కియ‌రా (X) హృతిక్ : వ‌య‌సు గ్యాప్‌ ఇబ్బందే!

తాజాగా రిలీజైన 'వార్ 2' ట్రైల‌ర్ వైర‌ల్‌గా దూసుకెళ్లింది. అయితే ఈ ట్రైల‌ర్ లో హృతిక్ తో లిప్ లాక్ వేసిన కియ‌రా గురించే అభిమానులు ఆస‌క్తిగా ముచ్చ‌టించుకుంటున్నారు.;

Update: 2025-07-26 04:01 GMT

51ఏళ్ల అబ్బాయి- 33ఏళ్ల అమ్మాయితో డీప్‌గా లిప్ లాక్ వేస్తే, అది చూడ‌టానికి ఎబ్బెట్టుగా ఉంటుందా? 'వార్ 2' ట్రైల‌ర్‌లో హృతిక్ రోష‌న్ - కియ‌రా అద్వాణీ న‌డుమ డీప్ లిప్ లాక్ సీన్ ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌కు తావిచ్చింది. హృతిక్, ఎన్టీఆర్ క‌థానాయ‌కులుగా అయాన్ ముఖ‌ర్జీ తెర‌కెక్కించిన 'వార్ 2'లో కియ‌రా క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఇందులో కియ‌రా పాత్ర అత్యంత కీల‌క‌మైన‌ది.

తాజాగా రిలీజైన 'వార్ 2' ట్రైల‌ర్ వైర‌ల్‌గా దూసుకెళ్లింది. అయితే ఈ ట్రైల‌ర్ లో హృతిక్ తో లిప్ లాక్ వేసిన కియ‌రా గురించే అభిమానులు ఆస‌క్తిగా ముచ్చ‌టించుకుంటున్నారు. ఫిఫ్టీ ప్ల‌స్ హీరోతో ఇర‌వై ఏళ్ల గ్యాప్ ఉన్న కియ‌రా లిప్ లాక్ వేయ‌డం కొంద‌రికి న‌చ్చ‌డం లేదు. ఇక ఈ సినిమా ఆగ‌స్టు 14న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ చిత్రాన్ని య‌ష్ రాజ్ ఫిలింస్ అత్యంత భారీగా నిర్మిస్తోంది.

అయితే ఆ ఇద్ద‌రి న‌డుమా 18 ఏళ్ల వ‌య‌సు గ్యాప్ గురించి నెటిజ‌నులు ఇరు వ‌ర్గాలుగా డివైడ్ అయ్యి వ్యాఖ్యానిస్తున్నారు. 33 వ‌య‌సు అంటే అన్నీ తెలిసిన వ‌య‌సు. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా రొమాన్స్ త‌ప్పేమీ కాద‌ని కొంద‌రు విశ్లేషించ‌గా, 30 ఏళ్ల మ‌హిళ పూర్తి ప‌రిణ‌తితో ఆలోచిస్తుంద‌ని, వారి రొమాన్స్ స‌రైన‌దేన‌ని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. అయినా వ‌య‌సు వ్య‌త్యాసం ఒక స‌మ‌స్య‌గా భావిస్తారు ఎందుకు? అని కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు.

ప్ర‌స్తుతం వార్ 2లో కియ‌రా పాత్ర గురించి ఎక్కువ‌గా చ‌ర్చ సాగుతోంది. ఇందులో కావ్య లూథ్రా అనే పాత్రను కియారా అద్వానీ పోషిస్తోంది. కావ్య 'రా' జాయింట్ సెక్రటరీ కల్నల్ సునీల్ లూథ్రా (అశుతోష్ రాణా) కుమార్తె. ఆమె YRF స్పైవర్స్‌లో కీలక వ్యక్తి.. హృతిక్ రోషన్ కబీర్‌ను వెంబడించే లేడీ ఆఫీస‌ర్ అని తెలుస్తోంది.

Tags:    

Similar News