మీలానే నేనూ ఎంతో ఎగ్జైటెడ్ గా ఉన్నా
ప్రస్తుతం ప్రపంచంలోని మూవీ లవర్స్ ఎదురుచూస్తున్న మోస్ట్ అవెయిటెడ్ సినిమాల్లో వార్2 కూడా ఒకటి.;
ప్రస్తుతం ప్రపంచంలోని మూవీ లవర్స్ ఎదురుచూస్తున్న మోస్ట్ అవెయిటెడ్ సినిమాల్లో వార్2 కూడా ఒకటి. బ్లాక్ బస్టర్ వార్ మూవీకి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో బాలీవుడ్ హ్యాండ్‌సమ్ హంక్ హృతిక్ రోషన్ తో పాటూ టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్నారు. హృతిక్, ఎన్టీఆర్ ఇద్దరూ కూడా ఎవరికి వాళ్లే ఎంతో అద్భుతమైన నటులు.
అలాంటి వారిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై అందరికీ మొదటి నుంచే భారీ అంచనాలేర్పడ్డాయి. దానికి తోడు ఈ సినిమాతోనే ఎన్టీఆర్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది.
వార్2 షూటింగ్ పూర్తైన విషయాన్ని వెల్లడిస్తూ రీసెంట్ గా ఆ సినిమాలో నటించిన ఎన్టీఆర్, హృతిక్ ఇద్దరూ తమ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే. అందులో హృతిక్ రోషన్ చేసిన పోస్ట్ ను షేర్ చేస్తూ ఈ సినిమా విషయంలో మీరెంత ఎగ్జైటెడ్ గా ఉన్నారో తాను కూడా అంతే ఎగ్జైటెడ్ గా ఉన్నానని, మీతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎప్పటికీ మర్చిపోలేనని కియారా పోస్ట్ చేశారు.
అయాన్ ముఖర్జీ వర్క్ ను ప్రపంచం ఎప్పుడు చూస్తుందా అని తానెంతో వెయిట్ చేస్తున్నానని, అయాన్, ఎన్టీఆర్ తో సహా చిత్ర యూనిట్ మొత్తం ఈ సినిమాకు ప్రాణం పోశారని కియారా తన పోస్టులో రాయగా ఇప్పుడు ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. కాగా వార్2 సినిమాలో కియారా అద్వానీ, హృతిక్ రోషన్ సరసన హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా వార్2 ఆగస్ట్ 14న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.