చీరకట్టులో ఫంకీ బ్యూటీ సోయగాలు!
ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అదృష్టవశాత్తు ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో పాపులారిటీ లభించింది అంటే ఇక మళ్ళీ వారు వెను తిరిగి చూడాల్సిన అవసరం ఉండదు.;
ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అదృష్టవశాత్తు ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో పాపులారిటీ లభించింది అంటే ఇక మళ్ళీ వారు వెను తిరిగి చూడాల్సిన అవసరం ఉండదు. అటు వరుసగా అవకాశాలు లభిస్తూనే ఉంటాయి.. ముఖ్యంగా తమ నటనతో, అందంతో ప్రేక్షకులను మెప్పించగలిగితే.. ఆ సెలబ్రిటీలు ఇండస్ట్రీలో పది కాలాలపాటు చల్లగా ఉంటారు అనడంలో సందేహం లేదు. అలా ఇప్పటికే ఎంతోమంది తమ అద్భుతమైన నటనతో ఆకట్టుకుంటున్నారు. ఇకపోతే నటనతో అందంతో అలరించడమే కాదు ఇటు సోషల్ మీడియాలో కూడా తమ గ్లామర్ తో ప్రేక్షకులను మెప్పించాల్సి ఉంటుంది.
అలా సోషల్ మీడియాలో రోజుకొక ట్రెండీ అవుట్ ఫిట్ తో ప్రేక్షకులను అలరిస్తూ మరింత ఆకట్టుకుంటున్న భామలలో కయాదు లోహర్ కూడా ఒకరు. మోడల్ గా కెరియర్ ను ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ.. 2021లో వచ్చిన కన్నడ చిత్రం మొగిల్ పేట చిత్రంతో నటిగా అరంగేట్రం చేసింది. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలా కన్నడ చిత్రం ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈమె ఆ తర్వాత మలయాళంలో ఘనవిజయం అందుకున్న పాథోన్ పథం నూట్టండు చిత్రం తెలుగులో పులి: ది 19త్ సెంచరీ పేరుతో 2023 ఫిబ్రవరి 24న విడుదల చేసి, ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.
అలాంటి ఈ ముద్దుగుమ్మ అల్లూరి వంటి చిత్రంలో తెలుగులో నేరుగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ పెద్దగా పాపులారిటీ లభించలేదు. ఆ తర్వాత మరాఠీ, మలయాళం చిత్రాలలో నటించినా రాని గుర్తింపు తమిళంలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా వచ్చిన డ్రాగన్ సినిమాతో ఒక్కసారిగా పాపులారిటీ లభించింది. ఈ ఒక్క సినిమాతో అటు తమిళ్లోనే కాదు ఇటు తెలుగులో కూడా మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది.
అలాంటి ఈ ముద్దుగుమ్మ తెలుగులో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న ఫంకీ సినిమాలో హీరోయిన్ గా అవకాశం అందుకుంది. జాతి రత్నాలు సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్న అనుదీప్ కేవీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ సాయి సౌజన్య నిర్మిస్తున్నారు 2026 ఫిబ్రవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాంబోతోంది.
ఇక విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో అటు ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా చేపట్టారు చిత్ర బృందం. అందులో భాగంగానే కయాదు లోహర్ కూడా తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. చీర కట్టులో గ్లామర్ వలకబోస్తూ కయాదు షేర్ చేసిన ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. బ్లూ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ లో ఉన్న ఈ చీర ఈమె అందాన్ని మరింత రెట్టింపు చేసిందని చెప్పవచ్చు. ఈమె ఫోటోలకు అభిమానులు లవ్ , ఫైర్ ఎమోజీలను షేర్ చేస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఫంకీ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమైన కయాదు లోహర్ ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.