బ్రిటిష్ నటితో యంగ్ హీరో జోరు

లేగ క‌ళ్ల‌తో గుండె కోసేస్తోంది బ్రిటీష్ న‌టి- గాయ‌ని జ‌రా ఖాన్. ఈ బ్యూటీ ఇటీవ‌ల వ‌రుస సింగిల్స్ తో హృద‌యాల‌ను గెలుచుకుంటోంది.;

Update: 2025-07-28 04:23 GMT

లేగ క‌ళ్ల‌తో గుండె కోసేస్తోంది బ్రిటీష్ న‌టి- గాయ‌ని జ‌రా ఖాన్. ఈ బ్యూటీ ఇటీవ‌ల వ‌రుస సింగిల్స్ తో హృద‌యాల‌ను గెలుచుకుంటోంది. స్వరకర్త తనిష్క్ బాగ్చి - గాయకుడు యాసర్ దేశాయ్‌లతో కలిసి 'జోగన్' అనే తన రెండవ సింగిల్‌తో ఇటీవ‌ల‌ అభిమానుల‌ను అల‌రించారు. ట్రెడిష‌న‌ల్ దేశీ బాణీ సంగీత ప్రియుల్ని అల‌రించింది.


భార‌త‌దేశ ట్రెడిష‌న‌ల్ సంగీతం అంటే చెవి కోసుకునే ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం టైగ‌ర్ ష్రాఫ్ తో త‌న మూడో సింగిల్ లో న‌టిస్తోంది. తాజాగా ఆన్ లొకేష‌న్ నుంచి కొన్ని ఫోటోలు వీడియోల‌ను జారా షేర్ చేసింది. ఇవ‌న్నీ ప్ర‌స్తుతం ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతున్నాయి. ప‌ర్ఫెక్ట్ ఫిట్ టోన్డ్ బాడీతో టైగ‌ర్ ష్రాఫ్ గుబులు పుట్టిస్తుండ‌గా, జ‌రా ఖాన్ అంద‌చందాలు, డ్యాన్సుల్లో గ్రేస్ యువ‌త‌రాన్ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. ఒక రొమాంటిక్ గీతాన్ని తెర‌కెక్కించ‌డంలో ఎన్ని కాంప్లికేష‌న్స్ ఉంటాయి? దీనికోసం ఎంత‌గా ప్రాక్టీస్ చేయాలో కూడా జ‌రా ఖాన్ షేర్ చేసిన వీడియోల్లో స్ప‌ష్ఠంగా క‌నిపిస్తోంది. ఆన్ లొకేష‌న్ వంద మంది ముందు క‌థానాయిక‌తో రొమాన్స్ చేయాలంటే హీరోకి ఎంత క‌ష్ట‌మో కూడా అర్థ‌మ‌వుతోంది.


తాజాగా జ‌రా షేర్ చేసిన వీడియోలు, ఫోటోల‌కు అంద‌మైన క్యాప్ష‌న్ కూడా ఇచ్చింది. రెండేళ్ల స‌మ‌యం ప‌ట్టింద‌ని, ఈ మాయా పాటను రూపొందించడానికి అన్నివిధాలా ప్రయత్నించినందుకు మొత్తం బృందానికి జ‌రా అభినంద‌న‌లు తెలిపింది. జ‌రా ఖాన్ త‌దుప‌రి బాలీవుడ్ చిత్రాల్లో న‌టించేందుకు ఆసక్తిగా ఉంది. వెబ్ సిరీస్ ల‌లోను న‌టించే ఆఫ‌ర్లు అందుకుంటోంది.

Tags:    

Similar News