పవన్ మేనరిజంతో బండ్ల.. ఈసారి ఈ స్టైల్ లో..

టాలీవుడ్‌ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై తన అభిమానాన్ని ఎప్పటికప్పుడు బహిరంగంగానే వ్యక్తం చేసే నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ మరోసారి అదే స్టైల్‌ తో ప్రేక్షకుల ముందుకొచ్చారు.;

Update: 2026-02-01 18:34 GMT

టాలీవుడ్‌ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై తన అభిమానాన్ని ఎప్పటికప్పుడు బహిరంగంగానే వ్యక్తం చేసే నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ మరోసారి అదే స్టైల్‌ తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. గతంలో ఓ కార్యక్రమంలో 'ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా' అంటూ పవన్‌ పై తన అభిమానాన్ని చాటిన ఆయన, ఇప్పుడు అదే డైలాగ్‌ ను రీమిక్స్ చేసి మళ్లీ హైలెట్ అయ్యారు.

ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో విడుదల కానున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రానికి సంబంధించిన ప్రమోషన్లు ఫుల్ జోష్ లో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా సినిమా నుంచి పాయా పాయా అనే ఫుల్ వీడియో సాంగ్‌ ను విడుదల చేశారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఆ సాంగ్.. మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.

సినిమాలో జరిగే ఓ ఫెస్టివల్ నేపథ్యంలో ఆ పాటను షూట్ చేసినట్లు తెలుస్తోంది. కలర్ ఫుల్ సెట్స్, సందడి వాతావరణం, మాస్ బీట్‌ తో సాగే ఆ పాటలో బండ్ల గణేశ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. షైనింగ్ కాస్ట్యూమ్‌ లో ఎంట్రీ ఇచ్చిన ఆయన తన మేనరిజం, స్టెప్పులు, ఎక్స్ప్రెషన్స్‌ తో ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ స్టైల్‌ ను అనుకరిస్తూ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ అభిమానులను కట్టిపడేస్తున్నాయి.

పాటలో అలీ డీజే ఆపరేటర్‌ గా కనిపిస్తూ కామెడీ టచ్ యాడ్ చేశారు. అలాగే పలువురు నటులు కూడా స్టెప్పులు వేస్తూ సాంగ్‌ కు మరింత ఉత్సాహం తెచ్చారు. అయితే పాట చివర్లో బండ్ల గణేశ్ చెప్పే 'ఈశ్వరా.. పరమేశ్వరా.. పవరేశ్వరా' డైలాగ్ మాత్రం మొత్తం సాంగ్‌ కే హైలెట్‌ గా నిలిచింది. ఆ డైలాగ్‌ కు ఇప్పటికే మంచి ఫేమ్ ఉందన్న విషయం తెలిసిందే.

ఇక సినిమా విషయానికి వస్తే.. 90స్ వెబ్ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇచ్చిన హీరో శివాజీ ఫుల్ లెంగ్త్ పాత్రలో కనిపించనున్నారు. ఆ చిత్రాన్ని ఆయన స్వయంగా నిర్మాతగా మారి తన శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌ పై నిర్మిస్తున్నారు. కుటుంబ కథా నేపథ్యంతో, ఎంటర్టైనర్ గా సినిమా తెరకెక్కుతోంది. శివాజీకి జంటగా లయ నటిస్తుండగా, ప్రిన్స్, అలీ, ధన్‌ రాజ్, ఇమ్మాన్యూయేల్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఆ చిత్రానికి రంజిన్ రాజ్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌ కు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మొత్తంగా పాయా పాయా సాంగ్‌ తోనే మేకర్స్ మంచి బజ్ క్రియేట్ చేయగలిగారు. బండ్ల గణేశ్ పవన్ మేనరిజం మరోసారి ప్రేక్షకులను అలరించడంతో ఎక్స్ట్రా క్రేజ్ మూవీకి వచ్చింది. ఫిబ్రవరి 12 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది.


Full View


Tags:    

Similar News