అమీర్ లోగ్ పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్.. అక్కడే ఓ ట్విస్ట్: యోగి

హైదరాబాద్ అంటే బిర్యానీ, బోనాలు, బస్తీలు, ప్రత్యేకమైన భాష గుర్తొస్తాయి. అదే హైదరాబాద్‌ ఫ్లేవర్‌ ను సిల్వర్ స్క్రీన్ పై చూపించేందుకు సిద్ధమవుతోంది అమీర్ లోగ్ సినిమా.

Update: 2026-07-25 16:56 GMT

హైదరాబాద్ అంటే బిర్యానీ, బోనాలు, బస్తీలు, ప్రత్యేకమైన భాష గుర్తొస్తాయి. అదే హైదరాబాద్‌ ఫ్లేవర్‌ ను సిల్వర్ స్క్రీన్ పై చూపించేందుకు సిద్ధమవుతోంది అమీర్ లోగ్ సినిమా. కంప్లీట్ హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఆ చిత్రం పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ అని, అయితే థ్రిల్లర్‌ లా చివరి వరకు ఆసక్తిని కలిగించే ట్విస్టులు కూడా ఇందులో ఉంటాయని నటుడు యోగి వెల్లడించారు.

అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌ పై మాధవి రెడ్డి సోమ రూపొందించిన తొలి చిత్రం అమీర్ లోగ్. రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించిన ఆ సినిమాకు మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఎంసీ హరి, మనోజ్, శశిధర్ లీడ్ రోల్స్ లో నటించిన ఆ సినిమాలో వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, యోగి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి సంస్థ స్పిరిట్ మీడియా ఆ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనుంది.

ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానున్న ఆ సినిమా రిలీజ్ డేట్ ను శనివారం అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. అదే ఈవెంట్ లో అవ్వల్ దావత్ అనే స్పెషల్ సాంగ్ కూడా విడుదల చేశారు. బోనాల పండుగ వాతావరణాన్ని రిఫ్లెక్ట్ చేసేలా రూపొందిన ఆ పాట ఇప్పటికే ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్ లో యాక్టర్ యోగి మాట్లాడుతూ.. ధునియా మొత్తానికి హైదరాబాద్ ఎంత ఫేమస్సో.. తమ సినిమా అంతే గుర్తింపు తెచ్చుకోవాలని అన్నారు.

"సినిమాలో అసలైన హైదరాబాద్ ఫీవర్ కనిపిస్తుంది. ఇది కేవలం ఫ్యామిలీ ఎంటర్టైనర్ మాత్రమే కాదు, థ్రిల్లర్‌లా చివరి వరకు ప్రేక్షకులను కట్టిపడేసే అంశాలు కూడా ఉన్నాయి. సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికెట్ ఇచ్చింది. థియేటర్‌లో చూస్తేనే ఈ సినిమా అసలు అనుభూతి తెలుస్తుంది" అని యోగి అన్నారు. నటి కీర్తి మాట్లాడుతూ.. తనది సినిమాలో చిన్న పాత్రేనని, దర్శకుడు రమణా రెడ్డి మంచి ఛాన్స్ కల్పించారని చెప్పారు. చిత్రంలోని ప్రతి పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, ముఖ్యంగా యోగి నటన ప్రత్యేకంగా నిలుస్తుందని ఆమె తెలిపారు.

అవ్వల్ దావత్ పాటకు సాహిత్యం అందించిన మనోజ్ కుమార్ మాట్లాడుతూ.. హైదరాబాద్ లాంగ్వేజ్, కల్చర్ రిఫ్లెక్ చేసేలా సాహిత్యం రాశానన్నారు. ఈ పాటకు హైదరాబాదీలు ఈజీగా కనెక్ట్ అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. నటుడు శశిధర్ మాట్లాడుతూ.. "ఇది పక్కా హైదరాబాద్ మూవీ. అవ్వల్ దావత్ పాటకు ఇప్పటికే మంచి స్పందన వస్తోంది. ఈ సినిమా హైదరాబాద్‌ కు మరింత పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాం" అని అన్నారు.

మరో నటుడు మనోజ్ మాట్లాడుతూ.. "మాది నల్గొండ. దర్శకుడు రమణా రెడ్డి కూడా నల్గొండకు చెందినవారే. మా సినిమా ప్రేక్షకులను నిరాశపరచదు. అందరికీ నచ్చేలా రూపొందించాం" అని పేర్కొన్నారు. హైదరాబాద్‌ నేటివిటీ, ఫ్యామిలీ ఎంటర్టైన్‌మెంట్‌, థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కిన అమీర్ లోగ్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో తెలుసుకోవాలంటే ఆగస్టు 21 వరకు వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News