కంగారూ బీచ్‌లో కంగారు పుట్టిస్తున్న శ‌ర్మా గాళ్

శ‌ర్మా సిస్ట‌ర్స్ నేహా శ‌ర్మ‌- ఐషా శ‌ర్మ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. నేహాశ‌ర్మ చిరుత చిత్రంతో టాలీవుడ్ లో క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైంది.;

Update: 2026-02-01 18:22 GMT

శ‌ర్మా సిస్ట‌ర్స్ నేహా శ‌ర్మ‌- ఐషా శ‌ర్మ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. నేహాశ‌ర్మ చిరుత చిత్రంతో టాలీవుడ్ లో క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైంది. ఆ త‌ర్వాత హిందీ చిత్ర‌సీమ‌కు వెళ్లిపోయిన ఈ బ్యూటీ, కొన్నాళ్ల‌కు త‌న సోద‌రి ఐషా శ‌ర్మ‌ను కూడా సినీరంగానికి ప‌రిచ‌యం చేసింది. అయితే ఈ సిస్ట‌ర్స్ కెరీర్ అంతంత మాత్ర‌మే. ఇప్పుడున్న ఠ‌ఫ్ కాంపిటీష‌న్ లో శ‌ర్మా గాళ్స్ కెరీర్ ర‌న్ ఆశించినంత‌గా లేదు. అయితే సోష‌ల్ మీడియాల్లో త‌మ‌కు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా ప‌లు ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టించి రాణిస్తున్నారు.




అయితే అక్కా చెల్లెళ్ల‌లో నేహా శ‌ర్మ ఇటీవ‌ల వెల్ కం 3 లాంటి భారీ చిత్రంలో అవ‌కాశం అందుకుంది. ప‌లువురు యువ‌హీరోల స‌ర‌స‌న న‌టిస్తున్న ఈ బ్యూటీ ఇటీవ‌ల వెబ్ సిరీస్ ల‌తోను మంచి పేరు తెచ్చుకుంటోంది. ఇక ఇటీవ‌ల శ‌ర్మా సిస్ట‌ర్స్ ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో ఫుల్ జాలీగా టైమ్ స్పెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మెల్‌బోర్న్ వీధుల్లో సువిశాల‌మైన ఆసీస్ బీచ్‌ల్లో తెగ హంగామా చేస్తున్నారు. దీనికి సంబంధించిన తాజా ఫోటోలు వెబ్ లోకి వ‌చ్చాయి.




నేహా శర్మ లేటెస్టుగా త‌న ఫోటోల‌ను ఇన్ స్టాలో షేర్ చేయ‌గా అవి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ముఖ్యంగా మెల్‌బోర్న్ తీరంలో శ‌ర్మా గాళ్ దిగిన బికినీ ఫోటోలు నెటిజనుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. నేహా గ్లామర్ , ఫిట్ లుక్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.




ప్ర‌స్తుతం శ‌ర్మా సిస్ట‌ర్స్ ఆసీస్ లోని అన్ని బీచ్ ల‌ను చుట్టేస్తున్నారు. `మెల్‌బోర్న్ డైరీస్` పేరుతో వారు షేర్ చేస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఓవైపు బికినీలు మ‌రోవైపు స‌మ్మ‌ర్ లూజ్ స్టైల్ దుస్తుల‌తోను శ‌ర్మా సిస్ట‌ర్స్ ఆసీస్ వీధుల్లో ర‌చ్చ లేపుతున్నారు. ప్ర‌స్తుతం ఈ స్పెష‌ల్ ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతోంది. నేహ శ‌ర్మ బికినీ లుక్ ఇంట‌ర్నెట్లో గుబులు రేపుతోంది.

తెలుగులో రామ్ చరణ్ సరసన చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నేహా శర్మ ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లింది. ప్రస్తుతం ఆమె కొన్ని వెబ్ సిరీస్‌లతో పాటు మలయాళంలో దుల్కర్ సల్మాన్ వంటి స్టార్ల సరసన నటిస్తోంది.

Tags:    

Similar News