విభీషణుడి పాత్ర.. నిజ జీవితంలోనూ ధర్మాన్ని ఎంచుకున్న వివేక్ ఒబెరాయ్

విభీషణుడి పాత్రలో నటిస్తూ నిజ జీవితంలోనూ ధర్మం వైపు అడుగు వేస్తున్న బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్.

Update: 2026-07-31 07:55 GMT

విభీషణుడి పాత్రలో నటిస్తూ నిజ జీవితంలోనూ ధర్మం వైపు అడుగు వేస్తున్న బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణ సినిమాలో విభీషణుడి పాత్ర పోషిస్తున్న ఆయన, ఈ సినిమా కోసం తీసుకోవాల్సిన రెమ్యూన‌రేష‌న్ ను పూర్తిగా క్యాన్సర్‌తో పోరాడుతున్న పిల్ల‌ల ట్రీట్‌మెంట్ కోసం విరాళంగా ఇవ్వాలని డిసైడ‌వ‌డం ప్రత్యేక చర్చకు దారి తీసింది. ఈ విషయాన్ని నిర్మాత నమిత్ మల్హోత్రాకు ముందుగానే తెలిపినట్లు వివేక్ వెల్లడించారు.

రామాయణంలో విభీషణుడు కేవలం రావణుడి సోదరుడు మాత్రమే కాదు, అధర్మం ముందు మౌనంగా నిలబడకుండా ధర్మాన్ని ఎంచుకున్న వ్యక్తి. కుటుంబ బంధాల కంటే న్యాయం గొప్పదని నమ్మి రాముడి వైపు నిలిచిన పాత్రగా విభీషణుడు భారతీయ ఇతిహాసంలో ప్రత్యేక స్థానం సంపాదించారు. అలాంటి పాత్రను పోషిస్తున్న సమయంలోనే తన రెమ్యూన‌రేష‌న్ ను సమాజానికి తిరిగి అందించాలని వివేక్ తీసుకున్న డెసిష‌న్, పాత్రకు మరియు వ్యక్తిగత జీవితానికి మధ్య ఒక ఆసక్తికరమైన అనుసంధానాన్ని సృష్టిస్తోంది.

ప్రస్తుతం బాలీవుడ్‌లో న‌టులు కోట్ల రూపాయల రెమ్యూన‌రేష‌న్లు, లాభాల్లో వాటాలు, భారీ ఆఫ‌ర్స్ పొంద‌డం చాలా కామ‌న్ అయిపోయిన్ పరిస్థితిలో, ఒక ప్రిస్టీజియ‌స్ ప్రాజెక్టుకు అస‌లు ఫీజు తీసుకోకుండా వ‌ర్క్ చేయ‌డం అరుదైన నిర్ణయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా భారీ బడ్జెట్‌తో, ప్రపంచ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందుతున్న రామాయణ వంటి సినిమాలో నటిస్తూ రెమ్యూన‌రేష‌న్ ను పూర్తిగా డొనేట్ చేయడం, డబ్బు కంటే ఒక టార్గెట్ ను ముందుంచిన డెసిష‌న్ గా చెప్పొచ్చు.

వివేక్ ఒబెరాయ్ మాట‌ల్లో కూడా ఇదే భావన స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ప్రాజెక్ట్‌ను ఆయన కేవలం మరో అవకాశంగా కాకుండా, ఇండియ‌న్ సినిమాను ప్రపంచ వేదికపై నిలబెట్టే ప్రయత్నంగా చూస్తున్నారు. అందుకే ఈ సినిమాలో భాగస్వామ్యం కావడం తనకు ఒక క్రియేటివ్ జ‌ర్నీ మాత్ర‌మే కాకుండా, ప‌ర్స‌న‌ల్‌గా కూడా అర్థవంతమైన అనుభవమని పేర్కొన్నారు.

సెలబ్రిటీల దాతృత్వం కొత్త విషయం కాకపోయినా, ఒక పురాణ పాత్రలోని ధర్మబోధను నిజ జీవిత సేవా కార్యక్రమంతో కలిపి చూపించే సందర్భాలు చాలా అరుదు. విభీషణుడు అధర్మాన్ని విడిచి ధర్మాన్ని ఎంచుకున్నట్లే, వివేక్ ఒబెరాయ్ తన పారితోషికాన్ని వదులుకుని క్యాన్సర్‌తో పోరాడుతున్న పిల్లల కోసం వినియోగించాలని నిర్ణయించుకోవ‌డం, ఈ వార్తకు కేవలం సినీ విలువనే కాకుండా ఒక సామాజిక, నైతిక పరిమాణాన్ని కూడా జోడిస్తోంది. అందుకే ఆయన డెసిష‌న్ ఇప్పుడు రామాయణ ప్రచారంలో భాగమైన ఒక వార్తగా కాకుండా ధర్మం, త్యాగం, సేవ అనే విలువలను గుర్తు చేసే ఒక ప్ర‌త్యేక అడుగుగా మారింది.

Tags:    

Similar News