న‌సేనానికి గీతోప‌దేశం చేశారని తెలిసింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అనుస‌రించాల్సిన వ్యూహాలు.. ఎన్ని సీట్లు అడ‌గాలి? ఎక్క‌డెక్కడ పోటీ చేయాలి? అనే విష‌యాన్ని ఆయ‌న కూలంక‌షంగా చ‌ర్చించిన‌ట్టు తెలిసింది. ఈ క్ర‌మంలో ఆయ‌న ఏకంగా 42-60 స్థానాల‌ను జ‌న‌సేన తీసుకోవాల‌ని.. ముఖ్యంగా తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో 30 అసెంబ్లీ స్థానాల్లో 20 స్తానాల‌కుపైగా టీడీపీ నుంచి తీసుకోవాల‌ని ఆయ‌న సూచించార‌ని తెలిసింది.

అదేవిధంగా అనంత‌పురం, విజ‌య‌వాడ‌, విశాఖ‌ల్లోనూ మెజారిటీ స్థానాలు తీసుకోవాల‌ని.. జోగ‌య్య ప‌వ‌న్‌కు చెప్పారు. ఇక‌, ఎంపీ స్థానాల విష‌యానికి వ‌స్తే.. 4-6 స్థానాలు తీసుకోవాల‌ని కూడా సూచించిన‌ట్టు స‌మాచా రం. ఇందులోనే.. రెండున్న‌రేళ్ల ముఖ్య‌మంత్రి ప‌ద‌విని కూడా తీసుకుని, కాపు యువ ఆకాంక్ష‌లు నెర‌వేర్చాల‌ని కూడా జోగ‌య్య హిత‌వు ప‌లికిన‌ట్టు జ‌న‌సేన వ‌ర్గాలు చెబుతున్నాయి. మ‌రోవైపు.. కాపు నాడు ఉద్య‌మ వేదిక కూడా.. దాదాపు ఇవే డిమండ్ల‌ను తెర‌మీదికి తెచ్చిన‌ట్టు తెలిసింది.

ఇవీ.. కాపునాడు డిమాండ్లు

+ ఎన్నికల్లో కాపులకు 75 అసెంబ్లీ స్థానాలు, 8 పార్లమెంట్‌ స్థానాలు కేటాయించాలి.

+ ఉమ్మడి విశాఖ జిల్లాలో 6 అసెంబ్లీ స్థానాలు, 1 ఎంపీ స్థానాన్ని, ఉమ్మడి పశ్చిమ గోదావరిజిల్లాలో 7 అసెంబ్లీ, ఒక పార్లమెంట్‌ స్థానాన్ని, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒక్కొక్క పార్లమెంట్‌, 5 అసెంబ్లీ స్థానాలు, రాయలసీమలో 5 అసెంబ్లీ, ఒక పార్లమెంట్‌ స్థానాన్ని కాపులకు కేటాయించాలి.

+ జనసేన అధినేత పవన్‌ ఎవ్వరితో పొత్తుపెట్టుకున్నా ఓకే. కానీ సీఎం సీటు ద‌క్కాలి.

Tags:    

Similar News