జెయింట్ కందహార్.. నిజంగానే వున్నారా.. వెలుగులోకి వచ్చిన ఫోటోలు!
దీనికి తోడు ఇప్పుడు మరొకసారి ఈ జెయింట్ కందహార్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.;
జెయింట్ కందహార్.. గత కొన్ని దశాబ్దాలుగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు జెయింట్ కందహార్. ఎక్కువగా గుహలో ఉంటాయని , నరమాంస భక్షకులు అని ఎప్పటినుంచో వార్తలు వెలువడుతున్న విషయం తెలిసిందే. ఎర్రటి జుట్టు.. భారీ దేహం.. 12 అడుగుల ఎత్తు కలిగి.. మానవ రూపాన్ని కలిగిన జీవిగా వీటిని పరిగణిస్తారు. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ పర్వతాలలో అమెరికా సైనిక సిబ్బంది వీటిని ఎదుర్కొంది అని అప్పట్లో కథనాలు కూడా వెలువడ్డాయి. అంతేకాదు వీటి గురించి బయట సమాజానికి తెలిస్తే ప్రజలు భయాందోళనలకు గురవుతారని.. ఆ కారణంగానే అమెరికా సైనిక సిబ్బంది వీటి గురించి ఎక్కడ అధికారికంగా ప్రస్తావించలేదు అని కూడా అప్పట్లో వార్తలు వినిపించాయి.. అయితే నిజంగానే ఈ జెయింట్ కందహార్ లు ఉన్నాయా ? లేక కల్పిత కథలా? అనే విషయం మాత్రం ఎప్పటికప్పుడు మిస్టరీగానే మిగిలిపోతోంది.
దీనికి తోడు ఇప్పుడు మరొకసారి ఈ జెయింట్ కందహార్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ ఫోటోలను బట్టి చూస్తే ఇవి కూడా నిజం కాదు అని స్పష్టం అవుతుంది.
ఇదిలా ఉండగా మరోవైపు ఈ జెయింట్ కందహార్ గురించి ఒక స్టోరీ ఎప్పటికప్పుడు వినిపిస్తూ ఉంటుంది. విషయంలోకి వెళ్తే.. ఒక ఫేమస్ అమెరికన్ రేడియో షో అయిన ' కోస్ట్ కోస్ట్' హోస్ట్ స్టీవెన్ క్వెల్ ఏం చెప్పారంటే.." 2002 లో అమెరికా ఆర్మీ గ్రూపు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టింది. అందులో భాగంగానే ఆఫ్గనిస్తాన్ పర్వతాలలో సెర్చ్ ఆపరేషన్ చేస్తుండగా.. ఆ ఆర్మీ బృందం సడన్ గా కనిపించకుండా పోయింది. చాలా రోజులవుతున్నా.. ఈ కనిపించకుండా పోయిన గ్రూప్ నుంచి ఎటువంటి సమాచారం లభించలేదు. దీంతో యుఎస్ ఆర్మీ అధికారులు ఈ గ్రూపు పై ఏదో అటాక్ జరిగిందని భావించి.. ఈ గ్రూపును కనిపెట్టడానికి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్సును పంపించింది. ఈ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆఫ్ఘనిస్తాన్ పర్వతాలలో తప్పిపోయిన బృందం గురించి వెతుకుతూ ఉండగా అక్కడ వారికి ఒక అనుకోని దృశ్యం ఆశ్చర్యానికి గురిచేసిందట. అక్కడ తప్పిపోయిన బృందం శరీర కళేబరాలు, వారి ఆయుధాలు చెల్లాచెదురుగా పడి ఉండడం చూసి స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారట.
అయితే ఆ బృందం గుహ లోపలికి వెళ్లడానికి ప్రయత్నం చేయగా.. సుమారుగా 12 నుండి 15 అడుగుల మానవ శరీరం కలిగిన ఒక జీవి బయటకు రావడం చూసి విస్తుపోయారట. ఈ జీవి రెండు వరుసల పళ్ళను కలిగి ఉండి, ఒక్కొక్క చేతికి 6 వేళ్లను కలిగి ఉండడమే కాకుండా ఎర్రటి జుట్టు, భారీ ధృడ శరీరాన్ని కలిగి ఉందట. అంతేకాదు ఇది మనుషుల చర్మాన్ని తన శరీరంపై కప్పుకున్నట్లు కూడా వారు గుర్తించారు. ఈ జీవి వీరిని చూడగానే వీరిపై దాడి చేసే ప్రయత్నం చేయగా.. 30 సెకండ్ల పాటు జీవి తలపై టాస్క్ ఫోర్స్ తమ ఆయుధాలను ఉపయోగించి కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మరణించినట్లు సమాచారం. ఇకపోతే ఒక హెలికాప్టర్ సహాయంతో ఈ బృందం అమెరికాకు ఈ జీవిని తరలించారట.
అయితే ఇలాంటివి ఉన్నట్లు బయట ప్రపంచానికి తెలిస్తే ప్రజలు భయాందోళనకు గురవుతారని.. ఆ కారణంగానే ఈ విషయం గురించి ఎక్కడా చెప్పకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ.. టాస్క్ ఫోర్స్ తో ప్రత్యేకంగా సంతకాలు కూడా ఆ ప్రభుత్వం తీసుకున్నట్లు" సమాచారం. అయితే ఈ విషయాలు 2016లో ఒక ఆర్మీ వ్యక్తి బయటపెట్టారు. అప్పట్నుంచి దీనికి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. అయితే దీనిపై నిజా నిజాలు బయటకు రాలేదు. పైగా ఎవరూ కూడా ఈ జెయింట్ కందహారు ఉన్నట్లు ఎక్కడ అధికారికంగా ప్రస్తావించలేదు. కానీ ఇది మాత్రం ఒక కల్పిత కథగానే మిగిలిపోవడం జరిగింది. ఇలాంటి సమయంలో తాజాగా ఇప్పుడు మరొకసారి గుహ నుండి జెయింట్ కందహార్ బయటకు వస్తున్నట్లు కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండడంతో ప్రజలు దీని గురించి తెలుసుకోవడానికి ఆసక్తి కనుబరుస్తున్నారు.
ఇకపోతే చివరిగా.. పూర్తి పరిశోధన తర్వాత తేలింది ఏమిటంటే ఇది కేవలం కల్పితం మాత్రమే.. ఇందులో ఎలాంటి నిజం లేదు. కాకపోతే సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు వస్తే మాత్రం వీటి గురించి తెలుసుకోవాలనే తపన అందరిలో ఉంటుంది. అయితే ఇది కేవలం అధునాతన టెక్నాలజీతో రూపొందించిన కల్పితం మాత్రమే.