బరాబర్ ప్రేమిస్తా.. మరోసారి ట్రెండ్ అయ్యేలా చంద్రహాస్ కామెంట్స్
ఆటిట్యూడ్ స్టార్‌గా సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండే చంద్రహాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ బరాబర్ ప్రేమిస్తా.;
ఆటిట్యూడ్ స్టార్‌గా సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండే చంద్రహాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ బరాబర్ ప్రేమిస్తా. సంపద్ రుద్ర డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 6న గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో చంద్రహాస్ తన స్పీచ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. తన మీద వచ్చే ట్రోల్స్ గురించి గానీ, అంచనాల గురించి గానీ పెద్దగా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతానని మరోసారి తన మాటలతో క్లారిటీ ఇచ్చాడు.
ఈ వేడుకలో చంద్రహాస్ మాట్లాడుతూ.. ముందుగా గెస్టులుగా వచ్చిన ఆది సాయికుమార్, జేడీ చక్రవర్తి, జయంత్ సి పరాన్జీలకు థాంక్స్ చెప్పాడు. ఆది సాయికుమార్ తనకి పెద్ద ఇన్స్పిరేషన్ అని, ఎంత కష్టపడతారో ఆయనను చూసి నేర్చుకోవాలని అన్నాడు. అలాగే జయంత్ సార్ సినిమాలంటే తనకి చాలా ఇష్టమని, ఆయన ఎనర్జీ ఈ ఈవెంట్‌కి కొత్త కల తెచ్చిందని చెప్పాడు. తన తండ్రి ప్రభాకర్ తనని ఈ స్థాయిలో నిలబెట్టినందుకు ఆయనకి స్టేజ్ మీద కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎమోషనల్ అయ్యాడు.
సినిమా కంటెంట్ గురించి చెప్తూ.. బరాబర్ ప్రేమిస్తాలో ఒకటి కాదు రెండు కాదు.. మల్టిపుల్ ట్విస్ట్లు ఉంటాయని, ఆడియన్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరని కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశాడు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా బోర్ కొట్టకుండా హుక్ చేసి ఉంచుతుందని, క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషన్స్ అందరికీ కనెక్ట్ అవుతాయని అన్నాడు. సినిమాలో కామెడీ, డాన్సులు, సాంగ్స్ అన్నీ పక్కాగా కుదిరాయని చెప్పాడు. మ్యూజిక్ డైరెక్టర్ ధ్రువన్ ఇచ్చిన ఆల్బమ్ ఇప్పటికే మిలియన్స్ వ్యూస్ సాధించడంపై హ్యాపీగా ఉన్నట్లు తెలిపాడు.
హీరోయిన్ మేఘనా ముఖర్జీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తను మిస్ ఇండియా ఫైనలిస్ట్ అని, ఈ సినిమా తర్వాత తనకి ఆఫర్స్ క్యూ కడతాయని జోస్యం చెప్పాడు. పెద్ద హీరోయిన్ అయిపోయిన తర్వాత కూడా తనతో సినిమా చేస్తానని ఇప్పుడే ప్రామిస్ చేయాలంటూ స్టేజ్ మీద సరదాగా అడిగాడు. ప్రొడ్యూసర్లు చందు, చిన్ని, వెంకీలు సినిమా మీద ఉన్న ప్యాషన్‌తో ఎక్కడా తగ్గకుండా ఖర్చు చేశారని, వాళ్ళకి ఈ సినిమా పెద్ద సక్సెస్ ఇవ్వాలని కోరుకున్నాడు.
డైరెక్టర్ సంపద్ రుద్ర గురించి మాట్లాడుతూ.. తను ఈ సినిమాకి ఒక గమ్ లాంటివాడని, టీమ్ మొత్తాన్ని ఏకం చేసి అద్భుతంగా తీశారని మెచ్చుకున్నాడు. నన్ను చాలా బాగా చూపించావు బ్రదర్ అంటూ డైరెక్టర్‌ని పలకరించాడు. తనకి సపోర్ట్ చేసిన కెమెరామెన్ శేఖర్ తనను ఒక తమ్ముడిలా చూసుకున్నారని గుర్తు చేసుకున్నాడు. సినిమాలో తనకి యాంటాగనిస్ట్‌గా చేసిన అర్జున్ మహి కూడా చాలా స్పోర్టివ్‌గా యాక్ట్ చేశారని, ఆర్టిస్టులందరూ ప్రాణం పెట్టి పని చేశారని చెప్పాడు.
చివరగా ఒక పాట పాడి అందరినీ ఎంటర్టైన్ చేసిన చంద్రహాస్.. సినిమాలో సెన్సార్ రూల్స్ ప్రకారం క్లీన్ వెర్షనే ఉంటుందని, అందరూ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చని చెప్పాడు. ఏషియన్ సినిమాస్ లాంటి పెద్ద సంస్థ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల ఆడియన్స్‌కి బాగా చేరువవుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఫిబ్రవరి 6న థియేటర్లకి వచ్చి సినిమా చూడాలని, తనని మాత్రమే కాకుండా తన టీమ్ మొత్తాన్ని సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్ చేశాడు.