ఇన్నాళ్లకు గురువుకు తగ్గ శిష్యుడిగా!
ఇండస్ట్రీలో చాలా మంది శిష్యులకు గురువులుంటారు. కానీ గురువులందరి పేర్లు బయటకు రావు.;
ఇండస్ట్రీలో చాలా మంది శిష్యులకు గురువులుంటారు. కానీ గురువులందరి పేర్లు బయటకు రావు. అలా సంచలనమైంది ఎవరు? అంటే సుకుమార్-బచ్చిబాబు ల గురుశిష్యల బంధమే. బుచ్చిబాబు గురించి సుకుమార్ గర్వంగా తన శిష్యుడు అని పదే పదే చెప్పడంతోనే అతడు వెలుగులోకి వచ్చాడు. దీంతో పాటు బుచ్చిబాబు ప్రతిభావంతుడైన దర్శకుడు కావడంతో మరింత ఫేమస్ అయ్యాడు. ఇలా ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో ఫేమస్ అయింది వీరిద్దరే. మరి గురూజీ త్రివిక్రమ్ కి అలాంటి శిష్యుడు ఎవరైనా ఉన్నారా? అంటే ఆయన విషయంలో ఇలాంటివి పెద్దగా వెలుగులోకి రాలేదు.
కానీ వెంకీ అట్లూరీ మాత్రం గురూజీ శిష్యుడినే. కెరీర్ ప్రారంభంలో మాటల మాంత్రికుడు వద్ద శ్రీనివాస్ వద్ద శిష్యరికం చేశాడు. కేవలం దర్శకత్వ శాఖలోనే కాకుండా, స్క్రిప్ట్ రాయడంలో , మాటల కూర్పులో త్రివిక్రమ్ శైలిని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన `జులాయి` వంటి సినిమాలకు వెంకీ అట్లూరి రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశారు. ఆ సమయంలోనే కథను ఎలా డీల్ చేయాలి? పాత్రల మధ్య సంభాషణలు ఎంత బలంగా ఉండాలి? అనే విషయాలను నేర్చుకున్నారు. వెంకీ అట్లూరి తీసిన సినిమాల్లో `తొలిప్రేమ`, `మిస్టర్ మజ్ను`, `రంగ్ దే` చిత్రాల్లో అక్కడక్కడా త్రివిక్రమ్ మార్క్ కనిపిస్తుంది.
త్రివిక్రమ్ సినిమాల్లో ఉండే ఒక రకమైన సున్నితత్వం, ఫ్యామిలీ ఎమోషన్స్ వెంకీ సినిమాల్లోనూ ఉంటాయి. చిన్న మాటలతోనే పెద్ద అర్థం వచ్చేలా డైలాగ్స్ రాయడం వెంకీకి తన గురువు నుంచే అబ్బిన విద్య. అయితే టైటిల్స్ పరంగా గురూజీని మాత్రం ఇంతవరకూ శిష్యుడు అనుకరించలేదు. తాజాగా ఆ విషయంలో గురువుకు ఏం తక్కు వ కాదని ప్రూవ్ చేస్తున్నాడు. ప్రస్తుతం వెంకీ అట్లూరి సూర్య కథానాయకుడిగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి `విశ్వనాధ్ అండ్ సన్స్` అనే టైటిల్ నిర్ణయించారు. సాధారణంగా ఇలాంటి టైటిల్ పడిందంటే అది త్రివిక్రమ్ సినిమా అనుకుంటారు.
ఇలాంటి క్లాసీ టైటిల్స్ ..ఫ్యామిలీ టైటిల్స్ గురూజీ సినిమాలకే కనిపిస్తాయి. సరిగ్గా అలాంటి టైటిల్ నే సూర్య సినిమాకు వెంకీ అట్లూరి ఎంచుకోవడంతో అసలైన గురువును ఇప్పుడు తలపిస్తున్నాడా? అనిపిస్తుంది.ఈ టైటిల్ వెలుగులోకి రాగానే తెలుగు ప్రేక్షకులందరికీ గురూజీనే తట్టేసాడు. అతడే ఈ టైటిల్ సూచించారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో వెంకీ అట్లూరి తెరకెక్కించిన `సార్, `లక్కీ భాస్కర్` చిత్రాలకుత్రివిక్రమ్ స్క్రిప్ట్ విషయంలో వెంకీకి కొన్ని సలహాలు ఇచ్చారు. ఈ సినిమాల ఘనవిజయం వెనుక గురువు ప్రోత్సాహం ఎంతో ఉందని వెంకీ అట్లూరి స్వయంగా పలు సందర్భాల్లోనూ చెప్పారు. ఈ నేపథ్యంలో విశ్వనాధ్ అండ్ సన్స్ వెనుక కూడా గురూజీ హస్తం ఉందా? అన్న సందేహాలు మొదలయ్యాయి.