• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వార్ 2.. దేవర 1.....

వార్ 2.. దేవర 1.. కిక్కిచ్చే అప్డేట్స్

| యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగమైనటువంటి హృతిక్ రోషన్ వార్ 2 సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2023-11-29 07:31 GMT

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర 1 సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఇండియా సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్న విషయం తెలిసిందే. యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగమైనటువంటి హృతిక్ రోషన్ వార్ 2 సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

అయితే ఈ సినిమా షూట్ లో తారక్ ఎప్పుడు అడుగు పెడతాడా అనే విషయంలో కూడా ఇది వరకే ఒక టాక్ వినిపించింది. వార్ 2 షూటింగ్లో జూనియర్ ఎన్టీఆర్ డిసెంబర్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది అని కథనాలు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ ప్లాన్ మారింది. 2024 జనవరి నుంచి తారక్ వార్ 2 షూట్ లో కలవబోతున్నాడు.

దర్శకుడు ఆయన్ కూడా ఇప్పటికే సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టేసాడు. ఇక భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా విడుదల డేట్ పై కూడా ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఈ సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తిచేసి 2025 ఆగస్టులో విడుదల చేయాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం నిర్మాణ సంస్థ అనుకున్న ప్లాన్ ప్రకారం అయితే ఈ సినిమాను ఆగస్టు 14 2025లో విడుదల చేయాలి అని అనుకుంటూ ఉన్నారు.

ఇక దాదాపు ఈ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ ఏడు నెలల సమయం కేటాయించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈలోపు జూనియర్ ఎన్టీఆర్ దేవర సెకండ్ పార్ట్ కు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి చేసే అవకాశం అయితే ఉంది. దేవర సినిమా వచ్చే ఏడాది 2024 ఏప్రిల్ లో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ విషయంలో కూడా చిత్ర యూనిట్ వేగంగానే అడుగులు వేస్తోంది.

దేవర సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ కూడా వచ్చే ఏడాది మొదట్లోనే ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. మోషన్ పోస్టర్స్ తో పాటు కొన్ని పోస్టర్లు కూడా విడుదల చేశారు. వాటికి మంచి స్పందన వచ్చింది. ఇక 2024 జనవరిలోనే దేవర ఫస్ట్ పార్ట్ కు సంబంధించిన ఒక స్పెషల్ గ్లింప్స్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి ఆ అప్డేట్ సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలను పెంచుతుందో చూడాలి.

Tags:    
  • War2 
  • Hrithikroshan 
  • Ayan 
  • Devara 
  • Ntr 
  • Koratalasiva 

Similar News

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

Copyright @2026

Powered by Blink CMS