• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పుష్ప 2.. తమన్ హింట్...

పుష్ప 2.. తమన్ హింట్ ఇచ్చేశాడు

| ఇండియాలోనే హైయెస్ట్ బిజినెస్ జరిగిన చిత్రంగా ‘పుష్ప 2’ ఇప్పటికే రికార్డులు క్రియేట్ చేసినట్లు టాక్ అయితే వస్తోంది.

By - Tupaki Desk
Update: 2024-11-10 05:37 GMT

అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప 2’ డిసెంబర్ 5న రిలీజ్ కాబోతోంది. వరల్డ్ వైడ్ గా ఐదు భాషలలో విడుదల అవ్వబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇండియాలోనే హైయెస్ట్ బిజినెస్ జరిగిన చిత్రంగా ‘పుష్ప 2’ ఇప్పటికే రికార్డులు క్రియేట్ చేసినట్లు టాక్ అయితే వస్తోంది. ఒక్క ఓటీటీ రైట్స్ ద్వారానే నిర్మాతలకి 250 కోట్లు వచ్చాయంట.

నార్త్ ఇండియాలో ‘పుష్ప 2’ పైన భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా దెబ్బకి విక్కీ కౌశల్ ‘ఛావా’ మూవీని సైతంగా వాయిదా వేసుకున్నారు. నార్త్ లో ‘పుష్ప 2’ మొదటి రోజు ‘జవాన్’ కలెక్షన్స్ రికార్డ్ ని బ్రేక్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడనే విషయం అందరికి తెలిసిందే. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన రెండు సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి.

త్వరలో రానున్న ఐటెం సాంగ్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే గత రెండు రోజుల నుంచి ‘పుష్ప 2’ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ గురించి ఊహించని ప్రచారం నడుస్తోంది. ఈ సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం సుకుమార్ తమన్ కి అవకాశం ఇచ్చాడని అంటున్నారు. ‘పుష్ప 2’కి వర్క్ చేసే అవకాశం ఇచ్చినందుకు తమన్ ఓ ఈవెంట్ లో పుష్ప కోసం వెళ్ళాలి అన్నట్లు క్లారిటీ ఇచ్చాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియో చూపిస్తూ ‘పుష్ప 2’కి తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నాడని కన్ఫర్మ్ చేసేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ని కేవలం సాంగ్స్ కి మాత్రమే పరిమితం చేసి బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం తమన్ కి సుకుమార్ అవకాశం ఇచ్చారని అంటున్నారు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో సుకుమార్ సంతృప్తిగా లేరని అందుకే తమన్ ని తీసుకున్నారనే ప్రచారం నడుస్తోంది. మేకర్స్ నుంచి అయితే ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు.

కేవలం సోషల్ మీడియాలోనే ఒక వీడియోని పెట్టి వైరల్ చేస్తున్నారు. ‘పుష్ప’ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ అందించారు. ఈ నేపథ్యంలో ‘పుష్ప 2’ కి కూడా అతనే ఉంటాడని అందరూ భావిస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారంపై మేకర్స్ వీలైనంత త్వరగా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు. లేదంటే ఈ న్యూస్ ‘పుష్ప 2’ పైన పబ్లిక్ లోకి నెగిటివ్ బజ్ ని తీసుకెళ్లే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

I have #Pushpa2 waiting for me 🫣🔥

the best every emergency help u are gonna do ❤️💪 #Pushpa2TheRule #Thaman pic.twitter.com/lqVFrxrtRk

— ⚓ AmruthVarsh ⚓ (@Dhoni_Varsh) November 9, 2024
Tags:    
  • Tollywood 
  • Filmindustry 
  • Pushpa2 
  • Alluarjun 
  • Rashmikamandanna 
  • Sukumar 
  • Devvisriprasad 
  • Thaman 
  • Music 

Similar News

ఏడాది గడిచినా తగ్గని దుఖం!

2026-11-24 12:48 GMT

ఆస్కార్ రేసులో చిన్న సినిమా.. అసలు పోటీ ఇప్పుడే!

2026-11-24 12:46 GMT

విమ‌ర్శ‌ల వేళ త‌న‌యుడికి డాడ్ బూస్టింగ్!

2026-11-24 12:45 GMT

'ఆప‌రేష‌న్ సింధూర్' స‌మ‌యంలో భార‌త‌దేశానికి తెలియ‌ని భ‌యంక‌ర నిజం!

2026-11-24 12:40 GMT

అందం పుట్టుకతో వచ్చేదా? తయారు చేసుకునేదా?

2026-11-24 12:39 GMT

అలీతో పెళ్లి వెనుక అసలు కథ ఇదే.. జుబేదా షాకింగ్ కామెంట్స్!

2026-11-24 12:36 GMT

నషా ముక్త్ భారత్ ఉద్యమానికి ప్రభాస్ మద్దతు.. ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి!

2026-11-24 10:23 GMT

రెండు కోట్ల హీరో..నేడు వందల కోట్లకు!

2026-11-24 09:54 GMT

జీవితంలో మొదటి ప్రాధాన్యత ఎవరికి.. మీనాక్షి సమాధానం?

2026-11-24 09:52 GMT

నెపోలియన్..స్టాలిన్‌లకు సిక్స్ ప్యాక్ ఉందా?

2026-11-24 09:49 GMT

పెళ్లి చేసుకునే వ్యక్తిలో ఈ లక్షణాలు ఉండాలి.. మనసులో మాట చెప్పిన దివి!

2026-11-24 09:48 GMT

క్రమశిక్షణ..కఠిన డైట్‌తో యశ్ దృఢమైన దేహదారుఢ్యం!

2026-11-24 09:48 GMT

Copyright @2026

Powered by Blink CMS