సౌత్ మాస్ యాక్షన్ స్టైల్‌ని కాపీ కొడుతున్నారా?
సినిమాల్లోకి వ్యాపారం ప్రవేశించిన కారణంగా కళాత్మక స్వేచ్ఛను కోల్పోయామని స్టార్ హీరో షాహిద్ కపూర్ ఆవేదన చెందారు.;
సినిమాల్లోకి వ్యాపారం ప్రవేశించిన కారణంగా కళాత్మక స్వేచ్ఛను కోల్పోయామని స్టార్ హీరో షాహిద్ కపూర్ ఆవేదన చెందారు. ఇటీవలి కాలంలో బాలీవుడ్ నుంచి భారీ మాస్ యాక్షన్ సినిమాలను ప్రజలు కోరుకుంటున్నారని కూడా షాహిద్ బాహాటంగానే అభిప్రాయపడ్డారు. అయితే అతడు ఈ వ్యాఖ్యల్ని చేయడానికి కారణం లేకపోలేదు. ఇటీవలి కాలంలో క్రూరమైన హింస, యాక్షన్ అంశాలను కూడా ప్రజలు డైజెస్ట్ చేసుకుంటారని యానిమల్, మార్కో (మలయాళం) లాంటి సినిమాలు నిరూపించాయి. మంచి కథ కంటెంట్ తో పాటు మాస్ యాక్షన్ అంశాలు సరిగా కుదిరితే బ్లాక్ బస్టర్ ఖాయమని ఆ రెండు సినిమాలు నిరూపించాయి.
దీనికి తోడు షాహిద్ నటించిన కబీర్ సింగ్ కూడా కొన్ని రా అండ్ రస్టిక్ అంశాలు ఉన్న సినిమా. డ్రగ్స్ అడిక్షన్, స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి లక్షణాలతో హీరో పాత్ర రగ్డ్ గా ఉంటుంది. తన కెరీర్ కి బెస్ట్ హిట్ ని ఇచ్చింది ఇలాంటి ఊర మాస్ సినిమా. అందుకే షాహిద్ రెగ్యులర్ కథాంశాలతో తెరకెక్కే సినిమాలకంటే ఒక భిన్నమైన మాస్ యాక్షన్ కథాంశాలకు పట్టంగడుతున్నారనే అభిప్రాయం వ్యక్తం చేసారు. అయితే తాను మాత్రం అలాంటి సినిమాల్లో నటించడానికి అంగీకరించడం కొంచెం కష్టంగానే ఉందని అన్నారు.
ప్రస్తుతం షాహిద్ `ఓ రోమియో` లాంటి భిన్నమైన సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో అతడు ఒక డాన్ పాత్రలో కనిపిస్తాడు. ఈ పాత్ర కథానాయికతో అద్భుతమైన రొమాన్స్ కూడా చేస్తుంది. ఓ రోమియో ట్రైలర్ ఇటీవలే విడుదలై ఆకట్టుకుంది. ఇందులో షాహిద్ పాత్ర పూర్తి వైవిధ్యమైనది. ఇందులో షాహిద్ పోషిస్తున్న డాన్ పాత్ర సాధారణ యాక్షన్ సినిమాల్లో లాగా కాకుండా, చాలా గంభీరంగా, ఎమోషనల్‌గా ఉంటుంది. ఒక క్రూరమైన గ్యాంగ్‌స్టర్ మనసులో ఉండే ప్రేమికుడిని (రోమియో) ఈ చిత్రంలో చూడబోతున్నాం. షాహిద్ పాత్రలో మల్టీ డైమన్షన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని భావిస్తున్నారు.
ఇటీవలి కాలంలో షాహిద్ సరైన విజయం లేక డీలా పడిపోయాడు. అందుకే ఓ రోమియో చిత్రంతో పెద్ద హిట్టు కొట్టాలని కలలు కంటున్నాడు. దానికోసం తీవ్రంగానే శ్రమించినట్టు తెలుస్తోంది. హైదర్, కమీనే లాంటి క్లాసిక్ హిట్స్ ని తెరకెక్కించిన విశాల్ భరద్వాజ్ ఈసారి కూడా షాహిద్ ని వైవిధ్యంగా చూపిస్తున్నాడని అర్థమవుతోంది. ఇక షాహిద్ అభిప్రాయం ప్రకారం చూస్తే... సౌత్ మాసాలా యాక్షన్ సినిమాలనే హిందీ బెల్ట్ లో ఆదరిస్తున్నారని నిరూపణ అయింది