విమానంలో మరో పాడు పని... రెడ్ కార్డ్ చూపించినా ఆగలేదుగా!

ఈ సమయంలో ఒక వ్యక్తి సడన్ గా లేచి నిలబడ్డాడు.. అనంతరం సిబ్బందిలోని ఓ మహిళను వెనక నుంచి గట్టిగా వాటేసుకున్నాడు.

Update: 2023-09-09 16:07 GMT

గతకొంతకాలంగా విమానంలో పాడుపనులు చేస్తున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. బుద్దిహీనతకూ హోదాకు సంబందం ఉండదని... విమానంలో ప్రయాణించినంత మాత్రాన్న హుందాతనం రాదన్ని నిరూపించే ప్రయత్నంలో కొంతమంది అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా మరో సంఘటన విస్తరా విమానంలో చోటు చేసుకుంది.

అవును... విమనాల్లో ప్రయాణిస్తూ అత్యంత అసహ్యంగా, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఘటనలు ఈ మధ్యకాలంగా తరచూ వినిపిస్తున్నాయి. మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించడం, పక్క ప్రయాణికులపై మూత్ర విసర్జన చేయడం, సీట్ల కింద మలవిసర్జన చేయడం, పక్క సీటులో కూర్చున్నవారికి ప్రైవేట్ పార్ట్స్ బయటకు తీసి చూపించడం వంటి అత్యంత అసహ్యమైన సంఘటనలు ఎన్నో జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఇదే క్రమంలో తాజాగా విమాన సిబ్బందిలోని ఓ మహిళపై విదేశీ ప్రయాణికుడు ఒకరు అనుచితంగా ప్రవర్తించాడు. మస్కట్ నుంచి ఢాకా వెళ్తున్న విస్తారా విమానంలో ఈ ఘటన జరిగింది. వేధింపులకు పాల్పడిన వ్యక్తిని బంగ్లా దేశీయుడిగా గుర్తించారు.

వివరాళ్లోకి వెళ్తే... మస్కట్ నుంచి ఢాకాకు వెళ్తోన్న విస్తరా విమానం మరో అర్ధగంటలో ముంబై విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వనుంది. దీనికి సంబంధించిన ఫ్లైట్ ప్రకటన కూడా వెలువడింది. ఈ సమయంలో ఒక వ్యక్తి సడన్ గా లేచి నిలబడ్డాడు.. అనంతరం సిబ్బందిలోని ఓ మహిళను వెనక నుంచి గట్టిగా వాటేసుకున్నాడు.

Read more!

దీంతో ఆమె పెద్దగా అరిచింది. అయినప్పటికీ ఆగని ఆ వ్యక్తి... ఆమెను ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేశాడు. దీంతో తోటి ప్రయాణికులు కూడా అప్రమత్తమయ్యి అతడిని నిలువరించే ప్రయత్నం చేశారు. అయినా కూడా ఆగని ఆ వ్యక్తి.. తోటిప్రయాణికులను బెదిరించేపనికి పూనుకున్నాడు.

దీంతో అలర్ట్ అయిన పైలెట్ కూడా ఆ వ్యక్తిని సీరియస్ గా హెచ్చరించాడు. అనంతరం రెడ్ కార్డ్ జారీ చేశాడు. దీంతో విమానం గాల్లో ఉన్నప్పుడే కమాండ్ కంట్రోల్ కు సమాచారం అందించారు. దీంతో వెంటనే ముంబయి పోలీసులు రంగంలోకి దిగారు. విమానం ల్యాండ్ అవ్వగానే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు అతడికి రిమాండ్ విధించింది.

కాగా... ఆ వ్యక్తి పేరు మహ్మద్ దలాల్ అని.. ఇతడు బంగ్లాదేశ్ జాతీయుడని.. వయసు 30 ఏళ్లని పోలీసులు తెలిపారు. అయితే విమాన సిబ్బంది ఈ విషయంపై సీరియస్ గా ఉన్నారు.

Tags:    

Similar News