మాస్ కా దాస్.. అల ఇటలీ నగరంలో..!

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ రీసెంట్ గా లైలా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఐతే సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.;

Update: 2025-04-22 20:30 GMT

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ రీసెంట్ గా లైలా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఐతే సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. తన ప్రతి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టడం పక్కా అన్న వైబ్ ఇచ్చే విశ్వక్ సేన్ రిజల్ట్ విషయంలో మాత్రం ఎందుకో వెనుక పడుతున్నారు. పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తే 100 కోట్లు కలెక్ట్ చేయగల స్టామినా ఉన్న ఈ హీరోకి ఎందుకో ఈమధ్య లక్ కలిసి రావట్లేదు. లైలా సినిమాపై ప్రేక్షకులు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తూ ఇక మీదట మిమ్మల్ని మరింత మెప్పించే సినిమాలు చేస్తా అంటూ విశ్వక్ సేన్ రిలీజ్ చేసిన నోట్ ఇంప్రెస్ చేసింది.

ఐతే విశ్వక్ సేన్ నెక్స్ట్ సినిమా ఏంటంటూ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అతని ఫ్యాన్స్. వరుసగా మూడు నాలుగు సినిమాలు చేసిన విశ్వక్ వాటి ఫలితాలతో అసంతృప్తిగా ఉన్నట్టు అర్థమవుతుంది. అందుకే నెక్స్ట్ చేయబోయే సినిమా హిట్ టార్గెట్ ని పెట్టుకున్నాడు. అందుకే ఎలాంటి తొందర లేకుండా ప్లాన్ చేస్తున్నాడు. ఐతే ఇప్పటికే నెక్స్ట్ సినిమా కథ ఓకే అయినా ఇంకా డిస్కషన్ స్టేజ్ లోనే ఉన్నట్టు తెలుస్తుంది.

ఈలోగా విశ్వక్ సేన్ అలా జాలీ ట్రిప్ వేసినట్టు కనిపిస్తుంది. ప్రస్తుతం మాస్ కా దాస్ విశ్వక్ సేన్ జాలీ మోడ్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇటలీ నగరంలో అలా సరదాగా తిరుగుతున్నాడు. విశ్వక్ సేన్ క్యాజువల్ గానే ఇటలీ వెళ్లాడా లేదా ఏదైనా పని మీద వెళ్లాడా అన్నది తెలియాల్సి ఉంది. అక్కడ యువ హీరో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు విశ్వక్ సేన్.

టన్నులు కొద్దీ టాలెంట్ ఉన్నా కూడా సరైన సినిమా పడక విశ్వక్ సేన్ కాస్త వెనకపడ్డాడు. అందుకే నెక్స్ట్ సినిమా కొడితే బాక్సాఫీస్ షేక్ అవ్వాలనే ఉద్దేశంతోనే టైం తీసుకుంటున్నాడని తెలుస్తుంది. ఇటలీ ట్రిప్ ముగించుకుని రాగానే నెక్స్ట్ సినిమా అప్డేట్ ఇచ్చే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. జోనర్ ఏదైనా, కథ ఎలాంటిదైనా పర్ఫెక్ట్ గా సూటయ్యే హీరోలు కొందరు ఉంటారు.. అంతేకాదు క్లాస్ మాస్ అనే తేడా లేకుండా సినిమాలు చేసే అవకాశం ఉన్న కటౌట్ కొందరికి ఉంటుంది. సో అలాంటి వారిలో ఒకడైన విశ్వక్ సేన్ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని అతని ఫ్యాన్స్ కోరుతున్నారు. మరి మాస్ కా దాస్ విశ్వక్ నెక్స్ట్ సినిమా ఏంటన్నది చూడాలి.

Tags:    

Similar News