'చెన్నై లవ్ స్టోరీ'.. అదనపు షోలతో ఇలా..
మామూలుగా లవ్ స్టోరీలకు యూత్ కనెక్ట్ అయితే థియేటర్ల దగ్గర ఉండే అట్మాస్ఫియర్ వేరేలా ఉంటుంది. ఈ సినిమా విషయంలో కూడా అదే జరుగుతోంది.
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ 'చెన్నై లవ్ స్టోరీ' థియేటర్లలో మంచి జోరు చూపిస్తోంది. లవ్ అండ్ ఎమోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 12.3 కోట్ల గ్రాస్ సాధించి, కిరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను నమోదు చేసింది. సినిమా చూసిన ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ హవా స్పష్టంగా కనిపిస్తోంది.
మామూలుగా లవ్ స్టోరీలకు యూత్ కనెక్ట్ అయితే థియేటర్ల దగ్గర ఉండే అట్మాస్ఫియర్ వేరేలా ఉంటుంది. ఈ సినిమా విషయంలో కూడా అదే జరుగుతోంది. ఆడియన్స్ డిమాండ్ కు తగ్గట్టుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతటా 300 కి పైగా అదనపు షోలను యాడ్ చేశారంటే ఏ రేంజ్ లో బుకింగ్స్ జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. మల్టీప్లెక్స్‌లతో పాటు సింగిల్ స్క్రీన్స్ లో కూడా ఈ సినిమాకు ఆక్యుపెన్సీ బాగా పెరుగుతోంది.
రవి నంబూరి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం పాత రొటీన్ మాస్ అటెంప్ట్స్ ని పక్కనపెట్టి, అమాయకుడైన స్టీవెన్ శంకర్ పాత్రలో సర్ ప్రైజ్ చేశాడు. సాధారణంగా కొంత యాటిట్యూడ్ ఉన్న పాత్రల్లో కనిపించే ఆయన, ఇందులో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే రోల్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. హీరో క్యారెక్టరైజేషన్ కథకు బలంగా నిలిచింది.
ఇక సినిమాకు ప్రధాన బలమనిపిస్తున్న వ్యక్తి హీరోయిన్ శ్రీ గౌరీప్రియ. నివేదిత పాత్రలో ఆమె చూపించిన నటన, ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్లు సీట్లలో ఉన్న ప్రేక్షకులను బాగా కదిలిస్తున్నాయి. దానికి తోడు మణిశర్మ అందించిన మెలోడీస్, సాయి రాజేష్ అందించిన ఎమోషనల్ లైన్ ఈ లవ్ స్టోరీకి ప్రాణం పోశాయని చెప్పవచ్చు.
పరిమిత బడ్జెట్ తో ప్రాపర్ ఎమోషన్స్ ని నమ్ముకుని తీసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిలబడతాయని మరోసారి రుజువైంది. ఆరంభంలో వచ్చిన టాక్ ని పట్టుకుని ఇప్పుడు వీకెండ్ లో థియేటర్ల కౌంట్, షోల సంఖ్య పెరగడం మూవీ టీమ్ కి పెద్ద ప్లస్ పాయింట్. కథలో ఎమోషన్ పండితే చిన్న సినిమాలైనా పెద్ద రేంజ్ కి వెళ్తాయని ఈ సినిమా నిరూపిస్తోంది. ఆరంభంలో వచ్చిన ఈ ఊపును బట్టి చూస్తే కిరణ్ అబ్బవరం ఖాతాలో ఇది ఒక సాలిడ్ కమర్షియల్ విన్నర్ గా నిలిచే అవకాశం ఉంది. మరి రానున్న రోజుల్లో ఈ లవ్ స్టోరీ బాక్సాఫీస్ దగ్గర ఇంకెన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో, కలెక్షన్ల పరంగా ఏ రేంజ్ లో ముగిస్తుందో చూడాలి.