రాహుల్ గాంధీ టైటానిక్ కెప్టెన్ అయ్యుంటే !

అదే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కనుక ఆ షిప్ కు కెప్టెన్ అయ్యుంటే మంచుకొండను వెతుక్కుంటూ వెళ్లి మరీ ఢీ కొట్టించే వాడు

Update: 2024-05-01 07:33 GMT

‘’టైటానిక్ షిప్ ప్రమాదవశాత్తూ మంచుకొండను ఢీ కొట్టి నీట మునిగింది. అదే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కనుక ఆ షిప్ కు కెప్టెన్ అయ్యుంటే మంచుకొండను వెతుక్కుంటూ వెళ్లి మరీ ఢీ కొట్టించే వాడు. ఇందుకోసం రాత్రంతా సముద్రంలో టైటానిక్ షిప్ ను తిప్పుతుండేవాడు’’ అని ప్రముఖ రచయిత, శాస్త్రవేత్త ఆనంద్ రంగనాథన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ పార్టీ పతనానికి ప్రధాన కారణం రాహుల్ గాంధీయేనని ఇప్పటికే వయనాడ్ లో మరోమారు పోటీ చేసిన రాహుల్ గాంధీ అమేథీలో పోటీకి దిగనున్న నేపథ్యంలో స్మృతి ఇరానీకి పెద్దగా ఇబ్బంది ఉండదని అభిప్రాయం వ్యక్తంచేశారు.

ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీ, అమేథీ నియోజకవర్గాలు ఇటీవలి కాలం వరకూ గాంధీ కుటుంబాలకు కంచుకోటలు. సంవత్సరాల తరబడి గాంధీ కుటుంబాన్ని ప్రజలు ఆదరించినా వారు మాత్రం తమ నియోజకవర్గాలను పట్టించుకోలేదని ఆనంద్ రంగనాధన్ ఆరోపించారు.

దేశంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఆ రెండు నియోజకవర్గాలు వెనుకబాటుకు గురయ్యాయని, అందుకే అమేథీ ప్రజలు మేలుకొని 2019 పార్లమెంట్ ఎన్నికల్లో స్మృతి ఇరానీని గెలిపించారని అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News