మోడీ డబ్బులకు డేట్ ఫిక్స్...అదే రోజు బాబు కూడానా !

ఏపీలో ఖరీఫ్ సీజన్ మొదలైంది. సాధారణంగా జూన్ నెల నుంచే ఖరీఫ్ స్టార్ట్ అవుతుంది.;

Update: 2025-07-07 04:30 GMT

ఏపీలో ఖరీఫ్ సీజన్ మొదలైంది. సాధారణంగా జూన్ నెల నుంచే ఖరీఫ్ స్టార్ట్ అవుతుంది. ఏరువాక పండుగను చేసి మరీ దుక్కి దున్ని రైతులు పొలాలలో తమ కొత్త సాగుకు సంకల్పం చేస్తారు. ఆ సమయంలోనే పెట్టుబడి సాయం దండీగా అవసరం పడుతుంది.

రైతులు ఇదే సమయంలో కన్న తల్లి లాంటి పొలంలో విత్తనాలు నాటేందుకు ఇతర ఖర్చులకు భారీగా డబ్బుల కోసం ఎదురు చూస్తారు. అప్పుల కోసం అధిక వడ్డీలకు కూడా తెగించి మరీ పట్టుకుని వస్తారు. అయితే పాలకులు ఇస్తున్న అనేక ఉచిత హామీలలో రైతులకు సాయం మంచిదని అంతా ఒప్పుకుంటారు. అలా కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ పధకాన్ని ప్రారంభించింది. అలా మోడీ ప్రభుత్వం చాలా ఏళ్లుగా రైతుల ఖాతాలో నిధులను మూడు విడతలుగా వేస్తూ ఎంతో కొంత చేయూతను ఇస్తోంది. అలా ఆరు వేల రూపాయల కేంద్ర సాయం దక్కుతోంది.

ఇక ఏపీలో వైసీపీ కూడా తాము అధికారంలోకి వస్తే రైతు భరోసా కింద భారీ సాయం చేస్తామని 2019 ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. ఆ విధంగా వైసీపీ అయిదేళ్ళ పాటు సాయం అందించింది. అయితే వైసీపీ కంటే రెట్టింపు సాయం చేస్తామని కూటమి నేతలు ఎన్నికల సందర్భంగా ప్రకటించారు. ఇరవై వేల రూపాయల దాకా తాము ఇస్తామని పేర్కొన్నారు.

అయితే తొలి ఏడాది మాత్రం ఈ సాయం అందలేదు. అన్న దాతా సుఖీభవ ఇప్పుడు కేంద్రం ఇచ్చే కిసాన్ సమ్మాన్ పధకం తో కలిపి ఇస్తామని ప్రకటించారు. అలాగే మూడు విడతలుగా చెల్లిస్తామని చెప్పారు. కేంద్రం ఆరు వేల రూపాయలు కాగా ఏపీలో కూటమి ప్రభుత్వం 14 వేల రూపాయల సాయం ఇస్తుంది అన్న మాట.

అలా ఇపుడు ఏపీ ప్రభుత్వం తొలి విడత అన్న దాత సుఖీభవ పధకం నిధులు విడుదల కాబోతున్నాయి. కేంద్రం అయితే ఈ నెల 18న కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల చేయడానికి ముహూర్తం పెట్టింది. ఈ నెల 20న ప్రధాని నరేంద్ర మోడీ బీహార్ పర్యటన నేపథ్యంలో రెండు రోజుల ముందుగానే ఈ నిధులు ఇస్తే కనుక రైతాంగం మొత్తం తమకు అనుకూలంగా ఉంటుందని భావించి విడుదల చేస్తున్నారు.

ఏపీ ప్రభుత్వం కూడా అదే డేట్ కి తొలి విడతా అయిదు వేల రూపాయలు అన్న దాతలకు అందచేస్తుందని అంటున్నారు. ఇప్పటికే ఈ పధకం కింద లబ్దిదారుల ఎంపిక జరిగింది. అర్హులను కూడా తేల్చారు. అయితే ఎవరికి అయినా సందేహాలు ఉన్నా తాము అర్హత ఉన్నా పధకం లో లబ్దిదారులు కాలేకపోతే వారికి మరో అవకాశం కల్పిస్తున్నారు.

ఏపీలో చూస్తే కనుక అన్నదాత సుఖీభవ పథకం కింద 47.77 లక్షల రైతులను లబ్దిదారులుగా అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. వీరందరికీ ఈకేవైసీ పూర్తి అయింది అని అంటున్నారు. ఒకవేళ ఎవరైనా లబ్దిదారులుగా అర్హత సాధించకపోతే ఈకేవైసీ చేయించుకోవాలని అధికారులు కోరుతున్నారు.

ఇక ఈ పధకం కింద లబ్ది పొందాలంటే వెబ్ ల్యాండ్ లో నమోదయిన రైతుల భూమి వివరాలు కచ్చితంగా ఉండాలని అంటున్నారు. వెబ్ ల్యాండ్ లో నమోదయిన వారికే అన్న దాత పధకం కింద అర్హత కల్పించినట్లు అధికారులు తెలిపారు. అయితే అర్హులు కాలేని వారికి మరో చాన్స్ ఇస్తున్నారు. మొత్తానికి ఏపీలో అన్న దాతలకు ఒకేసారి మోడీ చంద్రబాబు డబ్బులు ఇచ్చి మరీ ఫుల్ ఖుషీ చేస్తారని అంటున్నారు.

Tags:    

Similar News