దేవరకొండ.. VD 14లో ఫస్ట్ టైమ్ ఇలా..

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వరుస ప్రాజెక్టులను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే.

Update: 2024-05-11 09:32 GMT

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వరుస ప్రాజెక్టులను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరితో పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేస్తున్న ఆయన.. ఇటీవల బర్త్ డే సందర్భంగా రెండు కొత్త ప్రాజెక్టులను అనౌన్స్ చేశారు. అందులో ఒకటి.. 'రాజావారు రాణిగారు' ఫేమ్ రవి కిరణ్ కోలా దర్శకత్వంలో రూరల్ యాక్షన్ డ్రామా కాగా.. మరొకటి రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్ లో చేయనున్న మూవీ.

సూపర్ హిట్ మూవీ 'టాక్సీవాలా' తర్వాత విజయ్ దేవరకొండ, రాహుల్ సాంకృత్యాన్ మరోసారి కలిసి పనిచేస్తున్నారు. అయితే వీరి కాంబోలో వస్తున్న కొత్త మూవీ.. 'టాక్సీవాలా' కంటే భారీగా ఉండబోతోంది. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న VD 14 ఆడియన్స్ కు ఒక ఎపిక్ లాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

అయితే మేకర్స్ రిలీజ్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్.. ఆడియన్స్ లో మంచి హైప్ క్రియేట్ చేసింది. పోస్టర్ లో బీటలు వారిన పంట పొలాల్లో రాతిపై ఓ వీరుడి విగ్రహం చెక్కి ఉంది. ఆ విగ్రహం మీద 'ది లెజెండ్ ఆఫ్ ది కర్స్డ్ ల్యాండ్' అని రాసి ఉంది. ఆ వీరుడు 1854 నుంచి 1878 వరకు జీవించి ఉన్నట్టు మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని 18వ శతాబ్దం నేపథ్యంలో వాస్తవిక చారిత్రక సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.

Read more!

ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన కొత్త అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో విజయ్ దేవరకొండ డ్యుయల్ రోల్ లో కనిపించనున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అది కూడా తండ్రీకొడుకులుగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి విజయ్ తన కెరీర్ లో తొలిసారి డ్యుయల్ రోల్ చేస్తున్నారన్నమాట. ఇప్పుడు ఈ విషయం తెలుసుకున్న ఆయన ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. డైరెక్టర్ పెద్ద ప్లానే వేస్తున్నట్లు ఉందని చెబుతున్నారు.

రూ.100 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. డియర్ కామ్రేడ్, ఖుషి చిత్రాల తర్వాత మైత్రీ బ్యానర్ లో విజయ్ మూడో మూవీ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక నటిస్తున్నట్లు టాక్. మూడోసారి విజయ్, రష్మిక కలిసి నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి అది నిజమో కాదో తెలియాలంటే వేచి చూడాలి.

Tags:    

Similar News