కమ్మ వర్సెస్ కాపు : ఆగ్రహంతో అంబటి సంచలన వ్యాఖ్యలు
మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ఆవేశంతో రగిలిపోయారు. కోపంతో ఊగిపోయారు. కమ్మ వర్సెస్ కాపు అన్న ఇష్యూ మీద యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆయన సంచలన వ్యాఖ్యలే చేశారు.;
మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ఆవేశంతో రగిలిపోయారు. కోపంతో ఊగిపోయారు. కమ్మ వర్సెస్ కాపు అన్న ఇష్యూ మీద యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆయన సంచలన వ్యాఖ్యలే చేశారు. ఇంతకీ అంబటి ఎపుడు ఎక్కడ ఇలా కోపోద్రిక్తులు అయ్యారు, దేనికి అంతగా రియాక్ట్ అయ్యారు అంటే ఒక ప్రముఖ టీవీ చానల్ వీకెండ్ ఇంటర్వ్యూ ఫేస్ టూ ఫేస్ డిబేట్ లో అంబటి రాంబాబు మాట్లాడుతూ ఒక దశలో కోపంతో ఊగిపోయారు. కమ్మ వర్సెస్ కాపు అన్న దాని మీద యాంకర్ అడిగిన ప్రశ్నకు అంబటి వివరణ ఇస్తూనే ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.
సంచలన వ్యాఖ్యలు :
ఏపీలో కుల రాజకీయాలకు తెర తీయాలని రెచ్చగొట్టాలని మీరు చేసిన ప్రయత్నం కమ్మ వర్సెస్ కాపు కాదా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ అంబటి ఒక దశలో తీవ్ర ఆగ్రహానికి గురి అయ్యారు. అసలు కులాల మధ్య చిచ్చు పెట్టింది రెచ్చగొట్టింది ఎవరు అంటూ ఆయన ప్రశ్నించారు. నేను తెలివిగా మాటలను వాడుతాను అలాగే సెటైరల్ గా మాట్లాడుతాను అది నా టాలెంట్ నా హక్కు అని అంబటి అంటూనే ఫలానా సీఐ కులం ఇది అని అని చెప్పిన సందర్భం వేరు అన్నారు. దానికి కారణం తాను మొత్తం కమ్మ వారిని డాష్ డాష్ తిట్లతో తిట్టాను అని చార్జిషీటులోఆ సీఐ రాశారని అన్నారు తాను ఎపుడూ ఇలాంటి పదాలను అనలేదు కదా ఎందుకు రాశారు అని ఆయన ప్రశ్నించారు. తాను కులాల మధ్య చిచ్చు పెట్టి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాను అన్నది తప్పు అని నో నెవర్ అని అంబటి గట్టిగా చెప్పారు ఇక చార్జిషీటులో రాసిన వాళ్ళు రెచ్చగొట్టారా లేదా నేనా కోర్టులో వాదించిన వాళ్ళు రెచ్చగొట్టారా లేక నేనా ఇక చార్జి షీటులో ఉన్న విషయాన్ని బయటకు వచ్చి మీడియా ముందు తాను చెప్పడం రెచ్చగొట్టడమా అని అంబటి ప్రశ్నించారు. తన మొత్తం రాజకీయ జీవితంలో ఎపుడూ ఏ కులాన్ని రెచ్చగొట్టలేదని అంబటి అన్నారు. తాను 1989 నుంచి రాజకీయాల్లో ఉన్నాను అని ఆయన చెప్పుకొచ్చారు.
కులపరంగానే చేశారు :
ఇక తాను అనని మాటలను అన్నారని చెప్పి కమ్మవారిని రెచ్చగొట్టారని అంబటి ఆరోపించారు. ఏకంగా తన ఇంటి మీదకు వచ్చింది, ఇంటి మీద దాడి చేసింది అంతా కమ్మ వారే అని ఆయన అన్నారు ఆ కులానికి చెందిన వారిని కులాన్ని రెచ్చగొట్టి పెద్దలు పంపారని ఆయన విమర్శించారు. ఇక తన భార్యను పిల్లలను కులం పేరుతో తిట్టారని అంబటి అన్నారు. ఆ విషయాలను ప్రజలకు చెప్పుకునే బాధ్యత తనకు లేదా అని ఆయన ప్రశ్నించారు. తాను ఏకంగా 18 రోజులు జైలులో ఉన్నాను అని అలాగే, తన మీద జైలులో ఉండగానే కేసుల మీద కేసులు పెట్టారని అంబటి చెప్పారు. ఇక తనను పోలీస్ స్టేషన్ లో కొట్టడానికీ ఇద్దరు సీఐలు ఎందుకు ప్రయత్నం చేశారని తాను అడుగుతున్నానని అన్నారు. తాను అమాయకుడు అనుకుంటున్నారా అని ఆంబటి ఆగ్రహించారు. తాను 40 శాతం ఓటు బ్యాంక్ ఉన్న పార్టీలో ఉన్న వాడిని అన్నారు. అంతే కాదు ప్రజా బలం ఉన్న వాడిని నేను న్యాయ వాదీ కూడా అని ఆయన చెప్పారు. ఇక తాను వైఎస్సార్ వెంట నడిచిన వాడిని అని చెప్పారు
అంబటి వర్సెస్ పట్టాభి :
ఇక అంబటి ఇంటిపై దాడి పట్టాభి ఇంటి మీద టీడీపీ ఆఫీసు మీద దాడికి ప్రతీకారమా అన్న ప్రశ్నకు అంబటి బదులిస్తూ టీడీపీ ఆఫీసు మీద దాడిని పట్టాభి ఇంటి మీద దాడిని తాను సమర్ధించను అన్నారు. ఒకవేళ దానికీ దీనికీ చెల్లు అనుకున్నా రెండు సంఘటనలు ఒక్కటేనా అని అంబటి ప్రశ్నించారు రెండూ వేరు వేరు సంఘటనలు అని ఆయన అన్నారు. తాను ఎక్కడా ప్రెస్ లో మాట్లాడలేదని వైసీపీ ఆఫీసులో మాట్లాడలేదని ఆయా అన్నారు. ఇక తాను డాష్ డాష్ మాటలు మాట్లాడిన తరువాత కూడా పశ్చాత్తాప పడ్డాను కదా కానీ పట్టాభి అలా చేశారా అని ప్రశ్నించారు. ఇక అంబటి అన్ని టీవీలు లైఫ్ లో ఉండగా పట్టాభి మాట్లాడాడు జగన్ ని అనకూడని పదంతో తిట్లు తిట్టాఅని అంబటి ఆరోపించారు.
కరాళ నృత్యం చేశారు :
ఇక తన ఇంటి వద్ద తాను ఆ రోజు సాయంత్రం 4.20 నిముషాలకు తాను మాట్లాడింది తప్పు అని చెప్పానని అన్నారు. అయితే 5 గంటలకు దాడి ప్రారంభం అయింది అది అలా అర్ధరాత్రి 12. 20 నిముషాల దాకా కొనసాగింది అన్నారు. అంటే ఏడు గంటల 20 నిముషాలకు నాన్ స్టాప్ గా దాడి చేస్తూనే ఉన్నారని అంబటి చెప్పుకొచ్చారు. తన ఇంటి వద్ద గూండాలు కరాళ నృత్యం చేశారని, పెట్రోల్ బాంబులు వేశారని, ఇళ్ళని కార్లను పగలగొట్టారని అంబటి ఆరోపించారు. తాను జైలుకు వెళ్లడానికి ముందు జరిగిన పరిణామాలు దారుణంగా మారాయని అంబటి అన్నారు. న్యాయ స్థానంలో ఉండడం జైలుకు వెళ్ళడం ఐ డోంట్ కేర్ కానీ జైలుకు వెళ్లడానికి ముందు జరిగిన పరిణామాలే తనకు ఈ రోజుకీ బాధ కలిగిస్తున్నాయని అన్నారు.
ఏడు గంటల నరకం :
తన ఇంటి ముందు దాడి జరుగుతున్న దాని మీద డీఎస్పీకి ఎస్పీకి ఐజీకి ఫోన్ చేసినా ఎవరూ ఎత్తలేదని అంబటి అన్నారు. ఇక హోం సెక్రటరీ కి ఫోన్ చేసినా ఎత్తలేదు అని అన్నారు. వైర్ లెస్ సెట్స్ సెల్ ఫోన్లు పోలీసులకు ఇచ్చింది ప్రమాదం ఎక్కడైనా జరుగుతూంటే ఫోన్ ఎత్తుకోకుండా ఉండడానికా అని అంబటి ఫైర్ అయ్యారు. అలాంటి వారిని క్షమించాలా లేక వాళ్ళను పోలీసులు అనాలా అని ఆయన మండిపడ్డారు. ఏకంగా ఏడు గంటల సేపు తన ఇంటి ముందు విద్వంశం జరిగినా పోలీసులు చూస్తూ ఊరుకున్నారని అంబటి ఆరోపించారు. ఒక ఈ మొత్తం గొడవ జరుగుతున్నపుడు ఎస్పీ కూడా తన ఇంటికి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారని అంబటి చెప్పారు.