లిక్కర్ స్కాం లో కొత్త పాత్రలు...సరికొత్త స్టోరీలూ!
ఏపీలో మద్యం కుంభకోణం గురించి అందరికీ తెలిసిందే గత ప్రభుత్వం హయాంలో వేల కోట్లలో ఈ కుంభకోణం జరిగింది అన్నది అతి పెద్ద ఆరోపణ.;
ఏపీలో మద్యం కుంభకోణం గురించి అందరికీ తెలిసిందే గత ప్రభుత్వం హయాంలో వేల కోట్లలో ఈ కుంభకోణం జరిగింది అన్నది అతి పెద్ద ఆరోపణ. దాని మీద కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమగ్రమైన విచారణను గత ఏడాది సెప్టెంబర్ నుంచి ప్రారంభించింది. ఇక ఈ కేసు సీఐడీ స్టార్ట్ చేసి ప్రత్యేక సిట్ దాకా వెళ్ళింది.
చాలా మంది ప్రముఖుల పేర్లు ఈ కేసులో వినిపిస్తున్నాయి. కొంతమంది అరెస్టు అయ్యారు. మరి కొందరి విషయంలో కూడా అరెస్టు జరుగుతుంది అన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో లిక్కర్ స్కాం విషయంలో ఇపుడు కొత్త కొత్తగా కధలు వినిపిస్తున్నాయన్న ప్రచారం సాగుతోంది.
ఇంతకీ ఏమిటి అంటే ఈ కేసులో ఇప్పటిదాకా ప్రచారంలో పేరు ఉన్నా కూడా కనీసం నోటీసులు కూడా జారీ కాని వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి తనను పోలీసులు అరెస్ట్ చేసేందుకు చూస్తున్నారని ఆరోపిస్తున్న సంగతి విధితమే. ఈ ఆరోపణలకు కొనసాగింపుగా అన్నట్లుగా చెవిరెడ్డి గన్ మెన్ గా పదేళ్ళ నుంచి పనిచేసిన ఏఆర్ కానిస్టేబులు మదన్ రెడ్డి సరికొత్త స్టోరీ ఒకటి వినిపించడం మీద చర్చ సాగుతోంది.
మదన్ రెడ్డి ఆరండ్ రిజర్వ్డ్ కేటగిరీలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. ఆయన చెవిరెడ్డి గన్ మెన్ గా ఒక దశాబ్దం పాటు పనిచేసి ఉన్నారు. ఈ మద్యం కేసుకు సంబంధించి సిట్ అధికారులు మదన్ రెడ్డి పలుమార్లు ప్రశ్నించారు. అయితే దీని మీద మదన్ రెడ్డి చెబుతున్నది ఏంటంటే తనను అనేక సార్లు సిట్ అధికారులు విచారణ పేరుతో పిలిచి తప్పుడు స్టేట్మెంట్ ఇవాలని ఒత్తిడి చేస్తున్నారు అని. అంతే కాదు ఏకంగా తన మీద దాడి కూడా చేశారని పేర్కొంటూ హైకోర్టులో మదన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.
అంతే కాకుండా ఆయన ఈ పిటిషన్ లోని అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి, అలాగే డీజీపీ గుప్తాకు పంపించారు. ఈ లేఖలో ఆయన అనేక అంశాలను ప్రస్తావించారు. లిక్కర్ స్కాం లో చెవిరెడ్డి భాస్కరరెడ్డి పాత్రని నిర్ధారించుకునేందుకు మదన్ రెడ్డిని సిట్ అధికారులు విచారించారు. అయితే యూని ఫారంతో తాను విచారణకు వెళ్తే సిట్ అధికారులు తనను తిట్టారు అని ఆ లేఖలో పేర్కొన్నారు.
అంతే కాదు మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి పాత్ర ఉందని చెప్పాలని ఒత్తిడి చేశారని అంటున్నారు. ఇక మదన్ రెడ్డి కంటే ముందు సిట్ విచారణకు వెళ్ళిన మరో హెడ్ కానిస్టేబులు సిట్ అధికారులు చెప్పినట్లుగా విన్నారని వారు చెప్పారట. అలా చేయమని కోరారని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు.
అయితే తనౌ తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వలేనని మదన్ రెడ్డి చెప్పడంతో సిట్ కి చెందిన పది మంది అధికారులు తన మీద మూకుమ్మడి దాడి చేశారని ఆయన పేర్కొన్నారు. దాంతో ఈ దాడిలో తాను గాయపడ్డాను అని ఆయన చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో తాను సిట్ విచారణకు ఒంటరిగా వెళ్లలేనని తన వెంట ఒక లాయర్ ని అనుమతిస్తే విచారణకు వెళ్తానని అల అనుమరిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అయితే విషయమేంటంటే వర్తమాన కాలంలో కోర్టులు క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. ఒక సామాన్యుడు తనకు న్యాయం కావాలని ఉన్నత న్యాయ స్థానాల వద్దకు వెళ్ళి న్యాయం పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో ఒక బాధ్యత కలిగిన ఏఆర్ కానిస్టేబులుని విచారణకు పిలిచి ఒత్తిడి పెట్టి మూకుమ్మడిగా అధికారులు దాడి చేయడం జరిగే పనేనా అన్న చర్చ సాగుతోంది.
నిజంగా ఎంత సిట్ అధికారులు అయినా అలాంటి దుస్సాహసం ఎందుకు చేస్తారు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దాంతో ఆయన చెప్పినది ఏ లాజిక్ కి అందడం లేదని అంటున్నారు. మరో వైపు చూస్తే మదన్ రెడ్డి ఆరోపణలను సిట్ అధికారులు ఖండించారు. అధికారులు ఒత్తిడి చేశారు అని ఆయన దుష్ప్రచారం చేస్తునారు అని పేర్కొన్నారు ఆయన వ్యాఖ్యలలో ఏ మాత్రం నిజం లేదని చెప్పారు. తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలని ఒత్తిడి చేశామనడం అవాస్తవం అన్నారు.
నిజానికి చూస్తే విచారణకు మదన్ రెడ్డి ఎంత మాత్రం సహకరించడం లేదని సిట్ అధికారులు పేర్కొన్నారు. అంతే కాదు మీ పేర్లు రాసి చనిపోతాను అని సిట్ అధికారులనే మదన్ రెడ్డి బెదిరించారు అని సిట్ అధికారులు చెబుతునారు. ఇదిలా ఉంటే లిక్కర్ స్కాం లో ఇప్పటికే ఏడుగురుని అరెస్ట్ చేశామని సిట్ అధికారులు చెప్పారు.
దీని వెనక ఏదో కుట్ర ఉందని సిట్ అధికారులు అనడం విశేషం. సిట్ అధికారుల మీద తప్పుడు ఆరొపణలతో హైకోర్టులో కేసు వేయడం డీజీపీకి ఫిర్యాదు చేయడం మీద సిట్ అధికారులు మాట్లాడుతూ ఏదో జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. మొత్తానికి లిక్కర్ స్కాం కాదు కానీ మదన్ రెడ్డి ఎపిసోడ్ తో వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది అని అంటున్నారు.