అమ‌రావ‌తి జోష్ అంతా ఇంతా కాదు.. కాద‌న్న‌వారే వ‌స్తున్నారే.. !

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో జోష్ మ‌రింత పెరిగింది. నిజానికి ఒక‌ప్పుడు రాజ‌ధాని విష‌యాన్ని ప‌క్క‌న పెట్టిన ఆర్థిక సంస్థ‌లు కూడా ఇప్పుడు క్యూ క‌డుతున్నాయి.;

Update: 2025-04-14 09:30 GMT

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో జోష్ మ‌రింత పెరిగింది. నిజానికి ఒక‌ప్పుడు రాజ‌ధాని విష‌యాన్ని ప‌క్క‌న పెట్టిన ఆర్థిక సంస్థ‌లు కూడా ఇప్పుడు క్యూ క‌డుతున్నాయి. రాష్ట్రంలో కూట‌మి స‌ర్కారు వ‌చ్చిన ద‌రిమిలా.. ఆర్థికంగా గూడ‌గ‌ట్టి అయినా.. వ‌చ్చే ఎన్నిక‌ల లోపే.. రాజ‌ధాని అమ‌రావతిని పూర్తి చేయాల‌ని ల‌క్ష్యంగా నిర్దేశించుకున్నారు. దీనికి సంబంధించి కేంద్రం నుంచి ఆర్థిక‌రూపంలో కొంత వెసులుబాటు వ‌చ్చింది. ప్ర‌పంచ బ్యాంకు కూడా ప‌ర‌మితులతో కూడిన రుణాన్ని అందించేందుకు రెడీ అయింది.

దీంతో పాటు ఆసియా అభివృద్ధి బ్యాంకు కూడా.. రాజ‌ధానికి రుణం అందించేందుకు రెడీ అయింది. ఇలా మొత్తంగా.. రాజ‌ధానిని కొంత మేర‌కు ప్రారంభించేందుకు ఆయా సంస్థ‌లు రుణాలు అందించాయి. అయి తే.. అనుకున్న ల‌క్ష్యం చేరేందుకు.. ఇవి మాత్ర‌మే స‌రిపోయే ప‌రిస్థితిలేదు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం మ‌రిన్ని మార్గాల‌ను అన్వేషించ‌డం ప్రారంభించింది. ఈ క్ర‌మంలో కొందరు పిలిస్తే వ‌చ్చారు. మ‌రికొంద‌రు పిల‌వ‌కుండానే వ‌స్తున్నారు.

ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌రికొన్ని దేశీయ బ్యాంకులు కూడా.. అమ‌రావ‌తికి రుణాలు ఇచ్చేందుకు ముం దుకు రావ‌డం గ‌మ‌నార్హం. వీటిలో జర్మనీ బ్యాంక్‌ కేఎఫ్‌డబ్ల్యూ రూ.5 వేల కోట్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇది ఊహించ‌ని ప‌రిణామం. అదేవిధంగా దేశీయ బ్యాంకులు ఇండియన్‌ బ్యాంక్, యూనియన్‌ బ్యాంక్, ఎస్‌బీఐల కన్సార్షియం(ఉమ్మ‌డిగా) కూడా రాజ‌ధాని నిర్మాణానికి నిధులు ఇచ్చేందుకు ముందుకు వ‌చ్చా యి. అలాగే.. ఇతర ఆర్థిక సంస్థ‌లు కూడా..రుణాలు ఇచ్చేందుకు సుముఖ‌త వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం.

ప‌రుగులు ఖాయం..

ప్ర‌స్తుతం రాజ‌ధాని నిర్మాణానికి అవ‌స‌ర‌మైన సంపూర్ణ నిధులు అంద‌డంతో.. ప‌నులు వేగంగా ముందుకు సాగేందుకు అవ‌కాశం ఏర్ప‌డింది. ఈ నెల 15-20 మ‌ధ్య ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని పిలిచి.. శంకుస్థాప‌న కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టాల‌ని స‌ర్కారు భావిస్తోంది. అన్నీ అనుకున్న‌ట్టుగా జ‌రిగితే.. ఈ క్ర‌తువు నిర్వి ఘ్నంగా ముందుకు సాగ‌నుంది. త‌ద్వారా వ‌చ్చే మూడేళ్ల‌లోనే రాజ‌ధాని నిర్మాణం పూర్త‌య్యే అవ‌కాశం ఉంది.

Tags:    

Similar News