• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  SSMB29: అఫీషియల్ గా లెక్క...

SSMB29: అఫీషియల్ గా లెక్క తేల్చేశారు

| ముఖ్యంగా విరేన్ స్వామీ అనే క్యాస్టింగ్ డైరెక్టర్ సినిమాకు వర్క్ చేస్తున్నారు అంటూ వచ్చిన ఒక ఆంగ్ల పత్రిక కథనంపై స్పందించిన మేకర్స్ అందులో ఎలాంటి నిజం లేదని

By - Tupaki Desk
Update: 2024-05-17 04:40 GMT

రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న బిగ్ బడ్జెట్ పాన్ వరల్డ్ మూవీ SSMB29 పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తప్పకుండా సినిమా నెవర్ బిఫోర్ అనేలా ఉంటుంది అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఈ సినిమా గురించి అలాగే నటీనటుల గురించి టెక్నీషియన్స్ గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వక పోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం అనేక రకాల గాసిప్స్ పుట్టుకొస్తూ ఉన్నాయి.

 

సినిమా కోసం దాదాపు 1500 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించారని అలాగే హాలీవుడ్ నుంచి కూడా కొంతమంది స్టార్ యాక్టర్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా వివిధ రకాల కథనాలు అయితే వెలుపడ్డాయి. అయితే ఈ విషయంపై మొదటి సారి చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ దుర్గా ఆర్ట్స్ నుంచి అఫీషియల్ గా ఒక క్లారిటీ రావడం విశేషం. మహేష్ బాబు రాజమౌళి ప్రాజెక్ట్ తెరపైకి రాబోతోంది అని రెండేళ్ల క్రితం క్లారిటీ ఇచ్చిన ఈ నిర్మాణ సంస్థ మళ్ళీ ఇన్నాళ్లకు వైరల్ అవుతున్న రూమర్స్ పై క్లారిటీ ఇవ్వడం విశేషం.

ఈ సినిమాలో ఇండోనేషియాకు చెందిన ఒక నటిని తీసుకున్నారు అని ఆమె మహేష్ బాబు జోడిగా నటించబోతుందని కొన్ని కథనాలు వైరల్ అయిన విషయం తెలిసిందే. అలాగే టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా ఒక స్పెషల్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా రూమర్స్ వచ్చాయి. ఇక మోహన్ లాల్, విక్రమ్, దీపిక పదుకొనే లాంటి పేర్లు కూడా గట్టిగానే వినిపించాయి.

ముఖ్యంగా విరేన్ స్వామీ అనే క్యాస్టింగ్ డైరెక్టర్ సినిమాకు వర్క్ చేస్తున్నారు అంటూ వచ్చిన ఒక ఆంగ్ల పత్రిక కథనంపై స్పందించిన మేకర్స్ అందులో ఎలాంటి నిజం లేదని, సినిమా ప్రొడక్షన్ లో అతను భాగం కాదని శ్రీ దుర్గా అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. సినిమా గురించి ఏది ఉన్నా అఫీషియల్ గా తామే ఎనౌన్స్ చేస్తామని కూడా నిర్మాత లక్ష్మీ నారాయణ లేఖలో వివరణ ఇచ్చారు.

ఇప్పటివరకు సినిమాపై ఎన్నో రకాల గాసిప్స్ అయితే వచ్చాయి. అయితే వాటిలో ఎంత నిజం ఉందనే విషయంలో పెద్దగా క్లారిటీ ఇవ్వలేదు. ఎప్పుడు ఏది ఎలా ఎనౌన్స్ చేయాలో రాజమౌళికి బాగా తెలుసు. జక్కన్న ప్లానింగ్ లేనిదే ఏ అప్డేట్ ఇవ్వడు అనే విషయం తెలిసిందే. కాబట్టి అఫీషియల్ క్లారిటీ వచ్చే వరకు ఫ్యాన్స్ ఎదురుచూడాల్సిందే. ఇక ఈ ప్రాజెక్టు కోసం మహేష్ న్యూ లుక్ తో రెడీ అవుతున్నాడు. త్వరలోనే అతని లుక్ కోసం ప్రత్యేకంగా ఒక వర్క్ షాప్ నిర్వహించే అవకాశం ఉంది.

Tags:    
  • Ssrajamouli 
  • Maheshbabu 
  • Ssmb29 
  • Adventuremovie 
  • Sridurgaarts 
  • Virenswami 
  • Indonesia 
  • Nagarajuna 
  • Vikram 
  • Deepika 
  • Mohanlal 
  • Socialmediarumors 

Similar News

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

Copyright @2026

Powered by Blink CMS