• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  "బ్రో"సినిమాలో శాంబాబు......

"బ్రో"సినిమాలో శాంబాబు... ఇచ్చిపడేసిన రాంబాబు!

| జనసేన అధినేత పవన్ పై అంబటి రాంబాబు వేసే సెటైర్లు మాములుగా ఉండవు

By - Tupaki Desk
Update: 2023-07-29 09:47 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ అధికార పార్టీలో సెటైర్స్ వేసేవారిలో అంబటి రాంబాబు ఒకరు అని అంటుంటారు. ఆ అనేదానికి తగ్గట్లుగానే పవన్ చేసిన సంచలన వ్యాఖ్యలపై ఒక చిన్న ట్వీట్ తో సరిపెట్టేస్తుంటారని అంటుంటారు. ఇలా ఆన్ లైన్ వేదికగా అంబటి వర్సెస్ పవన్ వ్యవహారం నడుస్తుంటుంది.

ఈ నేపథ్యంలో ఈ ఫైట్ ని ఆన్ లైన్ నుంచి నేరుగా వెండితెరపైకి తెచ్చారు పవన్ కల్యాణ్! ఈ మద్యకాలంలో రాంబాబు కాస్త గట్టిగానే తగులుకుంటున్నారనే కామెంట్లు వినిపిస్తున్నందుకో.. లేక, పొలిటికల్ గా కంటే సినిమాలోనే ఎక్కువ మందికి రీచ్ అవుతాదనో తెలియదు కానీ.. "బ్రో" సినిమాలో శాంబాబు పాత్రను తెరపైకి తెచ్చారని అంటున్నారు.

అవును... జనసేన అధినేత పవన్ పై అంబటి రాంబాబు వేసే సెటైర్లు మాములుగా ఉండవు అని అంటుంటారు. ఈ సమయంలో తాజాగా విడుదలైన పవన్ సినిమా... "బ్రో"లో పృథ్వి చేసిన శాంబాబు పాత్రతో ఏపీ మంత్రి అంబటి రాంబాబును పరోక్షంగా టార్గెట్ చేశారు పవన్ కళ్యాణ్ అని నెట్టింట ఒక ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది! ప్రస్తుతం దీనికి సంబంధించిన బైట్ ఆన్ లైన్ లో వైరల్ అవుతోంది.

"బ్రో" సినిమాలో శాంబాబు పాత్ర మొదట సాదారణంగానే అనిపించినప్పటికీ... "మై డియర్ మార్కండేయ" పాట చూస్తే అది ఏపీ మంత్రి అంబటి రాంబాబును టార్గెట్ చేస్తూ పెట్టిన క్యారెక్టర్ గా కనిపిస్తుంది. ఈ పాటలో పృద్వి గెటప్, స్టె ప్పులు చూస్తే కచ్చితంగా ప్రతి ఒక్కరికి అంబటి రాంబాబు గుర్తొస్తారని అంటున్నారు!

కాగా... ఈ సంవత్సరం సంక్రాంతి సంబరాలలో భాగంగా అంబటి రాంబాబు.. గిరిజన మహిళలతో కలిసి వేసిన స్టెప్పులు తాలూకు వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. అటువంటి టీ షర్ట్ ని ధరించి, అంబటి రాంబాబు లానే స్టెప్పులు వేయించి.. శాంబాబు క్యారెక్టర్ తో అంబటి రాంబాబును ఇమిటేట్ చేయించారని సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది!

ఈ సమయంలో మంత్రి అంబటి రాంబాబు.. ముందు ఆన్ లైన్ లోనూ, తర్వాత మైకుల ముందూ తనదైన శైలిలో స్పందించారు! "గెలిచినోడి డాన్స్ సంక్రాంతి! ఓడినోడి డాన్స్ కాళరాత్రి!" అంటూ ట్వీట్ చేసిన అంబటి... పవన్ కళ్యాణ్ ని ఈ పోస్ట్ కు ట్యాగ్ చేశారు.

దీంతో 2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన విషయాన్ని మరోసారి అంబటి గుర్తుచేశారని... 2019 ఎన్నికల ఫలితాలు వచ్చిన ఆ రోజు పవన్ కు నిజంగానే కాళరాత్రి లాంటిదని కామెంట్ చేస్తున్నారు వైసీపీ నెటిజన్లు.

అనంతరం మైకులముందుకు వచ్చిన అంబటి మరింత విపులంగా స్పందించారు. పవన్ పై మరింత లోతుగా, నేరుగా సెటైర్లు వేశారు. తానేమీ పవన్ కల్యాణ్ లా ప్యాకేజీ తీసుకుని డ్యాన్స్ చేసే వ్యక్తిని కానంటూ మొదలుపెట్టిన అంబటి... పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికిరారని అభిప్రాయపడ్డారు.

పవన్ తనను ఎదుర్కొలేకపోతున్నారని.. అందుకే సినిమాలో ఇలాంటి క్యారెక్టర్ సృష్టించి ఆనందం పొందుతున్నారని... దీన్ని శునకానందం అంటారని అంబటి అన్నారు. పవన్ కు ఈ శునకానందం మినహా మరో ఆప్షన్ లేదని గుర్తించాలని సూచించారు.

తాను సత్తెనపల్లిలో ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రి అయ్యి.. సంక్రాంత్రికి డ్యాన్స్ వేసినట్లు చెప్పిన అంబటి... గెలిచిన వ్యక్తి డ్యాన్స్ చేస్తే అది సంక్రాంతి.. ఓడిన వ్యక్తి డ్యాన్స్ వేస్తే అది చీకటి రాత్రి అని అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ ని చీకటి డ్యాన్సులు అని.. తనది సంక్రాతి డ్యాన్స్ అని రాంబాబు క్లారిటీ ఇచ్చారు!

ప్రస్తుతం ఈ వ్యవహారానికి సంబంధించిన సినిమా బైట్ లు, అంబటి ట్వీట్లు, మైకుల ముందు వేసిన సెటైర్లు వైరల్ అవుతున్నాయి!

Full View
Tags:    
  • Ambatirambabu 
  • Pawankalyan 
  • Janasena 
  • BROmovie 
  • Appolitics 
  • Samuthirakani 
  • Apelections 
  • Pawan 
  • BROfilm 
  • Ycpgovernment 

Similar News

ఏపీ జనం తీర్పు... గుప్పిట పట్టి ఉండిపోయిందా ?

2026-11-11 01:48 GMT

బొత్స కూతుర్ని ఓడించిన నీరజకే జెడ్పీ పట్టం ?

2026-11-11 01:47 GMT

విజయసాయిరెడ్డి కొత్త పార్టీ పేరు ?

2026-11-11 01:46 GMT

పవన్ కళ్యాణ్ విడాకులపై ’అంబటి’ రియాక్షన్ వైరల్

2026-11-11 01:45 GMT

డబ్బుల్లేవ్.. బీఆర్ఎస్‌కు ఇన్చార్జుల షాక్.. !

2026-11-11 01:44 GMT

విశాఖలో పెట్టుబడుల పండుగకి కౌంట్ డౌన్

2026-11-11 01:43 GMT

వైసీపీ బెస్ట్ డెసిషన్...కరెక్ట్ రూట్ లోనే !

2026-11-11 01:43 GMT

మంచు తెరలతో పర్యాటకులకు స్వాగతం

2026-11-11 01:42 GMT

సోనియా పుస్త‌కంలో తెగవెతికేసిన అంశాలు ఇవే!

2026-11-10 14:30 GMT

అనంతపురం వైసీపీ మేయర్.. కూటమి పక్కా ప్లానింగ్, ఆ ఒక్కరినీ లాగేస్తారా?!

2026-11-10 14:13 GMT

ఏపీ క్యాబినెట్ మీటింగ్‌లో ఊహించ‌ని ఘ‌ట్టం!

2026-11-10 13:12 GMT

ఎమ్మెల్యేలతో సీఎం విజయ్ అత్యవసర భేటీ.. తమిళనాడులో ఏం జరగబోతోంది?

2026-11-10 12:56 GMT

Copyright @2026

Powered by Blink CMS