రికార్డు క్రియేటర్ అమిత్ షా.. ఈ రికార్డుతో ప్రతిపక్షం గుండెల్లో గుబులే..

ప్రస్తుతం భారత్ లో మోడీ కాలం నడుస్తోంది. 2014లో ప్రధానిగా పగ్గాలు చేపట్టిన మోడీ తన అనుచర గణంతో దూసుకెళ్తున్నారు.;

Update: 2025-08-06 05:55 GMT

ప్రస్తుతం భారత్ లో మోడీ కాలం నడుస్తోంది. 2014లో ప్రధానిగా పగ్గాలు చేపట్టిన మోడీ తన అనుచర గణంతో దూసుకెళ్తున్నారు. ప్రపంచ దేశాలు నేడు భారత దేశ కీర్తిని పొగుడుతున్నాయంటే అది మోడీ, అతని పరివారమని ఘంటాపథంగా చెప్పవచ్చు. మోడీ కేబినెట్ లో కీలకంగా ఉన్న నేతల్లో మొదట నిలిచే వ్యక్తి అమిత్ షా. మోడీలా గొప్ప దేశ భక్తుడు అమిత్ షా. గుజరాత్ కు చెందిన షా తన రాజకీయ జీవితంలో ఎక్కువ కాలం మోడీతోనే పని చేశారు.. మోడీ కోసమే పని చేశారు.

బాల్యం నుంచి అవే భావాలతో ఎదిగిన షా..

ముంబాయ్ కి చెందిన మోడీ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చారు. బాల స్వయం సేవక్ నుంచి స్వయం సేవక్ గా.. ఆ తర్వాత విద్యార్థి విభాగం ఏబీవీపీలో పని చేశారు. 1987లో బీజేపీలో చేరిన ఆయన బీజేవైఎంలో కీలకపాత్ర పోషించారు. పార్టీ ఆదేశాల మేరకు గుజరాత్ రాష్ట్రానికి ఉపాధ్యక్షుడిగా పని చేశారు. 1991 లోక్ సభ ఎన్నికల్లో ఎల్ కే అద్వానీ గెలుపునకు కృషి చేసినందుకు ఆయనకు పార్టీ కీలక స్థానం కల్పించింది. గుజరాత్ లో పార్టీని ముందుకు నడిపేందుకు ఆయన విశేష కృషి చేశారు. 1997 ఎన్నికలు ఆయనను అసెంబ్లీకి తీసుకెళ్లాయి.

చాణక్య చతురతతో.. మరోసారి మోడీకి పగ్గాలు..

2001లో మోడీ సీఎం అయిన తర్వాత ఆయన కేబినెట్ లో మంత్రిగా చేరిన అమిత్ షా అప్పటి నుంచి మోడీని విడిచి ఉండలేదు. ఆయనతోనే ఆయన గెలుపునకే కష్టపడి పని చేశారు. 2014 లో మోడీ ప్రధాని అయిన తర్వాత 2015లో బీజేపీ జాతీయ పగ్గాలు చేపట్టి నడిపించారు. 2019లో కూడా పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అమిత్ షా కృషి తెరవెనుక కొనసాగిందని పార్టీ కార్యకర్తలకు తెలిసిందే. అమిత్ షాను బీజేపీ పరివారం చాణక్యుడిగా పిలుచుకుంటారు. 2019లో మోడీ కేబినెట్ లో హోంమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అమిత్ షా.

ఆరేళ్ల 64 రోజులు ఆయన రికార్డు బద్దలు కొట్టేదెవరు..?

2019 నుంచి తానే హోంమంత్రిగా కొనసాగుతూ వస్తున్నారు. ఆయన హోంమంత్రి పదవి చేపట్టి ఆగస్ట్ 5వ తేదీకి 6 సంవత్సరాల 64 రోజులు ఇది ఒక రికార్డు. ఈ రికార్డు గతంలో ఎల్‌కే అద్వానీ పేరిట ఉంది. ఆయన కంటే ముందు కాంగ్రెస్ పార్టీ నేత గోవింద్ వల్లభ్ ఆరేళ్లు హోంమంత్రిగా ఉన్నారు. అమిత్ షా ఇంకా తన పదవి కాలం ఉంది కాబట్టి మరో రికార్డు తిరగరాయనున్నారని పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. ఆపరేషన్ కాగర్ చేపట్టి మావోయిస్టులను సమూలంగా ఏరివేత చేపట్టారు. ఆర్టికల్ 370 ఎత్తివేతలో కూడా ఆయన పాత్ర చెప్పుకోతగిందని యావద్ దేశానికి తెలిసిందే.

Tags:    

Similar News