వార్ 2.. తెలుగు కంటే హిందీ రన్ టైమ్ ఎక్కువ- కారణం అదే

ట్రైలర్ రిలీజ్ సహా ఈ చిత్రం అన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా లాంఛనాలను పూర్తి చేసుకుంది.;

Update: 2025-08-09 10:36 GMT

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి లీడ్ రోల్స్ లో నటించిన చిత్రం వార్ 2. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించాడు. ఈ సినిమాలో భారీ యాక్షన్ స్టంట్స్ ఉంటాయని, అలాగే హృతిక్ - ఎన్టీఆర్ మధ్య ఫైట్ ఎపిసోడ్లు సినిమాకు కీ హైలైట్స్ గా ఉంటాయని ట్రైలర్ చూస్తే స్పష్టత వచ్చేస్తోంది.

ట్రైలర్ రిలీజ్ సహా ఈ చిత్రం అన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా లాంఛనాలను పూర్తి చేసుకుంది. ఇక వచ్చే వారం (ఆగస్టు) 14న విడుదలకు సిద్ధమవుతోంది. అయితే రన్ టైమ్ లో హిందీ, తెలుగు వెర్షన్ ల మధ్య కాస్త తేడా ఉందనుంది. హిందీ వెర్షన్.. తెలుగు వెర్షన్ కంటే రెండు నిమిషాలు ఎక్కువ నిడివి ఉండనుంది. ఇక్కడే ఆభిమానులకు ఓ సందేహం కలుగుతోంది.

అయితే ఈ సినిమా యష్ రాజ్ ఫిల్మ్స్ ఫ్రాంచైజీ నుండి కొత్త సినిమాగా రానుంది. ఈ సినిమా యష్ రాజ్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించింది. అయితే తాజాగా సినిమా పై కొత్త బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా పోస్ట్ క్రెడిట్ అంటే సినిమా ముగిసిన తర్వాత.. యష్ రాజ్ సంస్థ నుంచి రానున్న మరో కొత్త సినిమా గురించి అప్డేట్ ఉంటుందని అంటున్నారు.

ఇప్పటికే కొందరు షారుక్ ఖాన్- సల్మాన్ ఖాన్ వార్ 2 పోస్ట్ క్రెడిట్ లో కనిపిస్తారని.. ఇది యష్ రాజ్ ఫిల్మ్స్ రూపొందించిన టైగర్ Vs పఠాన్ గురించే నని అంటున్నారు. అలాకాకుండ YRF వారి స్పై యూనివర్స్ లో భాగమైన ఆల్ఫా సినిమా నుండి ఏదైనా క్లిప్‌ ప్లే చేస్తారని మరికొందరు అభిప్రాయడుతున్నారు.

ఈ ఆల్ఫాలో అలియా భట్, శర్వరి వాఘ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అలా వార్ 2 ఈ పోస్ట్ క్రెడిట్ సన్నివేశం ప్రస్తుతం గురించి చాలా ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. ఎందుకంటే తెలుగు వెర్షన్ కంటే హిందీ వెర్షన్ రెండు నిమిషాలు ఎక్కువ నడివి ఉండడమే కారణం.

ఇక అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన వార్ 2 చిత్రంలో కియారా అద్వానీ కథానాయికగా నటించింది. ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. అలాగే తెలుగులో ప్రీ - రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ఆగస్టు 10న ఆదివారం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి హృతిక్, ఎన్టీఆర్ హాజరుకానున్నారని టాక్ వినిపిస్తుంది.

Tags:    

Similar News