ఏపీ లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు లెక్కలేంటి... ?
ఎక్కడ ఏ రాష్ట్రంలో అయిన.. ప్రభుత్వం ఎంత బాగా పనిచేసినా.. ఏమూలో వ్యతిరేకత అయితే .. తొంగి చూస్తుంది.
ఎక్కడ ఏ రాష్ట్రంలో అయిన.. ప్రభుత్వం ఎంత బాగా పనిచేసినా.. ఏ మూలో వ్యతిరేకత అయితే .. తొంగి చూస్తుంది.ఎన్నో పథకాలను అమలు చేసిన తమిళనాడులో కూడా.. ప్రభుత్వ వ్యతిరేకత కారణంగానే ప్రజలు టీవీకే వైపు మొగ్గు చూపారు. ఇక, సీనియర్ మోస్ట్ సీఎం.. ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా కూడా పేరున్నా.. మమతా బెనర్జీని కూడా ప్రజలు ఓడించారు. ఈ పరిణామాలు.. ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న వ్యతిరేకత ను స్పష్టం చేశాయి.
ఇక్కడ ఏపీలో నూ.. ఈ వ్యతిరేకత ను పక్కన పెట్టి రాజకీయాలు చేసే పరిస్థితి ఉండదు. ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఇతర రాష్ట్రాలతో నూ.. గత వైసీపీ ప్రభుత్వంతోనూ పోల్చి చూసుకుంటే.. కొంత తక్కువగా ఉంటుందని అంచనా వున్నా.. ఈ వ్యతిరేకత కారణంగా.. వైసీపీ బలం పుంజుకునే అవకాశం ఉంటుంది. ఇదే జరిగితే.. కూటమి అధికారంలోకి వచ్చినా.. బొటా బొటి మార్కులతోనే ముందుకు సాగాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. దీనిని గమనించకుండా.. కూటమి నాయకులు లేరు.
ముఖ్యంగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు.. ప్రభుత్వ వ్యతిరేకతపై అంచనా లేకుండా ఉంటుందా? అంటే.. ఉండదనే చెప్పాలి. అందుకే.. క్షేత్రస్థాయిలో రెండు కీలక అంశాలను ప్రధానంగా ప్రజలకు వివరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం దక్కించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన బలంగా చెబుతున్నారు. పదే పదే వైసీపీని కార్నర్ చేస్తున్నారు. గొడ్డలి పార్టీ అంటూ.. వైసీపీపై వ్యతిరేకత ను మరింత పెంచుతున్నారు. ఇదే సమయంలో సామాజిక వర్గాల వారీ రాజకీయాలను పక్కన పెట్టారు.
మరీ ముఖ్యంగా అమరావతి ని మాత్రమే డెవలప్ చేస్తున్నారన్న వాదనను బలంగా తిప్పికొట్టే కార్యక్రమం లో భాగంగా మూడు ప్రాంతాల్లోనూ గత ఆరు మాసాల్లో 8 సార్లు పర్యటించారు. ఆయా పర్యటనల సమయంలో సీమకు, ఉత్తరాంధ్రకు ఎలాంటి మేళ్లు జరుగుతున్నాయో వివరిస్తున్నారు. పెట్టుబడులు.. వస్తున్న ఉద్యోగాలను ప్రస్తావిస్తున్నారు. తద్వారా.. ప్రాంతీయ రాజకీయాల విషయంలో అత్యంత అప్రమత్తమైన అడుగులు వేస్తున్నారు. ఇది ఫలిస్తే.. ప్రస్తుతం ఉన్న అంచనా ప్రకారం.. ప్రభుత్వ వ్యతిరేకత 20 శాతం నుంచి 15 శాతానికి తగ్గుతుందన్న అంచనా ఉంది.