• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నా సినిమాలను ఫ్యాన్స్...

నా సినిమాలను ఫ్యాన్స్ ఎందుకు సపోర్ట్‌ చేయడం లేదు?

| విన్నర్ గా నిలువకున్నా కూడా సోహెల్‌ కి బిగ్‌ బాస్ విజేత కంటే కూడా ఎక్కువ గుర్తింపు మరియు గౌరవం తెచ్చి పెట్టింది అనడంలో సందేహం లేదు.

By - Tupaki Desk
Update: 2024-02-03 05:51 GMT

తెలుగు బిగ్‌ బాస్ సీజన్‌ 4 తో పాపులారిటీ సొంతం చేసుకున్న నటుడు సోహెల్‌. బిగ్‌ బాస్ లో ఉన్న సమయంలో మంచి పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. విన్నర్ గా నిలువకున్నా కూడా సోహెల్‌ కి బిగ్‌ బాస్ విజేత కంటే కూడా ఎక్కువ గుర్తింపు మరియు గౌరవం తెచ్చి పెట్టింది అనడంలో సందేహం లేదు.


బిగ్ బాస్ ముందు వరకు బుల్లి తెరకు పరిమితం అయిన సోహెల్‌ ఆ తర్వాత వెండి తెరపై అరంగేట్రం చేశాడు. మిస్టర్‌ ప్రెగ్నెంట్‌, ఆర్గానిక్‌ మామా హైబ్రిడ్‌ అల్లుడు ఇంకా లక్కీ లక్ష్మణ్‌ వంటి సినిమాలు నటించాడు. ఆ సినిమాలకు పాజిటివ్ టాక్‌ వచ్చినా కూడా పెద్దగా వసూళ్లు రాలేదు అంటూ సోహెల్ గతంలోనే పేర్కొన్నాడు.

తాజాగా బూట్‌కట్‌ బాలరాజు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమాకు ప్రేక్షకుల నుంచి స్పందన ఆశించిన స్థాయిలో రాకపోవడంతో సోహెల్‌ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఫ్యామిలీ తో చూసే సినిమాలు తీయమంటారు. తీస్తే థియేటర్లకు రావడం లేదు అంటూ సోహెల్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.

బిగ్ బాస్ లో ఉన్నప్పుడు సోహెల్‌ సోహెల్‌ అన్నారు.. ఇప్పుడు ఎందుకు నా సినిమాలు చూసేందుకు మీరు మీ ఫ్యామిలీస్‌ తో థియేటర్లకు రావడం లేదు అంటూ సోహెల్‌ ప్రశ్నించాడు. నా సినిమాలను ఫ్యాన్స్ ఎందుకు సపోర్ట్‌ చేయడం లేదు? అంటూ ఆవేదనతో ప్రశ్నించాడు.

ఈ రోజుల్లో క్లీన్ ఫ్యామిలీ సినిమాలు చేయడం లేదని చాలా మంది విమర్శిస్తున్నారు. మరి ఇప్పుడు క్లీన్‌ ఫ్యామిలీ సినిమా తీసినా కూడా ఎందుకు ఫ్యామిలీతో కలిసి రావడం లేదు అంటూ సోహెల్‌ కన్నీళ్లు పెట్టుకున్నాడు. సోహెల్‌ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

బూట్‌ కట్‌ బాలరాజు సినిమాకు పాజిటివ్ టాక్‌ వచ్చిందని.. శని, ఆది వారాల్లో సినిమా కు మంచి కలెక్షన్స్ ఉంటాయని ఆయన సన్నిహితులు ఆయన్ను ఓదార్చడం వీడియో లో చూడవచ్చు. మొత్తానికి సోహెల్‌ కన్నీళ్లతో అయినా బూట్‌ కట్‌ బాలరాజు టికెట్లు తెగేనా చూడాలి.

Big boss Host Nag ke dikku ledu e contestant Paytm Sohel gadu vachesi na cinema chudatledu ani edupu 😭 pic.twitter.com/KIO4QASfXa

— Satyajith (@satyajithpinku) February 2, 2024

Tags:    
  • Biggboss 
  • Season4 
  • Sohel 
  • MrPregnant 
  • Organicmama 
  • Balaraju 
  • Bootcutbalaraju 

Similar News

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

Copyright @2026

Powered by Blink CMS